శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 503- 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 503 - 3


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 503- 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 503 - 3 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 103. రక్తవర్ణా, మాంసనిష్ఠా, గుడాన్న ప్రీతమానసా ।
సమస్త భక్తసుఖదా, లాకిన్యంబా స్వరూపిణీ ॥ 103 ॥ 🍀

🌻 503. 'లాకిన్యంబా స్వరూపిణి' - 3 🌻


మహాత్ములకు దేహమున వసించుట బురదలో వసించుట వంటిది. వారందుండుటకు సందేహింపరు. కారణము వారికి లాకిణి అనుగ్రహ ముండుటయే. దైవభక్తులు ఎచ్చట నున్ననూ దైవము యందే యుందురు గనుక, వారికి దేహాభిమాన ముండదు గనుక దేహ సౌఖ్యమునకై ప్రాకులాడరు. సిద్ధులు, అవధూతలు మట్టిలో అన్నము వడ్డించిననూ భుజింతురు. శ్రీ రామ కృష్ణులు మురుగునీటిని అవపోసన పట్టుట, తాను వూరకుక్క కలిసి రొట్టెలు తినుటకు అమ్మ అనుగ్రహమే కారణము. అట్టి కోవలోని వారందరూ మాయను దాటినవారు. “లం” అను శబ్దము పృధివీ తత్త్వమును సంకేతించును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 503 - 3 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻103. Rakta-varna mansanishta gudanna pritamanasa
samsta bhakta sukhada lakinyanba svarupini ॥ 103 ॥ 🌻

🌻 503. lakinyanba svarupini - 3 🌻


For Mahatmas, living in the body is like living in mud. They don't hesitate to be there. The reason is that they have the grace of Lakini on them. Since God's devotees are always in God, they have no love of the flesh and do not strive for the comfort of the body. Siddhas and Avadhutas eat even the rice served in mud. Mother's grace was the reason why Sri Rama Krishna used to drink sewage water as avaposana and ate bread with the street dogs. All those in that path are beyond Maya. The word 'lam' signifies the earth principle.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment