శ్రీ శివ మహా పురాణము - 833 / Sri Siva Maha Purana - 833

🌹 . శ్రీ శివ మహా పురాణము - 833 / Sri Siva Maha Purana - 833 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 28 🌴

🌻. శంఖచూడుని వివాహము - 4 🌻

తులసి ఇట్లు పలికెను - సాత్త్వికమనో భావములు గల నీచే నేను ఈ నాడు జయింపబడితిని. ఏ పురుషుడు ఈ లోకములో స్త్రీచే జయింపబడడో, వాడే ధన్యుడు (26). ఏ పురుషుడు స్త్రీచే జయింపబడునో వాడు పవిత్రమగు కర్మలను చేయు వాడే అయిననూ సర్వదా శౌచవిహీనుడే. పితృదేవతలు, దేవతలు, మరియు సర్వమానవులు అట్టి వానిని నిందించెదరు (27). జాతశౌచ మృతాశౌచ ములలో బ్రాహ్మణుడు పది, క్షత్రియుడు పన్నెండు, వైశ్యుడు పదిహేను, శూద్రుడు ముప్పది రోజులలో శుద్ధిని పొందునని వేదము ఉపదేశించుచున్నది. కాని స్త్రీచే జయింపబడిన పురుషుడు చితిపై దహించుటచే తప్ప ఎక్కడైననూ శుద్ధిని పొందడు (28, 29). కావున అట్టి వాడు సమర్పించిన పిండమును, తర్పణములను పితృదేవతలు ఆనందముతో స్వీకరించరు. ఆతడు సమర్పించిన పుష్పఫలాదులను దేవతలు స్వీకరించరు (30). ఎవని మనస్సు స్త్రీలచే అపహరింపబడినదో, వానికి జ్ఞానము, మంచి తపస్సు, జపము, హోమము, పూజ విద్య, దానము అను వాటితో ఏమి ప్రయోజనము గలదు? (31) నీవిద్యను, ప్రభావమును, జ్ఞానమును తెలియుటకై నేను పరీక్ష చేసితిని. స్త్రీ వరుని పరీక్షించిన తరువాతనే భర్తగా వరించవలెను గదా! (32).

సనత్కుమారుడిట్లు పలికెను- తులసి ఇట్లు మాటలాడు చుండగా, అదే క్షణములో సృష్టికర్తయగు బ్రహ్మ అచటకు విచ్చేసెను. అపుడాయన ఇట్లు పలికెను (33).

బ్రహ్మ ఇట్లు పలికెను - ఓ శంఖచూడా! ఈ మెతో నీవేమి సంభాషణను చేయుచున్నావు? ఈమెను నీవు గాంధర్వవిధిచే వివాహమాడుము (34). నీవు పురుషులలో శ్రేష్ఠుడవు. ఈ పతివ్రత స్త్రీలలో శ్రేష్ఠురాలు. జ్ఞానవంతురాలగు ఈమెకు జ్ఞానివగు నీతో వివాహము గొప్ప గుణకారి కాగలదు (35). విరోధము లేనిది, దుర్లభ##మైనది అగు సుఖమును ఎవడు విడిచిపెట్టును? ఓ రాజా! విరోధములేని సుఖమును పరిత్యజించు వ్యక్తి పశుప్రాయుడనుటలో సందేహము లేదు (36). ఓ పుణ్యాత్మురాలా! గుణవంతుడు, దేవతలను, అసురులను దానవులను శిక్షించువాడు అగు ఇట్టి సుందరుని నీవు ఏమి పరీక్ష చేయు చున్నావు? (37) నీవీతనితో గూడి చిరకాలము అన్ని వేళలలో సర్వలోకములయందలి ప్రదేశము లన్నింటిలో యథేచ్ఛగా విహరించుము. ఓ సుందరీ! (38) ఆతడు మరణించిన తరువాత గోలోకములో మరల శ్రీకృష్ణుని పొందగలడు. ఆతడు మరణించిన పిదప నీవు వైకుంఠములో చతుర్భుజుడగు విష్ణువును పొందగలవు (39).

సనత్కుమారుడిట్లు పలికెను- బ్రహ్మ ఈ విధముగా ఆశీర్వదించి తన ధామమునకు వెళ్లెను. ఆ శంఖచూడుడు ఆమెను గాంధర్వవిధితో వివాహమాడెను (40). ఆతడు ఈ తీరున తులసిని వివాహమాడి తండ్రి గృహమునకు వెళ్లి మనోహరమగు ఆ నివాసములో ఆ సుందరితో గూడి రమించెను (41).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శంఖచూడ వివాహవర్ణనమనే ఇరువది ఎనిమిదవ అధ్యాయము ముగిసినది (28).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 833 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (4): Yuddha-khaṇḍa - CHAPTER 28 🌴

🌻 The penance and marriage of Śaṅkhacūḍa - 4 🌻


Tulasī said:—

26. I have now been overpowered by you who have Sāttvika thoughts. That man is blessed in the world who is not overwhelmed by a woman.

27. Even though he may be the observer of sacred rites, if he is overpowered by a woman he becomes impure and unclean, so he remains for ever. The manes, gods and human beings censure him.

28-29. A brahmin is purified from impurity arising from births or deaths in the family, after the tenth day. A Kṣatriya in twelve days, a Vaiśya in fifteen days and a Śūdra in a month. This is what the Vedas enjoin. But a henpecked man can never be purified till death.

30. The manes do not receive willingly the balls of rice or holy waters offered by him. Nor do the gods accept his offering of fruits and flowers.

31. Of what avail are words of wisdom, penance, Japas, Homas, worships, learning or charitable gifts to that wretch whose mind is deadened by his thoughts of women?

32. You have been tested by me in order to know your knowledge and power. A woman must test her bridegroom before wooing him.


Sanatkumāra said:—

33. Even as Tulasī was saying so, Brahmā the creator came there and spoke these words.



Continues....

🌹🌹🌹🌹🌹



No comments:

Post a Comment