శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 371-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 371-1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 371-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 371-1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 81. పరా, ప్రత్యక్చితీ రూపా, పశ్యంతీ, పరదేవతా ।
మధ్యమా, వైఖరీరూపా, భక్తమానస హంసికా ॥ 81 ॥ 🍀
🌻 371 -1. ‘వైఖరీ రూపా’🌻
వైఖరీ వాక్ స్వరూపిణి శ్రీదేవి అని అర్థము. వైఖరీ అనగా వినబడు వాక్కు. కంఠము నుండి వ్యక్తమై ముఖము నుండి పలుకబడును. లోకులు ఈ వాక్కు ఆధారముగనే తమ తమ కార్యములను చక్కబెట్టుకొను చున్నారు. శబ్దార్థములతో కూడిన వైఖరియే మానవునికి అతి విశిష్టము, ప్రధానము అగు శక్తియై నిలచినది. వాక్కు ద్వారా సమస్తమును జయించ వచ్చును. మృదుమధుర మగు భాషణము నుండి దుర్భాషణముల వరకు వాక్కు జీవుని తరింప జేయుటయో, నశింపజేయుటయో చేయుచున్నది. వైఖరీ వాక్కు మహా శక్తివంతమైనది. మానవుడు తన్ను తాను ఉద్ధరించుకొనుటకు గాని, పతనము గావించుకొనుటకు గాని వైఖరీ వాక్కే సాధన మగుచున్నది.
వైఖరీ వాక్కును సరిదిద్దుకొనినచో స్వభావము సరిదిద్దబడ గలదు. తోచిన దెల్ల మాట్లాడుట లోక సహజము. అట్టి మాట మాట్లాడుటగా కాక వదరుటగా తెలుపుదురు. అట్టివారిని వదరుబోతు లందురు. మాటాడుటకు ఎన్నియో నియమములు కలవు. ప్రస్తుతమున అవి ఏవియూ పాటింపబడుట లేదు. మానవుల పతనములకు కారణములలో వైఖరీ దుర్వినియోగ మొకటి. పదములను ఏరికోరి ఆచి తూచి మాట్లాడువారు కద్దు. ప్రియ భాషణము కూడ కడ్డే. "సజ్జనుండు పలుకు చల్లగాను” అనునది జాతి మరచినది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 371 -1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 81.Parapratyakchitirupa pashyanti paradevata
Madhyama vaikharirupa bhaktamanasa hansika ॥ 81 ॥ 🌻
🌻 371-1. Vaikhari-rūpā वैखरि-रूपा 🌻
Vaikhari is the fourth and final form of sound in its evolution. This is the state wherein the sound is heard. This is called vaikhari because the sound is produced by a modified form of prāṇa called vaikihari.
This is the stage which is called aparā or non-supreme stage in the evolution of sound where there exists fully developed materialization, combined with time and space, the components of māyā.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
13 May 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment