🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 141 / DAILY WISDOM - 141 🌹
🍀 📖 . జీవితం యొక్క తత్వము నుండి 🍀
✍️. ప్రసాద్ భరద్వాజ
🌻 20. వేదాంతం పూర్తిగా ఆధ్యాత్మిక విధానాన్ని అనుసరిస్తుంది 🌻
ఋగ్వేదం మరియు పూర్వ ఉపనిషత్తులు పూర్తిగా అంతర్దృష్టి మార్గంలో ఉంటాయి. దార్శనికులు అపారమైన ఏకాగ్రతలో, ఆనందంలో, మనస్సుని ఉంచి, ధ్యానం ద్వారా సత్యం యొక్క మూలంలో ప్రవేశించి ప్రకృతి యొక్క ఏకత్వాన్ని వారిదైన శక్తివంతమైన శైలిలో, భాషలో ప్రకటించారు. న్యాయ, వైశేషిక, సాంఖ్య మరియు మీమాంస తత్వాలు అనుభవ విశ్లేషణ యొక్క పూర్తి వాస్తవిక పద్ధతిని బలపరిచాయి.
యోగవ్యవస్థ అంతర్గత క్రమశిక్షణ యొక్క మానసిక పద్ధతులను అనుసరించింది. వేదాంతం జీవితానికి పూర్తిగా ఆధ్యాత్మిక విధానాన్ని అనుసరించింది. ఖచ్చితమైన తార్కిక మరియు అనుభవ విశ్లేషణలు వేదాంత జీవన విధానానికి వెన్నెముకలు. కానీ, ఈ భారతీయ వ్యవస్థలన్నింటిలో కూడా తత్వశాస్త్రం అనేది ఒక ఆచరణాత్మక వ్యవహారం, ఒక ఉన్నత జీవన కళ, మోక్షం మరియు స్వేచ్చను పొందే మార్గం. సాధారణంగా తత్వశాస్త్రం యొక్క పద్ధతి భౌతిక శాస్త్రం చేసే విధంగా విషయాలను ముక్కలు ముక్కలుగా అధ్యయనం చేయడం కాదు. అన్ని విజ్ఞాన మార్గాల ద్వారా మనకు అందించబడిన అనుభవాన్ని సమగ్రంగా అధ్యయనం చేయడం.
కొనసాగుతుంది...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 DAILY WISDOM - 141 🌹
🍀 📖 The Philosophy of Life 🍀
📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj
🌻 20. The Vedanta Follows the Purely Spiritual Approach 🌻
The way of the Rigveda and the earlier Upanishads is purely intuitional. Seers entered into the heart of Reality in intense concentration of mind, in meditation, ecstasy, rapture and attunement, and proclaimed to the world in their simple language and powerful style that nature is, in truth, one. The Nyaya, Vaiseshika, Sankhya and Mimamsa philosophies bolstered up a thoroughly realistic method of the analysis of experience.
The Yoga system pursued the psychological techniques of inner discipline, while the Vedanta followed the purely spiritual approach to life, backing it up with a rigorous logical scrutiny and examination of experience. But, all these Indian systems have one thing in common: to them all, philosophy is an intensely practical affair, the art of wise living, the way of the attainment of salvation and freedom of the self. The method of philosophy in general is not to study things piecemeal, as physical science does, but to make a comprehensive study of the totality of experience provided to us through all avenues of knowledge.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment