శ్రీ మదగ్ని మహాపురాణము - 75 / Agni Maha Purana - 75
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 75 / Agni Maha Purana - 75 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు
ప్రథమ సంపుటము, అధ్యాయము - 27
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
🌻. దీక్షా విధి - 1 🌻
నారుదుడు పలికెను. :
అన్ని ఫలములను ఇచ్చు దీక్షను చెప్పదను. మండలమునందలి పద్మమునందు హరిని పూజించవలెను. దశమి యందు సమస్తమైన యాగద్రవ్యములను సమకూర్చుకొని, అచట ఉంచి, 'ఫట్' అనునది అంతమునందు గల నారసింహా మంత్రముచేత ఆవాంను నూరు పర్యాయములు అభిమంత్రించి, వాటిని నలుమూలల చల్లవలెను.
అచట సర్వాత్మికయు, ప్రాసాదరూపిణియు అగు శక్తిని నిలుపవలెను. సాధకుడు శుభ మైన పాత్రయందు సమస్తౌషధును ఉంచి నూరు పర్యాయములు వాసుదేవమంత్రముచే వికిరములను అభిమంత్రించవలెను. పంచగవ్యమును నారాయణాన్తములైన ఐదు మూలమూర్తులచే సంపాదించుకొని, దానిచే ఆ భూమిని కుశాగ్రములతో సంప్రోక్షించి, వాసుదేవ మంత్రముచే చిమ్ముచు, వెల్లిగితం ఉంచబడిన హస్తుముతో మూడు పర్యాయములు విసిరివేయవలెను. తూర్పుగా తిరిగి విష్ణువును మనస్సులో ధ్యానించవలెను. వర్ధనితో కూడిన కుంభమునందు అంగసహితుడగు విష్ణువును పూజింపవలెను.
వర్ధనిని అస్త్రముచేతనే నూరు పర్యాయములు అభిమంత్రించి, భిన్నము కాని ధారతో తడుపుచు ఈశాన్యదిక్కు వరకును తీసికొని వెళ్ళవలెను.
కలశమును వెనుకనుంచి తీసికొని వెళ్ళి వికిరములపై స్థాపించవలెను. వికిరములను దర్భలచేత పోగుచేసి కుంభేశుని కర్కరిని పూజింపవలెను.
వస్త్రములతోడను పంచరత్నములతోడను కూడిన విష్ణువును స్థండిలముపై పూజించవలెను. అగ్నియందు కూడ పూజించి, పూర్వమునందు వలె మంత్రములను జపించి, పాత్రను కడిగి, మంచి సువాసన గల పద్మములచే లోపల తుడిచి, నేతితోను, గోక్షీరముతోను నింపి, వాసుదేవమంత్రముతో దానివైపు చూచి, పిమ్మట సంకర్షణమంత్రముతో, సంస్కృతమైన క్షీరములో నెయ్యి పూసిన తండులమును పోయవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 75 🌹
✍️ N. Gangadharan
📚. Prasad Bharadwaj
Chapter 27
🌻 Mode of performing the initiation rite - 1 🌻
Nārada said:
1-2. I shall describe the initiation rite, which yields everything. Hari should be worshipped in the lotus in a circle. Having gathered the articles (required) for the sacrifice on the tenth (lunar) day, assigning and consecrating hundred times with the (basic syllables) of the man-lion (Narasiṃha) (form), one should scatter on all sides the mustard seeds, destructive of demons, ending (the act) with the syllable phaṭ.
3. The female energy, contained in every being, in the form of grace is assigned there. Having collected all the herbs and spread, they are consecrated.
4. A worshipper has to accomplish the five products[1] of the cow hundred times in pure vessels by means of the five basic forms.
5. Having sprinkled the earth (with the basic syllable) ending with (the word) Nārāyaṇa, with the tips of kuśa (grass), those scattered (things) are thrown with the raised hand with the (basic syllable of) Vāsudeva.
6. Then standing with the face facing the east one has to meditate on Viṣṇu in the heart. One has to worship Viṣṇu in the waterpot along with the vardhanī[2].
7. Having recited hundred times the sacred syllables for the weapon and having sprinkled the Vardhanī (vessel) with a continuous shower (of water) it should be taken to the northeast quarter.
8. Taking the jar on his back one has to place it on the scattered (mustard seeds). Then having gathered them by means. of the Kuśa (grass) one has to adore the presiding deity of the jar and the karkarī[3].
9. One has to worship Hari adorned with clothes (and) five jewels, on a piece of ground (made ready), offering oblations to fire (for his sake) and reciting the sacred syllables, as before.
10. Sprinkling with a lotus and anointing with unguents the worshipper has to fill the boiling vessel with clarified butter and cow’s milk.
11. Having looked at it with the Vāsudeva and the Saṅgharṣaṇa (basic syllables), rice mixed with clarified butter should be thrown into milk well-cooked.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
08 Jul 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment