శ్రీమద్భగవద్గీత - 478: 12వ అధ్., శ్లో 09 / Bhagavad-Gita - 478: Chap. 12, Ver. 09

 

🌹. శ్రీమద్భగవద్గీత - 478 / Bhagavad-Gita - 478 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -09 🌴

09. అథ చిత్తం సమాధాతుం న శక్నోషి మయి స్థిరమ్ |
అభ్యాసయోగేన తతో మమిచ్ఛాప్తుం ధనంజయ ||


🌷. తాత్పర్యం : ఓ అర్జునా! ధనంజయా! స్థిరముగా నా యందు మనస్సును లగ్నము చేయ నీవు సమర్థుడవు కానిచో, భక్తియోగమునందలి విధివిధానములను అనుసరింపుము. ఆ రీతిని నన్ను పొందు కోరికను వృద్ధి చేసికొనుము.

🌷. భాష్యము : ఈ శ్లోకమున రెండు విధములైన భక్తియోగావిదానములు తెలుపబడినవి. అందు మొదటిది దివ్యప్రేమ ద్వారా దేవదేవుడైన శ్రీకృష్ణుని యెడ అనురాగమును వాస్తవముగా వృద్దిచేసికొనినవారికి సంబంధించినది. దివ్యప్రేమ ద్వారా పరమపురుషుని యెడ అనురాగమును పెంపొందించుకొనినవారికి రెండవ పధ్ధతి పేర్కొనబడినది. ఈ రెండవ తరగతికి పలు విధివిధానములు నిర్దేశింప బడియున్నవి. శ్రీకృష్ణుని యెడ అనురాగాము కలిగిన స్థితికి మనుజుడు అంత్యమున ఉద్ధరింపబడుటకు వాటిని అనుసరింపవచ్చును. భక్తియోగమనగా ఇంద్రియముల పవిత్రీకరణమని భావము. ప్రస్తుతము భౌతికస్థితిలో ఇంద్రియములు భోగతరములై యున్నందున అపవిత్రములై యుండును. కాని భక్తియోగాభ్యాసముచే ఇంద్రియములు పవిత్రములు కాగలవు.

పవిత్రస్థితిలో అవి శ్రీకృష్ణభగవానునితో ప్రత్యక్ష సంబంధమునకు రాగలవు. ఈ జగమున నేను ఒక యజమాని సేవలో నిలిచినప్పుడు, నిజముగా ప్రేమతో అతనిని సేవింపను. కేవలము కొంత ధనమును పొందుటకే సేవను గూర్తును. అదేవిధముగా యజమాని సైతము ప్రేమను కలిగియుండడు. నా నుండి సేవను గ్రహించి, నాకు ధనమొసగుచుండును. కనుక ఇచ్చట ప్రేమ అనెడి ప్రశ్నయే ఉదయింపదు. కాని ఆధ్యాత్మికజీవితమున శుద్ధమగు ప్రేమస్థాయికి ప్రతియొక్కరు ఎదుగవలసినదే. ప్రస్తుత ఇంద్రియములచే నిర్వహింపబడెడి భక్తియోగాభ్యాసము చేతనే అట్టి ప్రేమస్థాయి ప్రాప్తించగలదు.

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Bhagavad-Gita as It is - 478 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 12 - Devotional Service - 09 🌴

09. atha cittaṁ samādhātuṁ na śaknoṣi mayi sthiram
abhyāsa-yogena tato mām icchāptuṁ dhanañ-jaya

🌷 Translation : My dear Arjuna, O winner of wealth, if you cannot fix your mind upon Me without deviation, then follow the regulative principles of bhakti-yoga. In this way develop a desire to attain Me.


🌹 Purport : In this verse, two different processes of bhakti-yoga are indicated. The first applies to one who has actually developed an attachment for Kṛṣṇa, the Supreme Personality of Godhead, by transcendental love. And the other is for one who has not developed an attachment for the Supreme Person by transcendental love. For this second class there are different prescribed rules and regulations one can follow to be ultimately elevated to the stage of attachment to Kṛṣṇa. Bhakti-yoga is the purification of the senses. At the present moment in material existence the senses are always impure, being engaged in sense gratification. But by the practice of bhakti-yoga these senses can become purified, and in the purified state they come directly in contact with the Supreme Lord.

In this material existence, I may be engaged in some service to some master, but I don’t really lovingly serve my master. I simply serve to get some money. And the master also is not in love; he takes service from me and pays me. So there is no question of love. But for spiritual life, one must be elevated to the pure stage of love. That stage of love can be achieved by practice of devotional service, performed with the present senses. This love of God is now in a dormant state in everyone’s heart. And, there, love of God is manifested in different ways, but it is contaminated by material association. Now the heart has to be purified of the material association, and that dormant, natural love for Kṛṣṇa has to be revived. That is the whole process.

🌹 🌹 🌹 🌹 🌹



No comments:

Post a Comment