శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 460 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 1
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 460 -1 / Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 1 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻 460. 'సుభ్రూ' - 1 🌻
మంగళకరమైన కన్నులు కలది శ్రీమాత అని అర్థము. శ్రీమాత కనుబొమలు మంగళతోరణములై గోచరించును. తోరణముల నడుమ 'శ్రీ' బిందువుగ నుండును. కుడి ఎడమ తోరణములు సరిసమానముగ ఏర్పడి యున్నప్పుడు భ్రూమధ్యము వికసించ బోవు పద్మము మొగ్గవలె యుండును. కుడి, ఎడమ తోరణములు ఇడ, పింగళ నాడులను సంకేతించును. కనుబొమల ఉత్తర భాగము నందు ఫాలమున ఇడ, పింగళ కేంద్రము లున్నవి. ఇవి ప్రజ్ఞ పదార్థములకు ఉత్పత్తి కేంద్రములు, ఈ రెండునూ సమప్రభతో నున్నప్పుడు భ్రూమధ్యము వెలుగు మొగ్గయై గోచరించును. ఆ వెలుగు చీకటులను పారద్రోలును, అజ్ఞానమును దరి చేరనీయదు. అత్యంత శక్తివంతముగను, ఆకర్షణీయముగను వుండును. మంగళప్రదమై యుండును. సర్వ శుభములకు కారణమై యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 460 - 1 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻 460. 'Subhru' - 1 🌻
It means Srimata with auspicious eyes. Srimata's eyebrows appear as auspicious garlands. Between the arches in the centre is 'Sri'. When the right and left arches are formed equally, the center of the garland looks like a blooming lotus bud. The right and left arches represent the ida and pingala nadis. In the upper part of the eyebrows in the forehead are the ida and the pingala centers. These are the centers of production of prajna and when both of these are in harmony, the centre of the brow becomes illuminated. That light dispels darkness and ignorance. It's Very powerful and attractive. It will be auspicious. It is the cause of all auspices.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment