శ్రీ శివ మహా పురాణము - 563 / Sri Siva Maha Purana - 563


🌹 . శ్రీ శివ మహా పురాణము - 563 / Sri Siva Maha Purana - 563 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః - అధ్యాయము - 54 🌴

🌻. పతివ్రతా ధర్మములు - 1 🌻


బ్రహ్మ ఇట్లు పలికెను-

అపుడు సప్తర్షులు హిమవంతునితో'ఓ పర్వతరాజా! నీ కుమార్తె యగు పార్వతీ దేవి యొక్క యాత్రకు ఈనాడు బాగున్నది గాన ఏర్పాట్లను చేయుము' అని చెప్పిరి (1). పర్వతరాజు ఈ మాటను విని కుమార్తె యొక్క విరహమును స్మరించి మహాప్రేమచే దుఃఖితుడాయెను. ఓ మహార్షీ! ఆతడు కొంతసేపు స్పృహను గోల్పోయెను (2).

తరువాత ఆ పర్వతరాజు కొంతసేపటికి తెలివిని దెచ్చుకొని 'అటులనే' అని పలికి మేనా దేవికి సందేశమును పంపెను (3). ఓ మునీ! ఆనంద దుఃఖములతో ఒక్కసారి నిండిన మనస్సుగల మేన హిమవంతుని సందేశమును విని పార్వతిని సాగనంపుటకు సంసిద్ధురాలాయెను (4).

ఓ మునీ! ఆమె వేదోక్త విధానమును, తమకులాచారమును యథావిధిగా పాటించెను. అపుడుచట గొప్ప ఉత్సవము ఆరంభమయ్యెను. హిమవత్పత్నియగు ఆ మేన (5) శ్రేష్ఠమగు పట్టు వస్త్రములతో, రాజుయొక్క హోదాకు తగిన పన్నెండు రకముల ఆభరణములతో పార్వతిని అలంకరించెను (6). పతివ్రతయగు ఒక బ్రాహ్మణపత్నిమేన యొక్క మనోగతము నెరింగి గొప్ప పాతివ్రత్య వ్రతమును గురించి పార్వతికి బోధించెను (7).


బ్రాహ్మణస్త్రీ ఇట్లు పలికెను-

ఓ పార్వతీ! ధర్మమును వృద్ధి పొందించునది, ఇహపరములయందు ఆనందమును కలిగించునది, సుఖకరమైనది అగు నా మాటను ప్రీతితో వినుము (8). పతివ్రతయగు స్త్రీ ధన్యురాలు. అట్టి స్త్రీని మాత్రమే ప్రత్యేకముగా పూజించవలెను. ఆమె సర్వలోకములను పవిత్రము చేయును. సర్వపాప పుంజములను నశింపజేయును (9).

ఓ పార్వతీ! ఏ స్త్రీ భర్తను ప్రేమతో పరమేశ్వరుని వలె సేవించునో, ఆ స్త్రీ ఇహలోకములో భోగములనన్నిటినీ అనుభవించి, దేహమును వీడిన తరువాత శుభగతిని భర్తతో గూడి పొందును (10).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 563 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (3): Pārvatī-khaṇḍa - CHAPTER 54 🌴


🌻 Description of the duties of the chaste wife - 1 🌻



Brahmā said:—

1. Then the seven sages spoke to the lord of the mountains—“O mountain, make arrangements for the journey of your daughter today itself.”

2. O great sage, on hearing these words and knowing her pangs of separation, the lord of mountains was greatly affected by his love towards her and remained silent for a short while.

3. After some time, the lord of the mountains regained his consciousness and said—“Let it be so”. He then sent the message to Menā.

4. O sage, on hearing the message of the mountain, Menā was both delighted and sorry. She immediately set about arranging for her journey.

5. O sage, Menā, the beloved of the mountain, made arrangements for all kinds of festivities in accordance with the tradition of her family and the injunctions of the Vedas.

6. She bedecked Pārvatī with twelve kinds of ornaments and good silken garments of nice border. All kinds of embellishments befitting her royal state were made.

7. Realising Menā’s inclinations a chaste brahmin lady instructed Pārvatī in the duties of a chaste wife.


The brahmin lady said:—

8. O Pārvatī, listen to my words with love that accentuate righteousness, that increase the pleasure here and hereafter and afford happiness to those who pay heed to them.

9. A chaste lady sanctifies the worlds, destroys sins and is blessed. None else is so worthy of respect.

10. O Pārvatī, she who serves her husband with love and considers him her sole lord, enjoys all pleasures here and obtains salvation hereafter along with her husband.


Continues....

🌹🌹🌹🌹🌹


13 May 2022

No comments:

Post a Comment