🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 130 / DAILY WISDOM - 130 🌹
🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 9. తత్వశాస్త్రానికి విజ్ఞాన శాస్త్రంతో వైరం లేదు. 🌻
తత్వశాస్త్రానికి విజ్ఞాన శాస్త్రంతో వైరం లేదు; విజ్ఞాన శాస్త్రం దాని స్వంత తీర్మానాలను బలోపేతం చేయడంలో అవసరమైనది మరియు ఉపయోగకరంగా ఉంటుందని ఇది తప్పక అంగీకరిస్తుంది. అయితే విజ్ఞాన శాస్త్రం భౌతిక విషయాలకు మాత్రమే పరిమితం అని ఖచ్చితంగా హెచ్చరిస్తుంది. మనము సైన్స్‌లోని భౌతిక, రసాయన మరియు జీవ చట్టాలను, తత్వశాస్త్రంలోని తార్కిక మరియు అధిభౌతిక సూత్రాలను మరియు ఉన్నత ఆధ్యాత్మికతలోని నైతిక మరియు ఆధ్యాత్మిక వాస్తవాలను అధ్యయనం చేస్తాము. ఇంద్రియాలు, హేతువు మరియు అంతర్దృష్టి మనముందున్న ప్రకృతిని అర్థం చేసుకోవడంలో మన జ్ఞాన మార్గాలు. విజ్ఞాన శాస్త్రం, తత్వ శాస్త్రం మరియు యోగ శాస్త్రం వాటి వాటి స్థానాల్లో సత్యమైనవి, ఉపయోగకరమైనవి మరియు జీవం యొక్క సమగ్ర జ్ఞానానికి ముఖ్యమార్గంగా ఉంటాయి.
అయితే, అంతర్దృష్టి హేతువు మరియు ఇంద్రియాలు దర్శించ గలిగినవన్నీ తెలుసుకోగలదు. అంతే కాకుండా వాటి సామర్థ్యాన్ని మించిన, కనీసం వాటి ఊహకు సైతం అందని విషయాలను సైతం ఇది సంగ్రహించుకొగలదు. స్వామి శివానంద యొక్క తత్వశాస్త్రం సత్యానికి పాక్షిక విధానం కాదు; ఇది భౌతిక, ఆధ్యాత్మిక మరియు యోగ శాస్త్రాలలో చెప్పబడిన సూత్రాల యొక్క సమగ్ర సమ్మేళనం. ఈ తత్వం విశ్వంలో సత్యమైన, మంచిదైన, సుందరమైన ప్రతి విషయాన్నీ తనలో ఇముడ్చుకుంటుంది.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 130 🌹
🍀 📖 The Philosophy of Life 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 9. Philosophy has No Quarrel with Science 🌻
Philosophy has no quarrel with science; it concedes that science is necessary and useful in reinforcing its own conclusions, but it strictly warns science that it is limited to physical phenomena. We study the physical, chemical and biological laws in science, the logical and metaphysical principles in philosophy and the moral and the spiritual verities in religion and higher mysticism. The senses, reason and intuition are our ways of knowledge in the progressive unfoldment of our nature. Science, philosophy and mysticism are true and useful in their own places and together constitute the highroad to a knowledge of life as a whole.
Intuition, however, has the special advantage of being able to unfold all that the senses and reason can, and, in addition, also that which these cannot hope to know with all their power. The philosophy of Swami Sivananda is not any partial approach to Truth; it is that grand integral method which combines in itself the principles and laws discovered and established by science, metaphysics and the higher religion and which embraces in its vast bosom whatever is true, good or beautiful in the universe.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment