శ్రీ శివ మహా పురాణము - 590 / Sri Siva Maha Purana - 590


🌹 . శ్రీ శివ మహా పురాణము - 590 / Sri Siva Maha Purana - 590 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి

📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 03 🌴

🌻. కార్తికేయుని లీలలు - 3 🌻


బాలకుడు, కుమారుడను పేరు గలవాడు, సూర్యుని కంటె అధిక తేజశ్శాలి యగు ఆ శివపుత్రుని వారు పాలు కావలసినపుడు స్తన్యము నిచ్చి పెంచిరి (32). ఓ కుమారా! వారు తమ కళ్ల ఎదుట నుండి ఆ బాలకుడు క్షణమైననూ మరుగు కాని విధముగా పెంచిరి. ఆ బాలుని ఎవరు పెంచితే వారికి అతడు ప్రాణములకంటె అధిక ప్రేమాస్పదుడయ్యెను (33).

వారు ఆ బాలకునకు ముల్లోకములలో దుర్లభమగు వస్త్రములను, శ్రేష్ఠములగు ఆభరణములను ప్రేమతో నిచ్చిరి (34). మహా ప్రభుడగు ఆ బాలకునకు వారు ప్రశంసార్హములు, రుచ్యములు అగు పదార్థములను శ్రద్ధతో భుజింపజేసి దిన దిన ప్రవర్ధమానుడగునట్లు పోషించిరి (35).

కుమారా! తరువాత ఒకనాడు కృత్తికా పుత్రుడగు ఆ బాలుడు దేవసభకు వెళ్లి చక్కని వృత్తాంతమును ఘటిల్ల జేసెను (36). గొప్పలీలలను ప్రదర్శించే ఆ బాలకుడు విష్ణువుతో కూడియున్న దేవలందరికీ తన మహిమను చూపెను (37). అచ్యుతునితో మరియు ఋషులతో గూడియున్న దేవతలు గొప్ప ఆశ్చర్యమును పొంది ఆ బాలకుని ప్రశ్నించిరి (38).

నీవెవరివి? అని వారు ప్రశ్నించగా ఆతడేమియూ పలుకకుండగా వెంటనే తన నివాసమునకు వెళ్లి పూర్వమువలెనే రహస్యముగా నుండెను (39).

శ్రీ శివమహాపురాణములోని రుద్ర సంహితయందు కుమార ఖండలో కార్తికేయుని లీలలు అనే మూడవ అధ్యాయము ముగిసినది (3).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 590 🌹

✍️ J.L. SHASTRI
📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 03 🌴

🌻 The boyhood sports of Kārttikeya - 3 🌻

32-33. Realising his desire, the Kṛttikās, O sage, took him to their region joyously. Feeding him with their breast milk they nursed and nurtured Śiva’s son who was more refulgent than the sun.

34. They never let him go out of their sight. He became the object of their love, dearer to them than their own lives. Verily he who nurses and nurtures the child has the right of possession over the son.[3]

35. With great love they gave him the rarest garments and excellent ornaments in the three worlds.

36. Feeding him specially on the choicest delicacies day by day they brought up the boy prodigy.

37. O dear, once that son of the Krttikās went to the celestial assembly and showed wonderful feats.

38. The boy of wonderful miracles showed his rare splendour to the gods including Viṣṇu.

39-40. On seeing him, the gods and sages including Viṣṇu became surprised and asked the boy “Pray, who are you?” On hearing it he did not say anything in reply. He returned to his abode and remained concealed as before.


Continues....

🌹🌹🌹🌹🌹


08 Jul 2022

No comments:

Post a Comment