🌹 22, MAY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹

🍀🌹 22, MAY 2023 MONDAY ALL MESSAGES సోమవారం, ఇందు వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 22, MAY 2023 MONDAY సోమవారం, ఇందు వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 374 / Bhagavad-Gita - 374 🌹 🌴10వ అధ్యాయము - విభూతి యోగం - 02 / Chapter 10 - Vibhuti Yoga - 02 🌴
4) 🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 221 / Agni Maha Purana - 221 🌹 
🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 5 / Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 5 🌻
4) 🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 086 / DAILY WISDOM - 086 🌹 
🌻 26. తెలిసినవాడు ఒక్కడే 26. The Knower Alone Is 🌻
5) 🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 350 🌹
6) 🌹. శివ సూత్రములు - 88 / Siva Sutras - 88 🌹 
🌻 2-04. గర్భే చిత్త వికాసో' విశిష్ట విద్యా స్వప్నః - 4 / 2-04. garbhe cittavikāso'viśistavidyāsvapnah - 4 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 22, మే, May 2023 పంచాగము - Panchagam 🌹*
*శుభ సోమవారం, Monday, ఇందు వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ శివ సహస్రనామ స్తోత్రం - 33 🍀*

*65. సగణో గణకారశ్చ భూతవాహనసారథిః |*
*భస్మశయో భస్మగోప్తా భస్మభూతస్తరుర్గణః*
*66. లోకపాలస్తథాలోకో మహాత్మా సర్వపూజితః |*
*శుక్లస్త్రిశుక్లః సంపన్నః శుచిర్భూతనిషేవితః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : విశ్వ ప్రేమ ప్రకటన - నీలోని చైతన్యమంతటిలోనూ మాలిన్య మనేది లేక పరమ విశుద్ధ స్వరూపంలో ఏకత్వానుభూతి నీ యందు నెలకొనే పర్యంతం, నీవు విశ్వ ప్రేమను ప్రకటన చెయ్యడం మంచిది కాదు. ఆలా ప్రకటన చెయ్య కుండా దానిని నీలో కుంభించుకున్నప్పుడే, క్రమశః చేకూరగల యితర అనుభూతుల వలన కూడ అది మరింత సుస్థిరము, విశుద్ధమునై నీ ప్రకృతి యందు అంతర్భాగమై పోతుంది. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం,
జ్యేష్ఠ మాసం
తిథి: శుక్ల తదియ 23:20:11 వరకు
తదుపరి శుక్ల చవితి
నక్షత్రం: మృగశిర 10:38:50 వరకు
తదుపరి ఆర్ద్ర
యోగం: ధృతి 16:33:47 వరకు
తదుపరి శూల
కరణం: తైతిల 10:43:12 వరకు
వర్జ్యం: 19:43:42 - 21:27:50
దుర్ముహూర్తం: 12:38:48 - 13:30:51
మరియు 15:14:59 - 16:07:02
రాహు కాలం: 07:19:55 - 08:57:32
గుళిక కాలం: 13:50:23 - 15:28:00
యమ గండం: 10:35:09 - 12:12:46
అభిజిత్ ముహూర్తం: 11:46 - 12:38
అమృత కాలం: 01:15:16 - 02:57:24
మరియు 25:48:10 - 27:32:18
సూర్యోదయం: 05:42:19
సూర్యాస్తమయం: 18:43:13
చంద్రోదయం: 07:37:39
చంద్రాస్తమయం: 21:22:34
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: జెమిని
యోగాలు: ఆనంద యోగం - కార్య
సిధ్ధి 10:38:50 వరకు తదుపరి 
కాలదండ యోగం - మృత్యు భయం
దిశ శూల: తూర్పు 
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి
🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 374 / Bhagavad-Gita - 374 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 10వ అధ్యాయము - విభూతి యోగం - 02 🌴*

*02. న మే విదు: సురగణా: ప్రభవం న మహర్షయ: |*
*అహమాదిర్షి దేవానాం మహర్షీణాం చ సర్వశ: ||*

🌷. తాత్పర్యం :
*సర్వవిధముల నేనే దేవతలకు మరియు మహర్షులకు మూలమై యున్నందున దేవతా సమూహముగాని, మహర్షులుగాని నా ఉత్పత్తిని లేదా విభూతులను తెలిసి కొనజాలరు.*

🌷. భాష్యము : 
*బ్రహ్మసంహిత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడే దేవదేవుడు. అతని కన్నను అధికుడు వేరొక్కడు లేడు. అతడే సర్వకారణకారణుడు. తానే దేవతలకు మరియు ఋషులకు కారణుడనని అతడే స్వయముగా ఇచ్చట పలుకుచున్నాడు. అనగా దేవతలు మరియు మహర్షులు కూడా శ్రీకృష్ణుని సంపూర్ణముగా ఎరుగలేరు. వారే ఆ భగవానుని నామమును గాని, స్వరూపమును గాని ఎరుగలేరన్నచో అల్పమైన ఈ లోకమునకు చెందిన నామమాత్ర పండితుల విషయము వేరుగా తెలుపపనిలేదు. భగవానుడు ఏ కారణము నిమిత్తము ధరత్రి యందు సామాన్యమానవునిగా అవతరించి అద్భుతములు మరియు అసాధారణములైన కార్యముల నొనర్చునో ఎవ్వరును ఎరుగాజాలరు.*

*అనగా పాండిత్యమనునది శ్రీకృష్ణుని అవగాహన చేసికొనుటకు ఒక యోగ్యత కాదని మనము గ్రహింపవలెను. దేవతలు మరియు ఋషులు సైతము తమ మానసికకల్పనలచే శ్రీకృష్ణుని అవగతము చేసికొన యత్నించినను విఫలురైరి. కనుకనే గొప్ప గొప్ప దేవతలు కూడా శ్రీకృష్ణభగవానుని ఎరుగాజాలరని శ్రీమద్భాగవతమునందు స్పష్టముగా తెలుపబడినది. వారు తమ పరిమిత ఇంద్రియముల పరధి మేరకు ఊహాగానము చేయ యత్నించినను త్రిగుణములచే వ్యక్తము కానట్టి నిజతత్త్వమునకు విరుద్ధభావమైన నిరాకారతత్త్వమునే చేరగలరు. అనగా వారు మానసిక కల్పనలను కావించినను దాని ద్వారా శ్రీకృష్ణుని మాత్రము ఎరుగాజాలరు. పరతత్త్వమును తెలిసికొనగోరువారు కొరకై శ్రీకృష్ణభగవానుడు ఇచ్చట తాను దేవదేవుడననియు మరియు పరమపురుషుడనని పరోక్షముగా తెలియజేయుచున్నాడు. ఈ విషయమును ప్రతియొక్కరు గమనింపవలెను.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 374 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 10 - Vibhuti Yoga - 02 🌴*

*02. na me viduḥ sura-gaṇāḥ prabhavaṁ na maharṣayaḥ*
*aham ādir hi devānāṁ maharṣīṇāṁ ca sarvaśaḥ*

🌷 Translation : 
*Neither the hosts of demigods nor the great sages know My origin or opulences, for, in every respect, I am the source of the demigods and sages.*

🌹 Purport :
*As stated in the Brahma-saṁhitā, Lord Kṛṣṇa is the Supreme Lord. No one is greater than Him; He is the cause of all causes. Here it is also stated by the Lord personally that He is the cause of all the demigods and sages. Even the demigods and great sages cannot understand Kṛṣṇa; they can understand neither His name nor His personality, so what is the position of the so-called scholars of this tiny planet? No one can understand why this Supreme God comes to earth as an ordinary human being and executes such wonderful, uncommon activities. One should know, then, that scholarship is not the qualification necessary to understand Kṛṣṇa.*

*Even the demigods and the great sages have tried to understand Kṛṣṇa by their mental speculation, and they have failed to do so. In the Śrīmad-Bhāgavatam also it is clearly said that even the great demigods are not able to understand the Supreme Personality of Godhead. They can speculate to the limits of their imperfect senses and can reach the opposite conclusion of impersonalism, of something not manifested by the three qualities of material nature, or they can imagine something by mental speculation, but it is not possible to understand Kṛṣṇa by such foolish speculation. Here the Lord indirectly says that if anyone wants to know the Absolute Truth, “Here I am present as the Supreme Personality of Godhead. I am the Supreme.” One should know this.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 221 / Agni Maha Purana - 221 🌹*
*✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ*
*శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.*
*ప్రథమ సంపుటము, అధ్యాయము - 64*

*🌻. కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథనము. - 5 🌻*

*యజ్ఞప్రాంగణము "యూపబ్రహ్మ" ఇత్యాది మంత్రముతో యూపమును స్థాపించి, దానికి వస్త్రములు చుట్టబెట్టి, పై భాగమున పితాక ఏర్పరుపవలెను. దానిని గంధాదులతో పూజించి, జగత్తుకొరకై శాంతికర్మ చేయవలెను. ఆచార్యునకు భూమి, గోవు, సువర్ణము, జలపాత్రము మొదలగునవి దక్షిణగ ఇవ్వవలెను. ఇతర బ్రాహ్మణులకు గూడ దక్షిణ లిచ్చి, వచ్చిన వారికి ఖోజనము పెట్టవలెను. "బ్రహ్మ మొదలు తృణమువరకు, లేదా కీటకము వరకు దప్పికొన్న వారి కందరికిని ఈ తడాగములో నున్న జలముచే తృప్తి కలుగు గాక" అని పలుకుచు జలము విడిచిపెట్టి. జలాశయములో పంచగవ్యము లుంచవలెను. పిమ్మట 'ఆపో హి ష్ఠామ' ఇత్యాది ఋక్త్రయము పఠించుచు, బ్రాహ్మణులు సమకూర్ఛిన శాంతి జలమును, పవిత్రతీర్థ జలమును ఉంచి, బ్రాహ్మణులకు గోవృషభాదిదానము చేయవలెను. ఎట్టి అడ్డులు చెప్పకుండగ అందరికిని అన్నదానము చేయు ఏర్పాట్లు చేయవలెను. ఒక్క జలాశయమును నిర్మించువాని పుణ్యము లక్ష అశ్వమేధయాగములు చేసిన వాని పుణ్యము కంటె వేయి రెట్లు అధికము. అతడు స్వర్గము చేరి విమానమునందు ఆనందించుచుండును. ఎన్నడును నరకమునకు వెళ్ళడు జలాశయమునందు గోవులు మొదలుగు పశువులు జలము త్రాగును గాన దానిని నిర్మించినవాడు పాప వినిర్ముక్తు డగును. జలదానము చేసిన మానవుడు సకల దానములు చేసిన ఫలముపొంది స్వర్గమునకు వెళ్ళును.*

*అగ్నిమహాపురాణము నందు కూపవాపీతటాకాది ప్రతిష్ఠా కథన మను ఆరువదినాల్గవ అధ్యాయము సమాప్తము.*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Agni Maha Purana - 221 🌹*
*✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj *

*Chapter 64*
*🌻Mode of consecration of tanks and ponds (kūpa-pratiṣṭhā) - 5 🌻*

39-40. Fees should be paid to twice-borns. Those who are-present should be fed. “From Brahman down to (inanimate

objects like) the pillar all those who seek water may get satisfied with the waters of the tank!” (With the utterance of these words) the water should be given as charity. The five things got from a cow should then be thrown (into the water).

41. With the utterance of (the mantra) āpo hi ṣṭhā[37] thrice, the sanctified water got ready by the brahmins and the holy waters of the sacred spots should be sprinkled (into the tank) and herd of kine should be given to brahmins.

42-43. Food and other things should be given to all the people without any restraint. One who consecrates a reservoir of water (acquires) in a single day a merit ten crores times more than one who performs thousands of aśvamedha (the horsesacrifice). Such a person goes to heaven in the (celestial) vehicle and rejoices (there). He never goes to hell.

44. The consecrator can never get any sin as the cattle and other (animals) drink water from it. One attains all merits by the endowment of water (tank) and goes to heaven.

Continues....
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 86 / DAILY WISDOM - 86 🌹*
*🍀 📖. బృహదారణ్యక ఉపనిషత్తు నుండి 🍀*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🌻 26. తెలిసినవాడు ఒక్కడే 🌻*

*సర్వజ్ఞు డికి సంపూర్ణ జ్ఞానం ఉంటుంది. కానీ ఆ సర్వజ్ఞుని గురించిన జ్ఞానం ఎవరికి ఉంటుంది? సర్వజ్ఞుని తెలుసుకోవాలంటే, రెండవ జిజ్ఞాసువు ఉండాలి. అలాగే ఆ రెండవ జిజ్ఞాసువును తెలుసుకోవాలంటే మూడవ, మూడవను తెలుసుకోవాలంటే నాల్గవ జిజ్ఞాసువులు కావాలి. ఇలా వెళ్తూ పోతే మీకు ఏమీ అర్థం కాదు. మీరు ఆ ప్రథమ సర్వజ్ఞు డిని తెలుసుకోలేరు.*

*జ్ఞానిని ఎలా తెలుసుకుంటారు? మీరు ఇక్కడ చూస్తే జ్ఞాని అన్నాం, జ్ఞానం అన్నాం. అంతే కానీ జ్ఞానాన్ని సంపాదించడం అంటూ ఏమీ లేదు. అలాగే జ్ఞానిని గూర్చి తెలుసుకోవడం అంటూ ఏమీ లేదు. మీరు ఎదిగినప్పుడే ఆఖరి మెట్టు గా జ్ఞానం సంపాదించ గలరు. అంటే మీరు ముక్తి సంపాదించి నపుడు ఆ వస్తువు యొక్క జ్ఞానం మీలో భాగమైపోయింది. ఆ జ్ఞానం జ్ఞానిలో భాగం. అంటే జ్ఞానే ఉంటాడు తప్ప జ్ఞానం కాదు.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 DAILY WISDOM - 86 🌹*
*🍀 📖 The Brihadaranyaka Upanishad 🍀*
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

*🌻 26. The Knower Alone Is 🌻*

*Everything is known by the knower, but who is to know the knower? If the knower is to be known, there must be a second knower to that knower, and the second knower can be known by a third knower, the third by a fourth, the fourth by a fifth, and so on. You go on scratching your head, you cannot know the knower.*

*How can the knower be known? We have already designated the knower as the ‘Knower’ and you cannot now call it the ‘known’. Therefore there is no such thing as knowing of Knowing, or knowing of Knower. Knowing of objects only is there before liberation. With liberation, that object has become part of knowing itself; It has become one with the Knower. The Knower alone is; there is no such thing then as ‘knowing’.*

Continues...
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 351 🌹*
*✍️. సౌభాగ్య 📚. ప్రసాద్ భరద్వాజ*

*🍀. మార్మికులు మన ప్రపంచాన్ని భ్రాంతి, మాయ అన్నారు. బాధ భ్రాంతి, ఆనందమే మన అసలు తత్వం. గుర్తుంచుకోండి. 🍀*

*ఏ క్షణం మనం మేలుకొంటామో ఆ క్షణమే అన్ని బాధలు, అన్ని కష్టాలూ చాలా అసంగతంగా, తెలివితక్కువగా అనిపిస్తాయి. ఏంటిది? నేనెట్లా బాధపడ్డాను. నా బాధ లేమిటి? ఎంతకాలం బాధపడ్డాను? యిదంతా పొరపాటు. అందులో అర్థమే లేదు. అది కేవలం ఒక అభిప్రాయం, ఒక కల' అనుకుంటాడు. అందుకనే మార్మికులు మన ప్రపంచాన్ని భ్రాంతి, మాయ అన్నారు. బాధ భ్రాంతి, ఆనందమే మన అసలు తత్వం. గుర్తుంచుకోండి. మళ్ళీ మళ్ళీ మళ్ళీ గుర్తుంచుకోండి.*

*సశేషం ...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 088 / Siva Sutras - 088 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*2వ భాగం - శక్తోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 2-04. గర్భే చిత్త వికాసో' విశిష్ట విద్యా స్వప్నః - 4 🌻*
*🌴. మాయతో నిండిన మలినమైన శరీరంలో చిత్తం వికసించినప్పుడు, పరిమిత శక్తులతో కూడిన స్వప్నం లాంటి అస్పష్టమైన జ్ఞానం పుడుతుంది. 🌴*

*ఆధ్యాత్మిక పురోగతి సమయంలో కూడా, అంతిమ వాస్తవాన్ని గ్రహించే ప్రక్రియలో భాగంగా కొన్ని సిద్ధులను పొందవచ్చు. కానీ ఆధ్యాత్మిక పురోగతి కోసం వాటిని విస్మరించాలి. ఎవరైనా అలాంటి స్వయంవిధ్వంసక శక్తుల పట్ల అనుబంధం కలిగి ఉంటే, అతను ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరిస్తున్నప్పటికీ, అతను అజ్ఞానిగా పరిగణించబడతాడు. ఇది పరోక్షంగా కేవలం ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించడం సరిపోదని, భగవంతుడిని గ్రహించడానికి శక్తి మరియు సంకల్పం కూడా ఉండాలని సూచిస్తుంది. అతను రెండవ ఆలోచనను పెంపొందించుకోలేడు. ప్రాథమిక లేదా ఏకైక ఆలోచనా ప్రక్రియ దైవంతో తన ఐక్యత. భగవంతుడు అతని నుండి విడదీయరానివాడు కాబట్టి అతనితో ఇప్పటికే ఐక్యమై ఉన్నాడు. ఈ వాస్తవాన్ని మొదట అర్థం చేసుకోవడం మరియు తరువాత గ్రహించడం మాత్రమే అవసరం.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras - 088 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
Part 2 - Śāktopāya.
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 2-04. garbhe cittavikāso'viśistavidyāsvapnah - 4 🌻*
*🌴. From the flowering of the chitta in an impure body which is filled with maya, there arises dreamlike indistinct knowledge with limited powers. 🌴*

*Even during spiritual progression one may come across certain siddhi-s (super human powers) that are to be ignored to realise the Ultimate Reality. If one gets associated with such self destructive powers, he is also said to be ignorant, even though he pursues the path of spirituality. This indirectly implies that merely following spiritual path is not enough, but one also needs to have will power and determination to realise the Lord. He cannot afford to nurture a second thought, the primary or sole thought process being his union with the Lord Himself. Lord is already united with him as He is inseparable from him and only thing that is required is to first understand and later realise this Reality.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages2
https://chaitanyavijnanam.tumblr.com/
https://prasadbharadwaj.wixsite.com/lalithasahasranama

No comments:

Post a Comment