2) 🌹 కపిల గీత - 35 / Kapila Gita - 35🌹
3) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 75 / Agni Maha Purana - 75🌹
4) 🌹. శివ మహా పురాణము - 591 / Siva Maha Purana - 591🌹
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 210 / Osho Daily Meditations - 210🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 384-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 384-2🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 08, July 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ శుక్రవారం, భృగు వాసరే, Friday*
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు🌻*
*🍀. శ్రీ మహాలక్ష్మీ సుప్రభాతం - 5 🍀*
*5. చన్ద్రానుజే కమలకోమలగర్భజాతే చన్ద్రార్కవహ్నినయనే శుభచన్ద్రవక్త్రే ।*
*హే చన్ద్రికాసమసుశీతలమన్దహాసే శ్రీలక్ష్మి భక్తవరదే తవ సుప్రభాతమ్ ॥*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : ధైర్యమూ, ప్రేమ, - ఇవి రెండే తప్పనిసరిగా వుండవలసిన ముఖ్య సుగుణాలు. తక్కిన అన్ని సుగుణాలూ తిరోహితమై పోయినా, లేక నిద్రాణమై వున్నా, ఆత్మను ఈ రెండు సుగుణాలూ ఉద్ధరించ గలవు. 🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, ఆషాఢ మాసం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
తిథి: శుక్ల-నవమి 18:26:39 వరకు
తదుపరి శుక్ల-దశమి
నక్షత్రం: చిత్ర 12:14:04 వరకు
తదుపరి స్వాతి
యోగం: శివ 09:01:52 వరకు
తదుపరి సిధ్ధ
కరణం: బాలవ 07:01:25 వరకు
వర్జ్యం: 17:38:34 - 19:11:18
దుర్ముహూర్తం: 08:24:55 - 09:17:24
మరియు 12:47:20 - 13:39:49
రాహు కాలం: 10:42:41 - 12:21:05
గుళిక కాలం: 07:25:53 - 09:04:17
యమ గండం: 15:37:54 - 17:16:18
అభిజిత్ ముహూర్తం: 11:55 - 12:47
అమృత కాలం: 05:51:52 - 07:27:24
మరియు 26:54:58 - 28:27:42
సూర్యోదయం: 05:47:29
సూర్యాస్తమయం: 18:54:42
చంద్రోదయం: 13:24:34
చంద్రాస్తమయం: 00:36:52
సూర్య సంచార రాశి: జెమిని
చంద్ర సంచార రాశి: తుల
ముసల యోగం - దుఃఖం 12:14:04
వరకు తదుపరి గద యోగం-
కార్య హాని , చెడు
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
#పంచాగముPanchangam
#PanchangDaily
#DailyTeluguCalender
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 35 / Kapila Gita - 35🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴. 15. భగవంతుని అతీంద్రియ స్వరూపంపై ధ్యానం - 2 🌴*
*35. పశ్యన్తి తే మే రుచిరాణ్యమ్బ సన్తః ప్రసన్న వక్త్రారుణ లోచనాని*
*రూపాణి దివ్యాని వరప్రదాని సాకం వాచం స్పృహణీయాం వదన్తి*
*అమ్మా! నా సౌందర్యమైన దివ్య మంగళ విగ్రహాన్ని వారు చూస్తారు చక్కని ముఖారవిందం, ఎర్రని నేత్రాలు, దివ్యమైనటువంటివి (ప్రకృతి సంబంధమూ కాల సంబంధమూ లేనిది. కాలముతో వికారం ఏర్పడుతుంది) , వరములిచ్చేటువంటివి, నా రూపాలనూ చూస్తారు, నా వాక్కును (వేద మంత్రాన్ని) పఠనం చేస్తారు. నేనే వెళితే ఆరాధిస్తారు. వారు అన్య ప్రసంగాలు చేయరు.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 35 🌹*
*✍️ Swami Prabhupada.*
*📚 Prasad Bharadwaj*
*🌴 15. Meditation on the Lord's Transcendental Form - 2 🌴*
*35. pasyanti te me rucirany amba santah prasanna-vaktraruna-locanani*
*rupani divyani vara-pradani sakam vacam sprhaniyam vadanti*
*O My mother, My devotees always see the smiling face of My form, with eyes like the rising morning sun. They like to see My various transcendental forms, which are all benevolent, and they also talk favorably with Me.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#కపిలగీత #KapilaGita
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/maharshiwisdom/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 75 / Agni Maha Purana - 75 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 27*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*🌻. దీక్షా విధి - 1 🌻*
నారుదుడు పలికెను. :
అన్ని ఫలములను ఇచ్చు దీక్షను చెప్పదను. మండలమునందలి పద్మమునందు హరిని పూజించవలెను. దశమి యందు సమస్తమైన యాగద్రవ్యములను సమకూర్చుకొని, అచట ఉంచి, 'ఫట్' అనునది అంతమునందు గల నారసింహా మంత్రముచేత ఆవాంను నూరు పర్యాయములు అభిమంత్రించి, వాటిని నలుమూలల చల్లవలెను.
అచట సర్వాత్మికయు, ప్రాసాదరూపిణియు అగు శక్తిని నిలుపవలెను. సాధకుడు శుభ మైన పాత్రయందు సమస్తౌషధును ఉంచి నూరు పర్యాయములు వాసుదేవమంత్రముచే వికిరములను అభిమంత్రించవలెను. పంచగవ్యమును నారాయణాన్తములైన ఐదు మూలమూర్తులచే సంపాదించుకొని, దానిచే ఆ భూమిని కుశాగ్రములతో సంప్రోక్షించి, వాసుదేవ మంత్రముచే చిమ్ముచు, వెల్లిగితం ఉంచబడిన హస్తుముతో మూడు పర్యాయములు విసిరివేయవలెను. తూర్పుగా తిరిగి విష్ణువును మనస్సులో ధ్యానించవలెను. వర్ధనితో కూడిన కుంభమునందు అంగసహితుడగు విష్ణువును పూజింపవలెను.
వర్ధనిని అస్త్రముచేతనే నూరు పర్యాయములు అభిమంత్రించి, భిన్నము కాని ధారతో తడుపుచు ఈశాన్యదిక్కు వరకును తీసికొని వెళ్ళవలెను.
కలశమును వెనుకనుంచి తీసికొని వెళ్ళి వికిరములపై స్థాపించవలెను. వికిరములను దర్భలచేత పోగుచేసి కుంభేశుని కర్కరిని పూజింపవలెను.
వస్త్రములతోడను పంచరత్నములతోడను కూడిన విష్ణువును స్థండిలముపై పూజించవలెను. అగ్నియందు కూడ పూజించి, పూర్వమునందు వలె మంత్రములను జపించి, పాత్రను కడిగి, మంచి సువాసన గల పద్మములచే లోపల తుడిచి, నేతితోను, గోక్షీరముతోను నింపి, వాసుదేవమంత్రముతో దానివైపు చూచి, పిమ్మట సంకర్షణమంత్రముతో, సంస్కృతమైన క్షీరములో నెయ్యి పూసిన తండులమును పోయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 75 🌹*
*✍️ N. Gangadharan*
*📚. Prasad Bharadwaj *
*Chapter 27*
*🌻 Mode of performing the initiation rite - 1 🌻*
Nārada said:
1-2. I shall describe the initiation rite, which yields everything. Hari should be worshipped in the lotus in a circle. Having gathered the articles (required) for the sacrifice on the tenth (lunar) day, assigning and consecrating hundred times with the (basic syllables) of the man-lion (Narasiṃha) (form), one should scatter on all sides the mustard seeds, destructive of demons, ending (the act) with the syllable phaṭ.
3. The female energy, contained in every being, in the form of grace is assigned there. Having collected all the herbs and spread, they are consecrated.
4. A worshipper has to accomplish the five products[1] of the cow hundred times in pure vessels by means of the five basic forms.
5. Having sprinkled the earth (with the basic syllable) ending with (the word) Nārāyaṇa, with the tips of kuśa (grass), those scattered (things) are thrown with the raised hand with the (basic syllable of) Vāsudeva.
6. Then standing with the face facing the east one has to meditate on Viṣṇu in the heart. One has to worship Viṣṇu in the waterpot along with the vardhanī[2].
7. Having recited hundred times the sacred syllables for the weapon and having sprinkled the Vardhanī (vessel) with a continuous shower (of water) it should be taken to the northeast quarter.
8. Taking the jar on his back one has to place it on the scattered (mustard seeds). Then having gathered them by means. of the Kuśa (grass) one has to adore the presiding deity of the jar and the karkarī[3].
9. One has to worship Hari adorned with clothes (and) five jewels, on a piece of ground (made ready), offering oblations to fire (for his sake) and reciting the sacred syllables, as before.
10. Sprinkling with a lotus and anointing with unguents the worshipper has to fill the boiling vessel with clarified butter and cow’s milk.
11. Having looked at it with the Vāsudeva and the Saṅgharṣaṇa (basic syllables), rice mixed with clarified butter should be thrown into milk well-cooked.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
#అగ్నిపురాణం #AgniMahaPuranam
https://t.me/AgniMahaPuranam
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/hindupuranas/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 590 / Sri Siva Maha Purana - 590 🌹*
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
*🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 03 🌴*
*🌻. కార్తికేయుని లీలలు - 3 🌻*
బాలకుడు, కుమారుడను పేరు గలవాడు, సూర్యుని కంటె అధిక తేజశ్శాలి యగు ఆ శివపుత్రుని వారు పాలు కావలసినపుడు స్తన్యము నిచ్చి పెంచిరి (32). ఓ కుమారా! వారు తమ కళ్ల ఎదుట నుండి ఆ బాలకుడు క్షణమైననూ మరుగు కాని విధముగా పెంచిరి. ఆ బాలుని ఎవరు పెంచితే వారికి అతడు ప్రాణములకంటె అధిక ప్రేమాస్పదుడయ్యెను (33).
వారు ఆ బాలకునకు ముల్లోకములలో దుర్లభమగు వస్త్రములను, శ్రేష్ఠములగు ఆభరణములను ప్రేమతో నిచ్చిరి (34). మహా ప్రభుడగు ఆ బాలకునకు వారు ప్రశంసార్హములు, రుచ్యములు అగు పదార్థములను శ్రద్ధతో భుజింపజేసి దిన దిన ప్రవర్ధమానుడగునట్లు పోషించిరి (35).
కుమారా! తరువాత ఒకనాడు కృత్తికా పుత్రుడగు ఆ బాలుడు దేవసభకు వెళ్లి చక్కని వృత్తాంతమును ఘటిల్ల జేసెను (36). గొప్పలీలలను ప్రదర్శించే ఆ బాలకుడు విష్ణువుతో కూడియున్న దేవలందరికీ తన మహిమను చూపెను (37). అచ్యుతునితో మరియు ఋషులతో గూడియున్న దేవతలు గొప్ప ఆశ్చర్యమును పొంది ఆ బాలకుని ప్రశ్నించిరి (38).
నీవెవరివి? అని వారు ప్రశ్నించగా ఆతడేమియూ పలుకకుండగా వెంటనే తన నివాసమునకు వెళ్లి పూర్వమువలెనే రహస్యముగా నుండెను (39).
శ్రీ శివమహాపురాణములోని రుద్ర సంహితయందు కుమార ఖండలో కార్తికేయుని లీలలు అనే మూడవ అధ్యాయము ముగిసినది (3).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 590 🌹*
*✍️ J.L. SHASTRI*
*📚. Prasad Bharadwaj *
*🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 03 🌴*
*🌻 The boyhood sports of Kārttikeya - 3 🌻*
32-33. Realising his desire, the Kṛttikās, O sage, took him to their region joyously. Feeding him with their breast milk they nursed and nurtured Śiva’s son who was more refulgent than the sun.
34. They never let him go out of their sight. He became the object of their love, dearer to them than their own lives. Verily he who nurses and nurtures the child has the right of possession over the son.[3]
35. With great love they gave him the rarest garments and excellent ornaments in the three worlds.
36. Feeding him specially on the choicest delicacies day by day they brought up the boy prodigy.
37. O dear, once that son of the Krttikās went to the celestial assembly and showed wonderful feats.
38. The boy of wonderful miracles showed his rare splendour to the gods including Viṣṇu.
39-40. On seeing him, the gods and sages including Viṣṇu became surprised and asked the boy “Pray, who are you?” On hearing it he did not say anything in reply. He returned to his abode and remained concealed as before.
Continues....
🌹🌹🌹🌹🌹
#శివమహాపురాణము
#SivaMahaPuranam #ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం
https://facebook.com/groups/hindupuranas/
https://facebook.com/groups/chaitanyavijnanam/
https://t.me/ChaitanyaVijnanam
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 210 / Osho Daily Meditations - 210 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ్*
*🍀 210. పిల్లలు 🍀*
*🕉. ప్రతి బిడ్డ ఒక అద్భుతంగా ఆలోచించండి. పిల్లలను గౌరవించండి, వారిని తేలికగా తీసుకోవద్దు. 🕉*
*ప్రతి బిడ్డ ఆకాశం మరియు భూమి యొక్క సమావేశం. ప్రతి బిడ్డ ఒక అద్భుతం. సాధారణంగా జరగకూడనిది ఏదో జరుగుతుంది: పదార్థం మరియు స్పృహ కలయిక, కనిపించే మరియు కనిపించని కలయిక. కాబట్టి ప్రతి బిడ్డను ఒక అద్భుతంగా భావించండి. వారిని గౌరవించండి; వారిని తేలికగా తీసుకోవద్దు. మనం పిల్లవాడిని తేలికగా తీసుకున్న క్షణం, మనం అతనిని లేదా ఆమెను హత్య చేయడం ప్రారంభిస్తాము. మరియు ప్రతి బిడ్డ హత్య చేయబడుతుంది; అది ప్రపంచమంతటా జరుగుతున్నది మరియు యుగయుగాలుగా జరిగింది: ఇది ఒక గొప్ప ఊచకోత. హేరోదు ఇజ్రాయేలులో ఉన్న పిల్లలందరినీ చంపడమే కాదు, ఇది ప్రతిరోజూ జరుగుతోంది; ఇది హేరోదుకు ముందు జరిగినది మరియు అతని తరువాత ఇది జరుగుతోంది.*
*ప్రతి బిడ్డ మానసిక హత్య గుండా వెళుతుంది; పిల్లవాడు గౌరవించ బడని క్షణం మరియు మీ స్వంత ఆస్తిగా భావించబడినప్పుడు, పిల్లవాడు చంపబడ్డాడు, తొలగించబడ్డాడు. పిల్లవాడు దేవుడిగా గౌరవించబడాలి, ఎందుకంటే దేవుడు పిల్లవాడుగా మళ్లీ మళ్లీ ప్రపంచంలోకి వస్తాడు. ప్రతి బిడ్డ తాను ఇంకా అలసిపోలేదని, అతను ఇంకా మానవజాతితో అలసిపోలేదని, అతను ఇంకా కొత్త మానవులను సృష్టిస్తూనే ఉంటాడని, 'మనం ఎలా అవుతామో' అని దేవుడు చేసిన ప్రకటన. పాపాత్ములారా, పుణ్యాత్ములారా, మనం ఏమి చేసినా, నిజమైన మానవుడు సృష్టించ బడతాడని అతను ఇప్పటికీ ఆశిస్తున్నాడు. దేవుడు ఇంకా విఫలం కాలేదు! ప్రతి బిడ్డ భూమిపైకి, ఉనికిలోకి రావడంలో అది ఒక ప్రకటన.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 210 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 210. CHILDREN 🍀*
*🕉. Think if each child as a miracle. Respect children, revere them; don't take them for granted. 🕉*
*Each child is a meeting of the sky and the earth. Each child is a miracle. Something happens that should not ordinarily happen: the meeting of matter and consciousness, the meeting of the visible and the invisible. So think of each child as a miracle. Respect, children, revere them; don't take them for granted. The moment we take a child for granted, we start murdering him or her. And each child is murdered; that's what is happening all over the world and has happened through the ages: it has been a great massacre. It is not only that Herod killed all the children in Israel, it is happening every day; it was happening before Herod, and it has been happening since him.*
*Each child passes through a psychic murder; the moment the child is not respected and is thought to belong to you like a possession, the child has been killed, effaced. The child has to be respected as a God, because the child is the coming of God into the world again. Each child is a statement from God that he is not yet tired, that he is not yet weary of humankind, that he still hopes, that he will continue to create new human beings, whatever 'we become. Sinners and saints, whatever we do, he still hopes that the real human being will be created. God has not failed yet! That is the declaration in each child's coming onto the earth, into existence.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#ఓషోరోజువారీధ్యానములు
#OshoDailyMeditations
#ఓషోబోధనలు #OshoDiscourse
#ఓషోనిర్మలధ్యానములు #PrasadBhardwaj
https://t.me/ChaitanyaVijnanam
http://www.facebook.com/groups/oshoteachings/
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 384 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 384 - 2🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*మూల మంత్రము :*
*🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 84. సద్యఃప్రసాదినీ విశ్వసాక్షిణీ సాక్షివర్జితా*
*షడంగదేవతాయుక్తా షాడ్గుణ్యపరిపూరితా ॥ 84 ॥ 🍀*
*🌻 384. ‘విశ్వసాక్షిణీ' - 2🌻*
*విశ్వమంతటిని మరియు అందలి ప్రతి అణువు యందును తానే నిండియున్నది గనుక ఆమె గమనికను దాటి ఏదియూ యుండదు. ఇది ఆమె విశ్వ సాక్షిత్వము. సతతము బహిరంతరముల యందు తననే చూచుట నేర్చు భక్తులకు లోనుండి, వెలుపలినుండి కూడ తన సాక్షాత్కారము నిచ్చును. తన లోపల, వెలుపల చైతన్యమై నిలచి వివిధ రూపములతో, భావములతో, చేష్టలతో వర్తించు చున్నది శ్రీదేవియే అని తెలిసి చూచుట నిజమగు చూచుట. ఇతర చూపు లన్నియూ గ్రుడ్డివారి చూపులే.*
*చైతన్యమయి అయిన శ్రీమాతయే విశ్వరూపి. అందలి రూపము లన్నియూ ఆమెవే. వాని యందలి చేతన ఆమెయే. ఇట్లు తెలిసి దర్శించుచు ఆరాధించువారికి లోపల సాక్షాత్కార మిచ్చును. అటుపైన వెలుపల కూడ సాక్షాత్కారమిచ్చును. అట్టి వారికే అఖండమైన జ్ఞానము కలుగును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 384 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma *
*📚. Prasad Bharadwaj*
*🌻 84. Sadyah prasadini vishvasakshini sakshivarjita
Shadanga devata yukta shadgunya paripurita ॥ 84 ॥ 🌻*
*🌻 384. Viśva-sākṣinī विश्व-साक्षिनी 🌻*
*She is the witness of the universe. This is the unique quality of the Brahman without attributes, the supreme form of the Brahman. Only the Supreme Brahman stands as a witness to the happenings of the universe, without himself partaking in any of the activities.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
#శ్రీలలితాసహస్రనామచైతన్యవిజ్ఞానము #SriLalithaChaitanyaVijnanam #లలితాసహస్రనామములు #LalithaSahasranama
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
No comments:
Post a Comment