కపిల గీత - 202 / Kapila Gita - 202
🌹. కపిల గీత - 202 / Kapila Gita - 202 🌹
🍀. కపిల దేవహూతి సంవాదం 🍀
📚. ప్రసాద్ భరధ్వాజ
🌴 5. భక్తి స్వరూపము - కాలమహిమ - 12 🌴
12. లక్షణం భక్తియోగస్య నిర్గుణస్య హ్యుదాహృతమ్|
అహైతుక్యవ్యవహితా యా భక్తిః పురుషోత్తమే॥
తాత్పర్యము : అతీంద్రియ నామం మరియు గుణాలను వినడానికి ఒకరి మనస్సు ఒక్కసారిగా ఆకర్షించ బడినప్పుడు కల్మషం లేని భక్తి సేవ యొక్క అభివ్యక్తి ప్రదర్శించ బడుతుంది. అట్టి భక్తుడు నిష్కామ భావముతో నా యందు అనన్య భక్తిని కల్గియుండును. దీనిని "నిర్గుణ భక్తి యోగము" అని యందురు.
వ్యాఖ్య : నిర్గుణమైన (సత్వమూ కాదూ, రజస్సూ కాదూ, తమస్సూ కాదు, నేను పరమాత్మ యందు నిర్హేతుకముగా మనసు లగ్నం చేసాననే జ్ఞ్యానం కూడా ఉండకూడదు - అదే నిర్గుణం. మనం చేస్తున్న పని మీద మనసు ఉండాలి కానీ, మనం చేస్తున్న పని వలన కలిగే ఫలితాల మీద ఉండకూడదు. వాహనం నడుపుతూ దారిని చూడాలి గానీ, ఎక్కడికి వెళుతున్నామో దాని గురించి ఆలోచిస్తూ, దాన్ని చూస్తే ముందుకు వెళ్ళలేము) భక్తి యోగం. నిర్గుణమైన భక్తి అంటే కలగబొయే ఫలముతో వ్యవధానం ఉండకూడదు (అవ్యవహితా). నేనీ భక్తితో ఉంటే స్వామిని చూస్తాను అన్నది కూడా నిర్గుణ భక్తి కాదు. ప్రహ్లాద నారదులది అట్టి భక్తి. అహైతుకి (ఫలము మీద ఆసక్తి లేకుండా, ధర్మము కాబట్టి ఆరాధించాలి, కారణము లేని భక్తి. ఎలా ఐతే పరమాత్మ కటాక్షం నిర్హేతుకమో, మన భక్తి కూడ నిర్హేతుకమై ఉండాలి ), అవ్యవహితా (పరమాత్మకి మనకి మధ్య ఇంకోటి ఉండకూడదు, వ్యవధానం ఉండకూడదు. "అది కావాలి, ఇది కావాలి" అనే కోరిక ఉంటే, పరమాత్మకూ మనకూ మధ్య "కోరిక" అనే తెర ఉంటుంది). ఫలాపేక్షలేకుండ్దా, పరమాత్మకూ మనకూ మధ్య ఇంకోటి లేకుండా ఉండే భక్తే నిర్గుణమైన భక్తి.
సశేషం..
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Kapila Gita - 202 🌹
🍀 Conversation of Kapila and Devahuti 🍀
📚 Prasad Bharadwaj
🌴 5. Form of Bhakti - Glory of Time - 12 🌴
12. akṣaṇaṁ bhakti-yogasya nirguṇasya hy udāhṛtam
ahaituky avyavahitā yā bhaktiḥ puruṣottame
MEANING : The manifestation of unadulterated devotional service is exhibited when one's mind is at once attracted to hearing the transcendental name and qualities. Such a devotee will have exclusive devotion to Me with pure devotion. This is called 'Nirguna Bhakti Yoga'.
PURPORT : He has no desire to fulfill by rendering devotional service. Such devotional service is meant for the puruṣottama, the Supreme Personality, and not for anyone else. Sometimes pseudodevotees show devotion to many demigods, thinking the forms of the demigods to be the same as the Supreme Personality of Godhead's form. It is specifically mentioned herein, however, that bhakti, devotional service, is meant only for the Supreme Personality of Godhead, Nārāyaṇa, Viṣṇu, or Kṛṣṇa, not for anyone else. Avyavahitā means "without cessation." A pure devotee must engage in the service of the Lord twenty-four hours a day, without cessation; his life is so molded that at every minute and every second he engages in some sort of devotional service to the Supreme Personality of Godhead. Another meaning of the word avyavahitā is that the interest of the devotee and the interest of the Supreme Lord are on the same level. The devotee has no interest but to fulfill the transcendental desire of the Supreme Lord. Such spontaneous service unto the Supreme Lord is transcendental and is never contaminated by the material modes of nature. These are the symptoms of pure devotional service, which is free from all contamination of material nature.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment