శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 439 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 439 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 439 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 439 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 93. కుశలా, కోమలాకారా, కురుకుళ్ళా, కులేశ్వరీ ।
కుళకుండాలయా, కౌళ మార్గతత్పర సేవితా ॥ 93 ॥ 🍀
🌻 439. 'కాళమార్గ తత్పర సేవితా' - 1 🌻
వంశక్రమాగతమైన పూజా పద్దతులచే భక్తితో సేవింపబడు చున్నది శ్రీమాత అని అర్థము. వంశ పరంపరగా దైవారాధన జరుగుచుండుట భారతీయ సంప్రదాయము. ప్రతి వంశము నందు కులదేవత యుండును. కుల మనగా వంశమని కూడ అర్థము. కులదేవత, ఇలదేవత నిత్యము పూజింపబడుట సదాచారము. దేవతారాధన అన్నియూ కూడ శ్రీమాతనే చేరును. ఎవరెవరు ఏయే కుల మార్గమున పూజించిననూ వారి వారికి సమర్పణ భావమును బట్టి శ్రీమాత అనుగ్రహించు చుండును. ధూప దీప నైవేద్యాదులు అర్పించుచూ, ఆరాధన చేయుచు వంశానుక్రమముగ ఆరాధనము నిర్వర్తించు పద్దతి సమ్మతమైన పద్దతియే. ఈ పద్దతిని కౌళ మతము లేక కౌళ మార్గమందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 439 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 93. Kushala komalakara kurukulla kuleshvari
Kulakundalaya kaolamarga tatpara sevita ॥ 93 ॥ 🌻
🌻 439. kaolamarga tatpara sevita - 1 🌻
Shree Mata means the one who is served with devotion by the hereditary methods of worship. It is an Indian tradition to worship God through generations. Every clan has a clan deity. Kula also means clan. The deity of the clan and the house should be worshiped forever. All the worship of the deities goes to Sri Mata. Whoever worships in any way, according to their devotion, Sri Mata will bless them. The acceptable method is to perform worship in the lineage of worshipers offering incense and lamp offerings. This method is known as Kaula Marga.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment