🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 456 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 456 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 95. తేజోవతీ, త్రినయనా, లోలాక్షీ కామరూపిణీ ।
మాలినీ, హంసినీ, మాతా, మలయాచల వాసినీ ॥ 95 ॥ 🍀
🌻 456. 'మాతా' - 1 🌻
సర్వమునకు తల్లి అని అర్థము. అనంతమైన తత్త్వమునకు ఆవరణ లేర్పరచుచు ఏకత్వమున అనేకత్వము నేర్పరచునది శ్రీమాత. ఒకే మట్టి నుండి పెద్ద పెద్ద విగ్రహములు, అంతకన్న చిన్నవి, అంతకన్న చిన్నవి ఏర్పరచినట్లుగ, ఏడు లోకములను అందు జీవులను ఏర్పాటు చేయును. మహత్తు నుండి అణువు వరకు కోటానుకోట్ల రూపములను తయారుచేయును. ఇవన్నియు తత్త్వ మాధారముగనే నిర్మించును. ఒక చోటులో ఒక పెద్ద ఇల్లు ఏర్పాటు చేసి అందులో ఏడు గదులు పెద్దవి, చిన్నవి ఏర్పరచినపుడు అవి ఏడు చోటులుగా అని పించును. పెద్దగది, చిన్నగది అని పిలుతుము. చోటుకు పెద్ద చిన్న లేదు. గది ఆవరణను బట్టి పెద్ద చిన్న ఏర్పడును. ఇట్లే లోకములు, జీవులు రూప పరిమాణమును బట్టి పెద్దవి, చిన్నవి, గొప్పవి, తక్కువవి యేర్పడును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 456 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 95. Tejovati trinayana lolakshi kamarupini
Malini hansini mata malayachala vasini ॥ 95 ॥ 🌻
🌻 456. 'Mata' - 1 🌻
Meaning She is the mother for all. Shrimata is the one who teaches unity and multiplicity, creating a framework for infinite philosophy. Just as big idols, smaller ones and smaller ones are formed from the same clay, so do those beings form the seven worlds. Makes billions of forms from the megalith to the atom. All these are built on the basis of philosophy. When a big house is set up in a place and seven rooms are made in it, big and small, it seems that they are seven places. We call it big room and small room. The place is not big or small. Depending on the size of the room, it can be made bigger or smaller. Similarly, the worlds and beings are divided into big, small, great and lesser according to the size of form.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment