శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 461 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 461 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 461 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 461 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 96. సుముఖీ, నళినీ, సుభ్రూః, శోభనా, సురనాయికా ।
కాలకంఠీ, కాంతిమతీ, క్షోభిణీ, సూక్ష్మరూపిణీ ॥ 96 ॥ 🍀
🌻 461. ‘శోభనా’ - 1 🌻
ఇటీవలి కాలమున గౌతమీపుత్ర శాతకర్ణి, కృష్ణదేవరాయలు అట్టి వైభవముతో జీవించిరి. కవులలో కాళిదాసు మహాకవి అట్టివాడు. వీరందరునూ రాజర్షులే. ధర్మాచరణము, జ్ఞానము, దక్షత, ధీరత్వము ఇవి అన్నియూ దివ్య సంపదతో కూడియున్నప్పుడు జీవిత మన్ని రంగముల యందును పరితుష్టితో సాగును. జ్యోతిషమున గురుడు, శుక్రుడు, చంద్రుడు, ఇంద్రుడు జాతకుని శుభదృష్టితో చూచునపుడు ఇట్టి వైభవము కలుగునని తెలుపుదురు. విద్యాబలము నిచ్చువాడు గురుడు. సత్సంపదకు కూడ గురుడే అధిపతి. సుఖమునకు శుక్రుడు అధిపతి. వైభవమునకు ఇంద్రుడు అధిపతి. సాధుశీలమునకు చంద్రుడు అధిపతి.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 461 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 96. Sumukhi nalini subhru shobhana suranaeika
Karikanti kantimati kshobhini sukshmarupini ॥ 96 ॥ 🌻
🌻 461. 'Shobhana' - 2 🌻
In recent times, Gautamiputra Satakarni and Krishnadevaraya lived with such glory. Among the poets, Kalidasa was such a poet. All of them are Rajarshis. Dharmacharana, knowledge, dexterity and bravery, when all these are combined with divine wealth, all the fields of life move in gratification. In astrology it is said that when Guru, Shukra, Chandra and Indra see the individual with a gracious look, this glory will come. Guru is the giver of education. Guru is also the head of satsampada. Venus is the ruler of happiness. Lord of glory is Indra. Moon is the lord of Sadhusila.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment