శ్రీ శివ మహా పురాణము - 652 / Sri Siva Maha Purana - 652

🌹 . శ్రీ శివ మహా పురాణము - 652 / Sri Siva Maha Purana - 652 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-కుమార ఖండః - అధ్యాయము - 15 🌴

🌻. గణేశ యుద్ధము - 7 🌻


వారి ఈ మాటలను విని పరమ కోపి యగు రుద్రుడు కోపించి వెనువెంటనే తన గణములతో గూడి ఆ స్థానమునకు వెళ్లెను (65). దేవసైన్యమంతయు చక్రధారియగు విష్ణువుతో గూడి గొప్ప ఉత్సవమును చేసి శివుని వెంబడించిరి (66). ఓ నారదా! ఇంతలో నీవు దేవదేవుడగు మహేశ్వరునకు భక్తితో చేతులు జోడించి నమస్కరించి ఇట్లు పలికితివి (67).


నారదుడిట్లు పలికెను -

దేవ దేవా! మహాదేవా! విభూ! నామటను వినుము. సర్వవ్యాపియగు నీవు అనేక లీలలను చేయుటలో నిపుణుడగు ప్రభుడవు (68). నీవు గొప్ప లీలను నెరపి గణముల గర్వమునడంచితివి. ఓ శంకరా! ఈ గణేశునకు మహాబలము నిచ్చి దేవతల గర్వమునడంచితివి (69). ఓ నాథా! శంభూ! స్వతంత్రుడవగు నీవు అందరి గర్వము నడంచి అద్భుతమగు నీ బలమును లోకమునకు చాటి చెప్పితివి (70).

ఓ భక్తప్రియా! ఈశా! ఈ లీలను ఇంకనూ కొనసాగింపకుము. నీ గణములను, మరియు దేవతలను ఆదరించి వర్థిల్ల జేయుము

(71). బ్రహ్మపదమునిచ్చు దేవా! ఈ క్రీడను ఇప్పటితో విడిచి పెట్టము. ఓ నారదా! ఆయనతో నీ విట్లు పలికి అంతర్ధానము జెందితివి (72).

శ్రీ శివ మహాపురాణములో రుద్ర సంహితలోని కుమార ఖండలో గణేశ యుద్ధ వర్ణనమనే ఇరువది అయిదవ అధ్యాయము ముగిసినది (25).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 652🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Kumara-khaṇḍa - CHAPTER 15 🌴

🌻 Gaṇeśa’s battle - 7 🌻



Brahmā said:—

65. On hearing their words, the furious Rudra became more furious and went there along with his Gaṇas.

66. The entire army of the gods along with the discusbearing Viṣṇu shouted in jubilation and followed Śiva.

67. In the meantime, bowing to Śiva, the lord of the gods with palms joined in reverence, O Nārada, you spoke as follows.


Nārada said:—

68. “O lord of the gods, please listen to my words. You are the all-pervading lord and expert in various sports.

69. By indulging in a great sport, the arrogance of the Gaṇas has been removed by you. O Śaṅkara, the impudence of the gods too has been removed by giving this (Gaṇeśa) much strength.

70. O lord Śiva, your own wonderful strength has been known to the worlds, you who independently remove the haughtiness of everyone.

71. O lord who are favourably disposed to your devotees, do not indulge in that sport. Please honour your own Gaṇas and the gods suitably and make them flourish.

72. O bestower of the region of Brahman, please do not treat him leisurely but kill him in your play now.” O Nārada, after saying this, you vanished from the place.


Continues....

🌹🌹🌹🌹🌹

No comments:

Post a Comment