🌹 . శ్రీ శివ మహా పురాణము - 608 / Sri Siva Maha Purana - 608 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 06 🌴
🌻. కుమారుని లీల - 3 🌻
ఓ గుహా! నీవు కల్యాణములనిచ్చి కలి దోషములను పోగొట్టెదవు. కుబేరుని బంధువగు నీ మనస్సు కరుణార్ద్రమై యుండును. మూడు ఆరుల నేత్రములతో, ఆరు ముఖములతో ప్రకాశించు నీవు నా యజ్ఞమును పూర్ణము చేయుము (17). ముల్లోకములను రక్షించువాడువు, శరణుజొచ్చిన వారిని ప్రేమించువాడవు, యజ్ఞ కర్తవు, యజ్ఞమును రక్షించు వాడవు అగు నీవు యజ్ఞమునకు విఘ్నమును కవలిలగించు వారిని సంహరించెదవు (18).
సాధువుల విఘ్నములను నివారించు వాడా! సర్వ సృష్టికి కారణమైనవాడా! ఈశాన పుత్రా! నాయజ్ఞమును పూర్ణము చేయుము. నీకు నమస్కారమగు గాక! (19) ఓ స్కందా! సర్వులను రక్షించునది నీవే. సర్వజ్ఞుడవు నీవే. సర్వేశ్వరుడవు నీవే. బ్రహ్మాండముల నన్నిటినీ పాలించునది నీవే. సర్వమును సృష్టించి రక్షించునది నీవే. దేవ దేవుడవగు నీవే సత్పురుషులకు గతి (21). పార్వతీ పరమేశ్వరుల పుత్రుడవగు నీవు సర్వజ్ఞుడవు, ముల్లోకమలు కధిపతివి. ధ్యానము చేయువాడవు నీవే. ధ్యానింపబడేది నీవే. నీవు తండ్రులకు తండ్రివి. సత్పురుషులకు శరణ్యస్థానము నీవే (22).
బ్రహ్మ ఇట్లు పలికెను -
దేవ దేవుడగు శివపుత్రుడు ఆతని ఈ మాటను విని వీరబాహుడను పేరు గల తన గణమును ఆతని పనికొరకై పంపెను (23). ఆయన ఆజ్ఞను పొంది మహావీరుడగు వీర బాహుడు భక్తితో ఆ స్వామికి నమస్కరించి మేకను వెదుకుట కొరకై వెంటనే బయులుదేరెను (24). ఆతడు బ్రహ్మండములన్నింటినీ వెదికిననూ ఆ మేక దొరకలేదు. అపుడాతడు ఆ మేక చేసిన అలజడిని వినెను (25). అతడుఅపుడు వైకుంఠమునకు వెళ్లగా అచట అది కనబడెను. మహాబలశాలియగు ఆ మేక మెడలో యూపము వ్రేలాడు చుండెను. అది అలజడిని కలిగించు చుండెను (26).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 608🌹
✍️ J.L. SHASTRI 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 06 🌴
🌻 The miraculous feat of Kārttikeya - 3 🌻
17. O lord, you are the cause of welfare, the destroyer of the sins of Kali age and a friend of Kubera. Your heart melts with pity. You have twelve eyes and you shine with six faces. Please make my sacrifice complete and perfect.
18. You are the protector of the three worlds, favourite of those who seek refuge in you. You are the performer and sustainer of sacrifices. You remove those who bring in obstacles.
19. O warder of obstacles, the cause of the creation of the good in every respect, O son of Īśāna, please make my sacrifices complete. Obeisance be to you,
20. O Skanda, you are the protector of all, the knower of all and the lord of all and Īśāna. By your penetration you protect all.
21. You alone are the knower of music, the great lord and knower of the Vedas. You are all-in-all, the creator, the lord of the gods and the goal of the good.
22. You are the joy of Pārvatī, the son of Śiva. You are the perfect wisdom, the self-ruler, the meditator and the object of meditation. You are the father of the fathers and the source of origin of good souls.
Brahmā said:—
23. On hearing his words, Śiva’s son, the emperor of the gods, sent his attendant Virabāhu on that mission.
24. At his bidding, the great hero Virabāhu who bowed to his master with devotion started in search of it.
25. He searched throughout the universe but nowhere did he find the goat (although) he heard about the havoc done by it.
26. Then he went to Vaikuṇṭha where he saw the powerful goat working hah67voc with the sacrificial stake tied to its neck.
Continues....
🌹🌹🌹🌹🌹
11 Aug 2022
No comments:
Post a Comment