శ్రీ మదగ్ని మహాపురాణము - 92 / Agni Maha Purana - 92


🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 92 / Agni Maha Purana - 92 🌹

✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ

శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.

ప్రథమ సంపుటము, అధ్యాయము - 30


🌻. కమలములలోని దేవతల మండల విధి -3 🌻


చక్రకమలము ఆకులకు పసుపు-ఎరుపు రంగులు వేయవలెను. చక్రము అంచును నీలము-ఎరుపు రంగులు వేసి అలంకరింపవలెను. బైట నున్న రేఖలకు తెలుపు, శ్యామము, ఎరుపు, నలుపు, పసుపు రంగులు వేయవలెను. వరిపిండి మొదలగు వాటిని తెలుపురంగునకు ఉపమోగించవచ్చును. కుసుంధచూర్ణాదులు ఎరుపురంగునకును, పసుపు పసుపురంగునకును, మాడ్చిన బియ్యపు పిండు నల్లరంగునకును ఉపయోగించును. శమీపత్రాదులచే శ్యామవర్ణము వేయవచ్చును.

బీజమంత్రములను ఒక లక్ష జపించుటచేతను, ఇతరమంత్రములను అక్షరలక్షలు జపించుటచేతను, విద్యలను ఒక లక్షజపించుటచేతను, బుద్ధవిద్యలను పదివేల సార్లు జపముచేయుటచేతను స్తోత్రములను వేయి పర్యాయములు జపించుటచేతను, లేదా అన్ని మంత్రములను మొదట ఒక లక్ష జపించుటచేతను, మంత్రశుద్ధియు, ఆత్మశుద్ధియు కూడ కల్గును.

రెండవ పర్యాయము ఒక లక్ష జపించుటచే మంత్రము క్షేత్రీకృత మగును (సాధకునకు దానిపై నిలకడ ఏర్పడును). బీజమంత్రజపము మొదట ఎంత సంఖ్యలో చేయబడునో హోమము కూడ అంత సంఖ్యలోనే చేయవలెను. ఇతరమంత్రముల విషయమున హోమము జపసంఖ్యలో పదవ వంతు చేయవలెను. మంత్రపురశ్చరణము చేయ సంకల్పించినప్పుడు ఒక్కొక్క మాసము వ్రతము ఆవలంబింపవలెను. నేలపై మొదట ఎడమ కాలు ఉంచవలెను. దానము పట్టగూడదు. ఈ రెండు రెట్లు-మూడురెట్లు జపము చేసిననే మధ్యమ-ఉత్తమశ్రేణికి చెందిన ఫలముల లభించును.


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Agni Maha Purana - 92 🌹

✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj

Chapter 30

🌻 Mode of worship of different gods in specially drawn lotus figures - 1 🌻


18. The black (coloured) radii (should be decorated) by yellow and red, the circumference with red, the lines outside (being drawn) in white, brown, red, black and yellow.

19. The powder of rice (is) white. The dust of saffron is red. It (becomes) yellow with turmeric. From burnt grains (we get) black (colour).

20. (It becomes) black with śami leaves and other (leaves). By the repetition of the basic mystic letters lakh times and of the basic syllables four lakh times, a lakh of mystic learning is accomplished.

21. Ten thousand times of the science of intellect and thousand times of the hymns (are repeated). The purification of the self by means of a lakh of the basic syllables is done prior to this.

22. Then with another lakh, the basic syllable would get established. It has been well advocated that oblation of the mystic letters is similar to the prior service.

23. The prior service has been advocated to be performed with a tenth part of the mystic syllables. The monthly austerity has to be performed with the preparatory mystic syllable.

24. The left foot should be placed on the ground and the donation should not be accepted. In this way by the repetition, twice or thrice (one gets) mediocre and excellent accomplishments.


Continues....

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment