🌹 . శ్రీ శివ మహా పురాణము - 749 / Sri Siva Maha Purana - 749 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 14 🌴
🌻. జలంధరుని జన్మ, వివాహము - 2 🌻
దేవతలిట్లు పలికిరి -
లోకనాధా ! దేవాధీశా! మాకు భయము వచ్చి పడినది. ఈ అద్భుతమగు శబ్దము పుట్టుచున్నది. ఓ మహాయోగి! దానిని నశింపజేయుము (11).
సనత్కుమారుడిట్లు పలికెను -
లోకములకు పితామహుడగు బ్రహ్మ వారి ఈ మాటను విని 'ఇది ఏమి?' అని విస్మయమును పొంది అచటకు వెళ్లవలెనని తలంచెను (12). వత్సా! అపుడు బ్రహ్మ ఆ శబ్దమును గురించి తెలియ గోరి దేవతలతో సహా నిత్యలోకమునుండి భూమి పైకి దిగి సముద్రమువద్దకు వెళ్లెను (13). సర్వలోకములకు పితామహుడగు ఆ బ్రహ్మ అచటకు వచ్చుట తోడనే సముద్రుని ఒడిలో ఆ బాలకుని చూచెను (14). దేవతారూపమును ధరించియున్న సముద్రుడు అచటకు విచ్చేసిన బ్రహ్మను గాంచి శిరస్సుతో ప్రణమిల్లి ఆ బాలకుని ఆయన ఒడిలో కూర్చుండ బెట్టెను (15). అపుడు ఆశ్చర్యమును పొందియున్న బ్రహ్మ సముద్రునితో నిట్లనెను. ఓయీ సముద్రా! వెంటనే చెప్పుము. ఈ ఆద్భుత బాలకుడు ఎవని కుమారుడు? (16)
సనత్కుమారుడిట్లు పలికెను -
అపుడు సముద్రుడు బ్రహ్మయొక్క మాటను విని సంతసిల్లి, చేతులు జోడించి నమస్కరించి కొనియాడి ఆ ప్రజానాథునితో నిట్లనెను (17).
సముద్రుడిట్లు పలికెను -
ఓ బ్రహ్మా! నాకు తెలియకుండగనే నాకు ఈ బాలుడు దొరికినాడు. సర్వ లోకములను పాలించువాడా! ఈతడు అకస్మాత్తుగా గంగాసాగరసంగమమునుండి పుట్టినాడు (18). ఓ జగద్గురూ! ఈతనికి జాతకర్మ మొదలగు సంస్కారములను చేయించుము. ఓ విధాతా! వీని జాతకములో కనబడే భవిష్యత్ఫలము నంతనూ వివరించ తగుదువు (19).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 749🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 14 🌴
🌻 The birth of Jalandhara and his marriage - 2 🌻
The gods said:—
11. “This mysterious sound has arisen. O lord of worlds, O lord of gods, we are frightened. O great Yogin please quell it.”
Sanatkumāra said:—
12. On hearing their words, Brahmā the grandfather of the worlds wished to go there. He was perplexed as to what it was.
13. Then Brahmā descended from Satyaloka to the Earth along with the gods. Then he went to the ocean desirous of knowing what it was.
14. When Brahmā the grandfather of the worlds came there, he saw the boy in the lap of the ocean.
15. On seeing Brahmā coming, the ocean assuming the form of a god bowed to him and placed the boy in his lap.
16. Then the surprised Brahmā spoke these words to the ocean—“O ocean, tell me quickly about the parentage of this boy.”
Sanatkumāra said:—
17. On hearing the words of Brahmā, the ocean was delighted. After bowing to and eulogising him with palms joined in reverence he replied to Prajāpati Brahmā.
The ocean said:—
18. “O Brahmā, O lord of the worlds, this boy was suddenly seen in the confluence of the river Gaṅgā. I do not know about the origin of this boy.
19. O preceptor of the universe, you perform the postnatal rites for this boy. O creator, let me know your predictions about his future according to his horoscope”
Continues....
🌹🌹🌹🌹🌹
No comments:
Post a Comment