✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. 11వ అధ్యాయము - విశ్వరూప సందర్శన యోగం - 47 🌴
47. శ్రీ భగవానువాచ
మయా ప్రసన్నేన తవార్జుననేదం రూపం పరం దర్శితమాత్మయోగాత్ |
తేజోమయం విశ్వమనన్తమాద్యం యన్మే త్వదన్యేన న దృష్టపూర్వమ్ ||
🌷. తాత్పర్యం : శ్రీకృష్ణభగవానుడు పలికెను : ఓ అర్జునా! ప్రసన్నుడైన నేను నా అంతరంగ శక్తిచే భౌతిక జగము నందలి ఈ దివ్యమగు విశ్వరూపమును నీకు చూపితిని. తేజోమయమును, అనంతమును, ఆద్యమును అగు ఈ రూపమును నీకు ముందెవ్వరును గాంచి యుండలేదు.
🌷. భాష్యము : అర్జునుడు శ్రీకృష్ణుని విశ్వరూపమును గాంచగోరెను. తన భక్తుడైన అర్జునుని యెడ కరుణను కలిగిన అ భగవానుడు అంతట తేజోమయమును, విభూతిపూర్ణమును అగు తన విశ్వరూపమును అతనికి చూపెను. సూర్యుని వలె ప్రకాశించుచున్న ఆ రూపము యొక్క పలుముఖములు త్వరితముగా మార్పుచెందుచుండెను. మిత్రుడైన అర్జునుని కోరికను పూర్ణము చేయుట కొరకే శ్రీకృష్ణుడు ఆ రూపమును చూపెను. తన అంతరంగశక్తి ద్వారా శ్రీకృష్ణుడు ప్రదర్శించిన ఆ విశ్వరూపము మానవ ఊహకు అతీతమైనది. అర్జునునికి పూర్వమెవ్వరును భగవానుని ఆ రూపమును గాంచియుండలేదు. కాని భక్తుడైన అర్జునునకు అది శ్రీకృష్ణునిచే చూపబడినందున ఊర్థ్వలోకులు మరియు ఆధ్యాత్మికలోకములందు గల ఇతర భక్తులు సైతము దానిని దర్శించగలిగిరి. వారు దానిని పూర్వమెన్నడును గాంచకున్నను అర్జునుని కారణమున ఇప్పుడు గాంచగలిగిరి. అనగా పరంపరానుగత భక్తులందరును కృష్ణుని కరుణచే అర్జునుడు గాంచిన విశ్వరూపమును తామును గాంచగలిగిరి.
దుర్యోధనునితో సంధిరాయబారము జరుపుటకు వెడలినప్పుడును శ్రీకృష్ణుడు ఈ విశ్వరూపమును అతనికి సైతము చూపెనని కొందరు వ్యాఖ్యానించిరి. దురదృష్టవశాత్తు దుర్యోధనుడు ఆ సంధి రాయబారమును అంగీకరించలేదు. ఆ సమయనున శ్రీకృష్ణుడు ఈ విశ్వరూపమును అతనికి సైతము చూపెనని కొందరు వ్యాఖ్యానించిరి. దురదృష్టవశాత్తు దుర్యోధనుడు ఆ సంధి రాయబారమును ఆంగీకరించలేదు. ఆ సమయమున శ్రీకృష్ణుడు విశ్వరూపములో కొన్ని రూపములానే ప్రదర్శించెను. కాని ఆ రూపములు అర్జునునకు చూపిన ఈ రూపము కన్నును భిన్నమైనవి. కనుకనే ఈ రూపమును పూర్వమెవ్వరును చూడలేదని స్పష్టముగా తెలుపబడినది.
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Bhagavad-Gita as It is - 461 🌹
✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj
🌴 Chapter 11 - Viswaroopa Sandarsana Yoga - 47 🌴
47. śrī-bhagavān uvāca
mayā prasannena tavārjunedaṁ rūpaṁ paraṁ darśitam ātma-yogāt
tejo-mayaṁ viśvam anantam ādyaṁ yan me tvad anyena na dṛṣṭa-pūrvam
🌷 Translation : The Supreme Personality of Godhead said: My dear Arjuna, happily have I shown you, by My internal potency, this supreme universal form within the material world. No one before you has ever seen this primal form, unlimited and full of glaring effulgence.
🌹 Purport : Arjuna wanted to see the universal form of the Supreme Lord, so Lord Kṛṣṇa, out of His mercy upon His devotee Arjuna, showed His universal form, full of effulgence and opulence. This form was glaring like the sun, and its many faces were rapidly changing. Kṛṣṇa showed this form just to satisfy the desire of His friend Arjuna. This form was manifested by Kṛṣṇa through His internal potency, which is inconceivable by human speculation. No one had seen this universal form of the Lord before Arjuna, but because the form was shown to Arjuna, other devotees in the heavenly planets and in other planets in outer space could also see it. They had not seen it before, but because of Arjuna they were also able to see it.
In other words, all the disciplic devotees of the Lord could see the universal form which was shown to Arjuna by the mercy of Kṛṣṇa. Someone has commented that this form was shown to Duryodhana also when Kṛṣṇa went to Duryodhana to negotiate for peace. Unfortunately, Duryodhana did not accept the peace offer, but at that time Kṛṣṇa manifested some of His universal forms. But those forms are different from this one shown to Arjuna. It is clearly said that no one had ever seen this form before.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment