శ్రీ మదగ్ని మహాపురాణము - 257 / Agni Maha Purana - 257
🌹. శ్రీ మదగ్ని మహాపురాణము - 257 / Agni Maha Purana - 257 🌹
✍️. పుల్లెల శ్రీరామచంద్రుడు, 📚. ప్రసాద్ భరద్వాజ
శ్రీ గణేశాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ.
ప్రథమ సంపుటము, అధ్యాయము - 75
🌻. శివ పూజాంగ హోమ విధి - 2 / Mode of installation of the fire (agni-sthāpana) - 2 🌻
సంహితామంత్రముచే అభిమంత్రతమై, ధేనుముద్రాప్రదర్శన పూర్వకముగ అమృతీకరణ క్రియచే సంస్కృతమై అస్త్రమంత్రముచే సురక్షితమై, కవచ మంత్రముచే అవగుంఠితమై, పూజింపబడిన అగ్నిని, అగ్నికుండముపై మూడు పర్యాయములు ప్రదక్షిణముగా త్రిప్పి, ''ఇది శివుని బీజము'' అని భావన చేసి, ''వాగీశ్వరదేవునిచే ఈ బీజమును వాగీశ్వరీ గర్భమునందు స్థాపింపడెను'' అని ధ్యానము చేసి, మంత్రసాధకుడు మోకాళ్లు భూమిపై ఆన్చి నమస్కారపూర్వకముగ ఆ అగ్నిని తన ఎదుట కుండమునందు స్థాపించవలెను.
పిమ్మట ఏ కుండమునందు బీజరూపాగ్ని ధ్యానము చేయబడినదో దాని వాభిదేశమునందు కుశలచే పరిసంవహానము చేయవలెను. పరిధాన- సంభారము, శుద్ధి, అచమనము. నమస్కారము చేసి గర్భాగ్నిని పూజించి, ఆగర్భజాగ్నిరక్షణముకొరకై అస్త్రమంత్రముచే, వాగీశ్వరీదేవి పాణిపల్లవమునందు కంకణము (రక్షౌసూత్రము) కట్టి నట్లు భావన చేయవలెను. సద్యోజాతమంత్రముతో, గర్భాదానముకొరకై, అగ్నిపూజనము చేసి, హృదయ మంత్రముతో మూడు ఆహుతులివ్వవలెను. మూడవమాసమున జరుగు పుంసవనసంస్కారమును భావన చేసి, అది సిద్ధించుటకై వామదేవమంత్రముతో అగ్నిని పూజించి "శిరసే స్వాహా" అని పలుకుచు, మూడు హోమములుచేయవలెను. పిమ్మట ఆ అగ్నిపై జలబిందువును చల్లవలెను.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Agni Maha Purana - 257 🌹
✍️ N. Gangadharan 📚. Prasad Bharadwaj
Chapter 75
🌻 Mode of installation of the fire (agni-sthāpana) - 2 🌻
9-10. Oṃ hūṃ (salutations) to god of fire. (The deity) should be established with the principal mantra of the fire. The fire which has been invoked with the vedic hymns and made immortal by showing the dhenumudrā (formation with the fingers representing a cow), and protected by mantras of weapons should be covered by the armour. It should be worshipped by waving over the pit thrice and circumambulation.
11. Having meditated upon (the fire) as an element of Lord Śiva, (the worshipper) should contemplate it as lying dormant in the womb of Goddess of speech and cast by the Lord of speech.
12. The worshipper should have his knees resting on the ground and put the fire in his front with the hṛd mantra. Then the seeds of fire in the vicinity should be gathered at the centre.
13. The collection of clothes, purification and offering of water for rinsing the mouth (should be done) with the hṛd (mantra). Having worshipped the dormant fire [i.e., garbha-agni], it should be protected by (the recitation of) the mantra of the shaft.
14. The embryo fire should be contemplated as tied around the wrist of the goddess as a bracelet. The fire should be worshipped with the sadyojāta (mantra) for the impregnation.
15. Three oblations to the fire should then be offered with (hṛdayamantra. For the puṃsavana (rite) (for the determination of the sex of the foetus) (generally performed) in the third month it should be worshipped on the left side.
16. Three oblations containing drops of water should be offered with the head. The sīmantonnayana (rite) (parting of the hair on the head) (performed) in the sixth month should be done after having worshipped the fire.
Continues....
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment