శ్రీ మదగ్ని మహాపురాణము - 146 / Agni Maha Purana - 146
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 146 / Agni Maha Purana - 146 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 44
🌻. వాసుదేవ ప్రతిమా లక్షణము - 5🌻
అరచేయి వెడల్పు ఏడంగుళములు, మధ్యవ్రేలు పొడవు ఐదు అంగుళములు, తర్జనీ-అనామికల పొడవు దానికంటె అర అంగుళము. తక్కువగా ఉండవలెను. కనిష్ఠకా-అంగుష్ఠముల పొడవు నాలుగు అంగుళములు. బొటనవ్రేలికి రెండుకణుపులు, మిగిలిన వాటికి మూడేసి కణుపులు ఏర్పరింపవలెను. గోళ్ళ పొడవు ఒక కణుపు పొడవులో సగముండవలెను. వక్షస్థలమెంత ఉన్నదో పొట్ట అంతే ఉండవలెను. నాభిరంధ్రము ఒక అంగుళముండవలెను. నాభినుండి లింగము వరకు జానెడు దూరముండవలెను.
ఉదరము తిరుగుడు నలుబది రెండు అంగుళములు. స్తనముల మధ్య భాగము జానెడు. స్తనాగ్రములు యవ ప్రమాణముతో ఉండవలను. స్తనముల తిరుగుడు రెండు పదములుండవలెను. వక్షస్థలము తిరుగుడు అరువది నాలుగు అంగుళములు, దాని క్రింద నాల్గువైపుల తిరుగుడు "కువేష్టనము" అనిపేరు. నడుము తిరుగుడు ఏబది నాలుగు అంగుళము. ఊరు మూలముల విస్తారము పండ్రెండేసి అంగుళములు దానిపైన మధ్యభాగ విస్తారము అధికముగా ఉండవలెను, మధ్య భాగము నుండి క్రిందికి విస్తారము క్రమముగ తగ్గవలెను. మోకాళ్ళ విస్తారము ఎనిమిది అంగుళములు. వాటికి క్రింది పిక్క విస్తారము మూడు రెట్లుండవలెను. పిక్క మధ్యభాగము విస్తారము ఏడు అంగుళము లుండవలంను. దాని తిరుగుడు మూడు రెట్లుండవలెను. పిక్క అగ్రభాగమున విస్తారము ఐదు అంగుళములు, దాని తిరుగుడు మూడు రెట్లు, పాదములు జానెడేసి పొడుగు ఉండవలెను. పాదముల ఎత్తు నాలుగు అంగుళములు మడమల ముందు భాగము కూడ నాలుగు అంగుళము లుండవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 146 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 44
🌻Characteristics of the image of Vāsudeva - 5 🌻
31. The index finger and the ring finger (should be) half an aṅgula less than that. The little finger and the thumb should be made to measure four aṅgulas each.
32. The thumb should be made to have two parvans (joints). The other fingers (should have) three joints. The measure of the nail is laid down as half (the size of the joints) on the respective fingers.
33. The extent of the belly is same as that of the chest. The:navel should be an aṅgula (in breadth) and proportionally deep.
34. Then the inter-space between the generative organ and the intestines should be made to measure a tāla. The girth around the navel (should be) forty-two aṅgulas.
35. The inter-space between the breasts should be made to measure a tāla in breadth. The nipples should be of the measure of a yava[2] (barley grain). The circular space around them should be two pādas (two feet).
36. The circumference of the chest should be made sixty-four aṅgulas clearly. The girth of the lower portion (of the chest) is said to be four mukhas[3] (one tāla).
37. The circumference of the waist should be fifty-four aṅgulas. The breadth of the base of the thigh is said to be twelve aṅgulas.
38. It is somewhat greater at the middle (of the thigh) and gradually less (broad) below. The knee-joint (should be) eight aṅgulas in breadth and thrice that in its girth.
39. The middle of the leg from the ankle to the knee is said to be seven aṅgulas broad. The girth of it (should be) three times that. The top of the leg (should be) five aṅgulas broad.
40. The girth of that (the leg) (should be) thrice its breadth. The feet (should) measure a tāla. The extent of elevation of the feet (should be) four aṅgulas.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment