1) 🌹 04 - DECEMBER - 2022 SUNDAY,ఆదివారం, భాను వాసరే - నిత్య పంచాంగము Daily Panchangam🌹
🍀.గీతా జయంతి, ధన్వంతరి జయంతి, మోక్షద ఏకాదశి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Mokshada Ekadashi, Gita Jayanti, Dhanvanthari Jayanthi to All 🍀
2) 🌹 కపిల గీత - 99 / Kapila Gita - 99 🌹 సృష్టి తత్వము - 55
3) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 691 / Vishnu Sahasranama Contemplation - 691 🌹
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 138 / Agni Maha Purana - 138 🌹 🌻. ఆలయ ప్రాసాద దేవతా స్థాపన శాంత్యాది వర్ణనము - 1 🌻
5) 🌹 ఓషో రోజువారీ ధ్యానములు - 273 / Osho Daily Meditations - 273 🌹 కోపం మరియు నొప్పి - ANGER AND PAIN
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 417-1 / Sri Lalitha Chaitanya Vijnanam - 417-1 🌹 'చేతనా రూపా' - 1 - Chetana Rupa' - 1
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹04, డిసెంబరు, December 2022 పంచాగము - Panchagam 🌹*
*శుభ ఆదివారం, Sunday, భాను వాసరే*
*🍀.మోక్షద ఏకాదశి, గీతా జయంతి, ధన్వంతరి జయంతి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Mokshada Ekadashi, Gita Jayanti, Dhanvanthari Jayanthi to All 🍀
*మీకు ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని కోరుకుంటూ*
*ప్రసాద్ భరద్వాజ*
*🌻. పండుగలు మరియు పర్వదినాలు : మోక్షద ఏకాదశి, గీతా జయంతి, ధన్వంతరి జయంతి, Mokshada Ekadashi, Gita Jayanti, Dhanvanthari Jayanthi🌻*
*🍀. ఆదిత్య స్తోత్రం - 12 🍀*
*12. ఆదిత్యే మణ్డలార్చిః పురుష విభిదయాద్యన్త మధ్యాగమాత్మ-*
*న్యాగోపాలాఙ్గనాభ్యో నయనపథజుషా జ్యోతిషా దీప్యమానమ్*
*గాయత్రీమన్త్రసేవ్యం నిఖిలజనధియాం ప్రేరకం విశ్వరూపమ్ |*
*నీలగ్రీవం త్రినేత్రం శివమనిశ ముమా వల్లభం సంశ్రయామి*
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నేటి సూక్తి : వ్యర్థ వివాదాలు పెట్టుకోవద్దు. వివాదం పెట్టుకోవలసి వస్తే, నీ ప్రతికక్షి నుండి సైతం నేర్చుకోడానికి ప్రయత్నించు, ఏలనంటే, కేవలం శ్రవణం, తార్కిక బుద్దితోనూ గాక, ఆత్మ వెలుగుతో నీవు వినగలిగే పక్షంలో, అవివేకి నుండి కూడ ఎంతో విజానం సముపార్జించగలవు.🍀*
🌷🌷🌷🌷🌷
శుభకృత్ సంవత్సరం, హేమంత ఋతువు,
దక్షిణాయణం, మార్గశిర మాసం
తిథి: శుక్ల ద్వాదశి 29:59:31 వరకు
తదుపరి శుక్ల త్రయోదశి
నక్షత్రం: అశ్విని 31:15:25 వరకు
తదుపరి భరణి
యోగం: వరియాన 27:40:32 వరకు
తదుపరి పరిఘ
కరణం: బవ 17:46:22 వరకు
వర్జ్యం: 27:05:20 - 28:45:12
దుర్ముహూర్తం: 16:11:23 - 16:55:59
రాహు కాలం: 16:16:58 - 17:40:36
గుళిక కాలం: 14:53:20 - 16:16:58
యమ గండం: 12:06:04 - 13:29:42
అభిజిత్ ముహూర్తం: 11:44 - 12:28
అమృత కాలం: 23:45:36 - 25:25:28
మరియు 27:34:12 - 29:15:48
సూర్యోదయం: 06:31:32
సూర్యాస్తమయం: 17:40:36
చంద్రోదయం: 15:00:29
చంద్రాస్తమయం: 02:59:16
సూర్య సంచార రాశి: వృశ్చికం
చంద్ర సంచార రాశి: మేషం
యోగాలు : ఆనంద యోగం - కార్య సిధ్ధి
31:15:25 వరకు తదుపరి కాలదండ
యోగం - మృత్యు భయం
🌻 🌻 🌻 🌻 🌻
*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ*
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. గీతా జయంతి, ధన్వంతరి జయంతి, మోక్షద ఏకాదశి శుభాకాంక్షలు అందరికి, Good Wishes on Mokshada Ekadashi, Gita Jayanti, Dhanvanthari Jayanthi to All 🌹*
*🌹 గీతా జయంతి విశిష్టత 🌹*
*గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు. ఇది భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం *మార్గశిర శుద్ధ ఏకాదశి రోజు* జరుపుకొంటారు. గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.*
*గీకారం త్యాగరూపం స్యాత్*
*తకారమ్ తత్వబోధకమ్*
*గీతా వాక్య మిదమ్* *తత్వం*
*జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:*
*గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. "గీ" అనే అక్షరం త్యాగాన్ని ను బోధించుచున్నది. "త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది . అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ , బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది. అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి.*
*ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది. ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథరాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం ప్రారంభించండి.*
*సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|*
*పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్||*
*ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు , సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా , అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా , ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి , ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే , మరోపక్క లోకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందిచాడట.*
*అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి , ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో , అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు.*
*మన వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః. - అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.*
*వాసాంసి జీర్ణాని యథా విహాయ*
*నవాని గృర్ణోతి నరో పరాణి*
*తథా శరీరాణి విహాయ జీర్ణా*
*న్యన్యాని సంయాతి నవాని దేహీ*
*చిరిగిపోయిన పాతబట్టలను విడిచి మనుషులు ఇతర కొత్తబట్టలను ఎలా ధరిస్తున్నాడో అలాగే దేహియనే ఆత్మా కూడా శిథిలమైన పాత శరీరాలను వదిలి ఇతరములైన కొత్త శరీరాలను ధరించుచున్నాడు.*
*నైనం ఛిన్దన్తి శస్త్రాణి నైనం దహతి పావకః*
*న చైనం క్లేదయన్త్యాపో న శోషయతి మారుతః*
*ఈ ఆత్మను ఆయుధములేవీ కూడా ఛేదింపజాలవు. అగ్ని దహింపజాలదు , నీరు తడుపజాలదు , గాలి ఎండింపజాలదు.*
*కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన*
*మా కర్మఫలహేతుర్భూర్మాతే సజ్గో స్త్వకర్మణి*
"అర్జునా ! నీకు కర్మను చేయటంలోనే అధికారము వుంది. కర్మఫలాలను ఆశించుటలో ఏనాడూ కూడా నీకు అధికారము లేదు. కర్మఫలాలకు నీవు కారణభూతుడవు అవ్వకు. మరియు కర్మలు మానుటలో కూడా నీకు ఆసక్తి కలుగకుండుగాక.*
*యదా యదా హాయ్ ధర్మస్య గ్లానిర్భవతి భారత*
*అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యాహమ్*
"ఓ అర్జునా ! ఎప్పుడెప్పుడు ధర్మమూ క్షీణించి , అధర్మము వృద్ధి అవుతూ ఉంటుందో , అప్పుడప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటూ వుంటాను.*
*పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతామ్*
*ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే*
*సాదు , సజ్జనులను సంరక్షించటం కోసం , దుర్మార్గులను వినాశం చేయడానికి , ధర్మాన్ని చక్కగా స్థాపించటం కోసం నేను ప్రతి యుగంలోనూ అవతరిస్తూ ఉంటాను.*
*కృష్ణుడంటాడు "ఇదం శాస్త్రం మయా ప్రోక్తం గుహ్యా వేదార్ధ దర్పణం..." అని , అంటే నాచే చెప్పబడిన ఈ శాస్త్రం రహస్యములైన వేద అర్థాలకు అద్దం వంటిది. దీనిని ఎవరు పఠిస్తారో వారు శాశ్వతమైన విష్ణపదం పొందుతారు. వారికి మోక్షం లభిస్తుంది.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. కపిల గీత - 99 / Kapila Gita - 99🌹*
*🍀. కపిల దేవహూతి సంవాదం 🍀*
*✍️. శ్రీమాన్ క.రామానుజాచార్యులు, 📚. ప్రసాద్ భరధ్వాజ*
*🌴 2. సృష్టి తత్వము - ప్రాథమిక సూత్రాలు - 55 🌴*
*55. ఘ్రాణద్వాయురభిద్యేతామక్షిణీ చక్షురేతయోః|*
*తస్ళాత్సూర్యో వ్యభిద్యేతాం కర్ణౌ శ్రోత్రం తతో దిశః॥*
*ఘ్రాణేంద్రియము నుండి దానికి అధిష్ఠాన దేవతయైన వాయువు ఉత్పన్నమయ్యెను. అనంతరము నేత్ర గోళములును, వాటి నుండి చక్షురింద్రియము, పిమ్మట దాని అధిష్థాన దేవతయైన సూర్యుడు వ్యక్తమయ్యెను. అనంతరము కర్ణ రంధ్రములును, శ్రోత్రేంద్రియము, దాని అధిష్ఠాన దేవతలైన దిక్కులు ప్రకటములయ్యెను.*
*సశేషం..*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Kapila Gita - 99 🌹*
*🍀 Conversation of Kapila and Devahuti 🍀*
*📚 Prasad Bharadwaj*
*🌴 2. Fundamental Principles of Material Nature - 55 🌴*
*55. ghrāṇād vāyur abhidyetām akṣiṇī cakṣur etayoḥ*
*tasmāt sūryo nyabhidyetāṁ karṇau śrotraṁ tato diśaḥ*
*In the wake of the olfactory sense came the wind-god, who presides over that sense. Thereafter a pair of eyes appeared in the universal form, and in them the sense of sight. In the wake of this sense came the sun-god, who presides over it. Next there appeared in Him a pair of ears, and in them the auditory sense and in its wake the Dig-devatās, or the deities who preside over the directions.*
*The appearance of different bodily parts of the Lord's universal form and the appearance of the presiding deities of those bodily parts is being described. As in the womb of a mother a child gradually grows different bodily parts, so in the universal womb the universal form of the Lord gives rise to the creation of various paraphernalia. The senses appear, and over each of them there is a presiding deity. It is corroborated by this statement of Śrīmad-Bhāgavatam, and also by Brahma-saṁhitā, that the sun appeared after the appearance of the eyes of the universal form of the Lord. The sun is dependent on the eyes of the universal form.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 691 / Vishnu Sahasranama Contemplation - 691🌹*
*🌻691. తీర్థకరః, तीर्थकरः, Tīrthakaraḥ🌻*
*ఓం తీర్థకరాయ నమః | ॐ तीर्थकराय नमः | OM Tīrthakarāya namaḥ*
తీర్థకరః, तीर्थकरः, Tīrthakaraḥ
చతుర్దశానాం విద్యానాం బాహ్యానాం చ శ్రుతేరపి ।
సమయానాం చ ప్రణేతా ప్రవక్తా చేతి కేశవః ॥
తీర్థకరః ఇతి బుధైః ప్రోచ్యతే తత్త్వవేదిభిః ।
స హయగ్రీవరూపేణ హత్వా తౌ మధ్కైటభౌ ॥
సర్గస్యాఽదౌ విరిఞ్చాయ శ్రుతీస్సర్వాస్తథేతరాః ।
విద్యా ఉప్దదిశన్ వేదబాహ్యాశ్చ సురవైరిణామ్ ।
వఞ్చనా యోపదిదేశేత్యాహుః పౌరాణికాబుధాః ॥
*తీర్థములు అనగా విద్యలు. తీర్థములను అనగా విద్యలను సృష్టించువాడు, బోధించువాడు తీర్థకరః అని చెప్పబడును. నాలుగు వేదములు, ఆరు వేదాంగములు, మీమాంశ, న్యాయ శాస్త్రము, పురాణములు, ధర్మ శాస్త్రము అను పదునాలుగు వైదిక విద్యలను, వేదబాహ్య అనగా వైదికేతర విద్యలను రచించి, వానిని ప్రవచించినవాడు.*
*శ్రీహరి హయగ్రీవ రూపమున మధు కైటభులను సంహరించి, బ్రహ్మకు సృష్ట్యాది యందు సర్వ వేదములను, ఇతరములగు వైదిక విద్యలను ఉపదేశించుచునే, సురవైరులను వంచించుటకై వేదబాహ్య విద్యలను ఉపదేశించెను అని పురాణజ్ఞులు చెప్పుచుందురు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 691🌹*
*🌻691. Tīrthakaraḥ🌻*
*OM Tīrthakarāya namaḥ*
चतुर्दशानां विद्यानां बाह्यानां च श्रुतेरपि ।
समयानां च प्रणेता प्रवक्ता चेति केशवः ॥
तीर्थकरः इति बुधैः प्रोच्यते तत्त्ववेदिभिः ।
स हयग्रीवरूपेण हत्वा तौ मध्कैटभौ ॥
सर्गस्याऽदौ विरिञ्चाय श्रुतीस्सर्वास्तथेतराः ।
विद्या उप्ददिशन् वेदबाह्याश्च सुरवैरिणाम् ।
वञ्चना योपदिदेशेत्याहुः पौराणिकाबुधाः ॥
Caturdaśānāṃ vidyānāṃ bāhyānāṃ ca śruterapi,
Samayānāṃ ca praṇetā pravaktā ceti keśavaḥ.
Tīrthakaraḥ iti budhaiḥ procyate tattvavedibhiḥ,
Sa hayagrīvarūpeṇa hatvā tau madhkaiṭabhau.
Sargasyā’dau viriñcāya śrutīssarvāstathetarāḥ,
Vidyā updadiśan vedabāhyāśca suravairiṇām,
Vañcanā yopadideśetyāhuḥ paurāṇikābudhāḥ.
*He is the author and also the preceptor of the fourteen vidyās and the auxiliary lores. The fourteen vidyās are - four vedās, the six vedāṅgas, mīmāṃśa, nyāya śāstra, purāṇas and dharma śāstra. So He is Tīrthakaraḥ - a sacred preceptor. Those who expound the purāṇas say that taking the form of Hayagrīva- after killing the demons Madhu and Kaitabha at the beginning of creation, He taught Brahma the Vedas and other vidyās. He also taught the asurās, the non-vedic sciences for deceiving them.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
मनोजवस्तीर्थकरो वसुरेता वसुप्रदः ।
वसुप्रदो वासुदेवो वसुर्वसुमना हविः ॥ ७४ ॥
మనోజవస్తీర్థకరో వసురేతా వసుప్రదః ।
వసుప్రదో వాసుదేవో వసుర్వసుమనా హవిః ॥ 74 ॥
Manojavastīrthakaro vasuretā vasupradaḥ,
Vasuprado vāsudevo vasurvasumanā haviḥ ॥ 74 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 138 / Agni Maha Purana - 138 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 43*
*🌻. ఆలయ ప్రాసాద దేవతాస్థాపన శాంత్యాది వర్ణనము - 1🌻*
హయగ్రీవుడు చెప్పెను:- బ్రహ్మదేవా! దేవాలయములో స్థాపింపదగిన దేవతలను గూర్చి చెప్పెదను; వినుము; పంచాయ తన దేవాలయము నందు, మధ్యనున్న ప్రధానాలయమున వాసుదేవుని స్థాపింపవలెను. మిగిలిన నాలుగు ఆలయములలో ఆగ్నేయయాలయమునందు వామనుని, నైరృతాలయము నందు నరసింహుని, వాయవ్యాలయము నందు హయగ్రీవుని, ఈశాన్యాలయము నందు వరాహమూర్తిని స్థాపింపవలెను.
లేదా మధ్యయందు నారాయణుని స్థాపించినచో ఆగ్నేయమున దుర్గాదేవిని, నైరృతియందు సూర్యుని, వాయవ్యమున బ్రహ్మను, ఈశాన్యమున లింగరూపుడుగా శివుని స్థాపింపవలెను లేదా ఈశాన్యమున రుద్రమూర్తిని స్థాపింపవలెను. లేదా ఎనిమిది దిక్కలందును ఎనిమిది ఆలయములను, మధ్యయందు ఒక ఆలయమును నిర్మించి. వాటిలో మధ్యనున్న ఆలయమునందు వాసుదేవుని స్థాపించి, తూర్పు మొదలగు దిక్కలందు పరశురాముడు మొదలగు ముఖ్యమైన తొమ్మిది అవతారములను, ఇంద్రాది లోకపాలులను స్థాపింప వలెను. లేదా మొత్తము తొమ్మిది స్థానములందు ఐదు ప్రధానాంయములను కట్టించి మధ్యాలయము నందు పురుషోత్తముని స్థాపింపవలెను.
తూర్పున లక్ష్మిని, కుబేరుని, దక్షిణమున మాతృకాగణ - కుమారస్వామి, గణపతి, శివులను పశ్చిమమున సూర్యాది నవగ్రహములను, ఉత్తరమున మత్స్యాది దశావతారములను స్థాపింపవలెను. అట్లే ఆగ్నేయుమున చండీదేవిని, నైరృతిదిక్కున అంబికను, వాయన్యమున సరస్వతిని, ఈశాన్యమున లక్ష్మిని స్థాపింపవలెను మధ్యభాగము నందు వాసుదేవుని లేదా నారాయణుని స్థాపింపవలెను. లేదా పదమూడు గదులు గల దేవాలయమున మధ్యభాగమునందు విశ్వరూపుడగు మహా విష్ణువును స్థాపింపవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Agni Maha Purana - 138 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *
*Chapter 43*
*🌻 Installation of deities in the temples - 1 🌻*
The Lord said:
1. O Brahman! Listen to my description (of the mode) of installation (of images) of deities in the temples. (Image of Vāsudeva should be placed at the middle of the five divine) edifices.
2. (The images of) the dwarf-form, man-lion form, horseheaded form, (and) boar form (of Viṣṇu) should be placed in the south-east, south-west, north-west and north-east (respectively).
3-5. (The image of) Nārāyaṇa should be placed in the middle. (The images of) the goddess, sun, Brahmā and the liṅga (symbolic representation of Śiva) or of Rudra (Śiva) should be placed in the south-east, south-west, north-west and north-east (respectively). Otherwise, (image of) Vāsudeva should be placed at the centre of the nine chambers and beautiful (images of Indra and the guardian deities of the world (should be placed) in the east and other directions. Otherwise, one should make five chambers and worship Puruṣottama (Viṣṇu) in the centre..
6. (The images of) Lakṣmī and Vaiśravaṇī (Kubera) should be placed in the east, the divine mothers in the south, Skanda, Gaṇeśa, Īśāna (a form of Śiva) and the sun and other planets in the west.
7-8. Otherwise, having installed (the images of) the manifestations (of Viṣṇu) such as the Fish etc., in the north, Caṇḍikā (a form of Goddess Pārvatī) in the south-east, Ambikā in the south-west, Sarasvatī in the north-west, Padmā (Lakṣmī) in the north-east and Vāsudeva or also Nārāyaṇa in the centre. The omni-present form of Hari should be placed in the centre in (the construction of) the thirteen chambers.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 273 / Osho Daily Meditations - 273 🌹*
*📚. ప్రసాద్ భరద్వాజ*
*🍀 273. కోపం మరియు నొప్పి 🍀*
*🕉. నొప్పి నుండి రక్షణగా కోపం పుడుతుంది. ఎవరైనా మిమ్మల్ని బాధపెడితే, నొప్పికి వ్యతిరేకంగా మీ ఉనికికి రక్షణగా మీరు కోపంగా ఉంటారు. కాబట్టి ప్రతి నొప్పి కోపంతో అణచివేయ బడుతుంది. నొప్పిపై పొరలు పొరలుగా ఉన్నవి కోపం యొక్క పొరలు. 🕉*
*కోపంతో పనిని కొనసాగించండి మరియు అకస్మాత్తుగా ఏ క్షణంలోనైనా కోపం మాయమైందని, బదులుగా కోపంగా కాదు, మీరు విచారంగా ఉన్నారని మీరు గుర్తిస్తారు. వాతావరణం కోపం నుండి విచారంగా మారుతుంది. అలా జరిగినప్పుడు నొప్పికి దగ్గరగా ఉన్నారని మీరు నిర్ధారించు కోవచ్చు; అప్పుడు నొప్పి విస్ఫోటనం చెందుతుంది. బావి చేయడానికి భూమిని తవ్వినట్లే. మొదట మనం భూమిని మరియు రాతి పొరలను తొలగించాలి, ఆపై నీరు పైకి వస్తుంది.*
*మొదట అది స్వచ్ఛమైన నీరు కాదు, బురదగా ఉంటుంది; దాని తరువాత స్వచ్చమైన మూలాలు అందుబాటులోకి వస్తాయి. మొదట కోపం వస్తుంది మరియు అది భూమి వంటి అనేక పొరలను కలిగి ఉంటుంది. అప్పుడు దుఃఖం బురద నీరులా వస్తుంది, ఆపై నొప్పి --శుభ్రమైన, స్వచ్ఛమైన నొప్పి అందుబాటులో ఉంటుంది. ఆ స్వచ్ఛమైన నొప్పి చాలా అందంగా ఉంటుంది, ఎందుకంటే ఇది మీకు వెంటనే మరొక జన్మనిస్తుంది.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 273 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 273. ANGER AND PAIN 🍀*
*🕉. Anger arises as a protection against pain. If somebody hurts you, you become angry as a protection of your being against pain. So every pain is suppressed by anger--layers and layers of anger on top of pain. 🕉*
*Continue working on anger, and suddenly any moment you will feel the anger has disappeared--that you are becoming sad, not angry. The climate will change from anger to sadness, and when it does you can be certain that now you are close to pain; then the pain will erupt. It is just as if we dig a hole in the earth to make a well. First we have to remove the earth and many layers of stone, and then the water comes up.*
*At first it is not clean water, it is muddy; then by and by cleaner sources become available. First anger will come and it has many layers, like earth. Then sadness will come like muddy water, and then pain--clean, pure pain-will be available. And pure pain is tremendously beautiful, because it will give you another birth immediately.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 417 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 417 -1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 90. చిచ్ఛక్తి, శ్చేతనారూపా, జడశక్తి, ర్జడాత్మికా ।*
*గాయత్రీ, వ్యాహృతి, స్సంధ్యా, ద్విజబృంద నిషేవితా ॥ 90 ॥ 🍀*
*🌻 417. 'చేతనా రూపా' - 1🌻*
*చైతన్య స్వరూపిణి శ్రీదేవి అని అర్థము. నిర్మలమైన చైతన్యమే రూపముగా గలది శ్రీమాత అని అర్థము. అదియే పరిపూర్ణమగు పరమేశ్వరుని శక్తి. ఇందుండియే త్రిశక్తులు ఉద్భవించును. త్రిశక్తులుగా ఉద్భవించినపుడు అందు మరల సాత్విక శక్తిగా ఉద్భవించును. జీవులలో బుద్ధి రూపమున యుండును. ఇట్లు శ్రీమాత అవతరణము పరాశక్తి నుండి చైతన్య శక్తిగను, చైతన్యశక్తి నుండి సాత్విక శక్తిగను, సాత్విక శక్తి నుండి ధీశక్తిగను అవతరించును. ధీశక్తియే బుద్ధి.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 417 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️. Acharya Ravi Sarma 📚. Prasad Bharadwaj*
*🌻 90. Chichakti shchetanarupa jadashakti jadatmika*
*Gayatri vyahruti sandhya dvijabrunda nishemita ॥ 90 ॥🌻*
*🌻 417. 'Chetana Rupa' - 1🌻*
*It means Sridevi is the form of Consciousness. It means that Sri Mata is the form of pure consciousness. That is the power(Shakti) of the Lord. It is from this that the three powers(Trishaktis) arise. When it emerges as Trishakti, it again emerges as Sattvik Shakti, and exists as intelligence in living beings. Thus Shrimata's avatara incarnates from Parashakti to Chaitanya Shakti, from Chaitanya Shakti to Sattvik Shakti, and from Sattvik Shakti to Dhishakti. Dhishakti is the intellect.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
www.facebook.com/groups/chaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages
https://chaitanyavijnanam.tumblr.com/
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
No comments:
Post a Comment