🌹 01, FEBRUARY 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹

🍀🌹 01, FEBRUARY 2024 THURSDAY ALL MESSAGES గురువారం, బృహస్పతి వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 01, FEBRUARY 2024 THURSDAY గురువారం, బృహస్పతి వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 495 / Bhagavad-Gita - 495 🌹
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -26 / Chapter 12 - Devotional Service - 26 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 850 / Sri Siva Maha Purana - 850 🌹
🌻.బ్రహ్మవిష్ణువులకు శివుని ఉపదేశము - 5 / Śiva’s advice to Viṣṇu and Brahmā - 5 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 108 / Osho Daily Meditations  - 108 🌹
🍀 108. గజిబిజి తల / 108. MUDDLE-HEADED 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 530 / Sri Lalitha Chaitanya Vijnanam - 530 🌹 
🌻 530. 'సర్వవర్ణ ఉపశోభితా'  / 530. 'Sarvavarna Upasobhita' 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 01, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹*
*శుభ గురువారం, బృహస్పతి వాసరే, Thursday*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ దత్తాత్రేయ సహస్రనామ స్తోత్రం - 73 🍀*

*73. అతీతకాలచక్రశ్చ తామసః కాలదండవాన్ |*
*విష్ణుచక్రః త్రిశూలేంద్రో బ్రహ్మదండో విరుద్ధకః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : చేతనాభూమికల పరస్పర సంబంధం : వివిధ చేతనా భూమికల మధ్య ఏ అఖాతములూ లేవు. అవి అన్నీ ఒక దానితో నొకటి సంబంధం కలిగివున్నవే. సోపాన పంక్తి వలె వాటిపైకి ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ పోవచ్చును. మానవ మనస్సుకూ, ఆధిమనస్సుకూ నడుమ అధికాధిక తేజోవంతములైన భూమికా విశేషములు అనేక మున్నవి. అట్టడుగున ఉన్న ఒకటి రెండు తప్ప తక్కినవన్నీ మానవ మనస్సునకు సామాన్యముగ అందరానివే. 🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పుష్య మాసము
తిథి: కృష్ణ షష్టి 14:05:23 వరకు
తదుపరి కృష్ణ సప్తమి
నక్షత్రం: చిత్ర 27:50:44
వరకు తదుపరి స్వాతి
యోగం: ధృతి 12:28:42
వరకు తదుపరి శూల
కరణం: వణిజ 14:01:24 వరకు
వర్జ్యం: 10:02:40 - 11:49:24
దుర్ముహూర్తం: 10:35:44 - 11:21:16
మరియు 15:08:55 - 15:54:27
రాహు కాలం: 13:54:56 - 15:20:18
గుళిక కాలం: 09:38:50 - 11:04:12
యమ గండం: 06:48:06 - 08:13:28
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51
అమృత కాలం: 20:43:04 - 22:29:48
సూర్యోదయం: 06:48:06
సూర్యాస్తమయం: 18:11:02
చంద్రోదయం: 23:31:02
చంద్రాస్తమయం: 10:42:24
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: కన్య
యోగాలు: చర యోగం - దుర్వార్త
శ్రవణం 27:50:44 వరకు తదుపరి
స్థిర యోగం - శుభాశుభ మిశ్రమ ఫలం
దిశ శూల: దక్షిణం
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశివ నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 495 / Bhagavad-Gita - 495 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 06 🌴*

*06. మహాభూతన్యహంకారో బుద్ధిరవ్యక్తమేవ చ |*
*ఇన్ద్రియాణి దశైకం చ పంచ చేన్ద్రియగోచరా: ||*

*🌷. తాత్పర్యం : పంచ మహాభూతములు, మిథ్యాహంకారము, బుద్ధి, అవ్యక్తము, దశేంద్రియములు, మనస్సు, ఐదు ఇంద్రియార్థములు..*

*🌷. భాష్యము : మహాఋషులు ప్రామాణిక వచనములైనట్టి వేదమంత్రములు మరియు వేదాంతసూత్రముల ననుసరించి విశ్వము యొక్క మూలాంశములను ఈ క్రింది విధముగా అవగాహననము చేసికొనవచ్చును.*

*తొలుత పృథివి, జలము, అగ్ని, వాయువు, ఆకాశామును పంచమహాభూతములు, తరువాత మిథ్యాహంకారము, బుద్ధి, ప్రకృతిజన్య త్రిగుణముల అవ్యక్తస్థితి, ఆ తరువాత త్వక్, చక్షు, శోత్ర, జిహ్వ, ఘ్రాణములనెడి పంద జ్ఞానేంద్రియములు, ఆ పిదప వాక్కు, పాదములు, హస్తములు, గుదము, జననేంద్రియములనెడి పంచ కర్మేంద్రియములు, ఆ ఇంద్రియములపై మనస్సు గలవు. ఈ మనస్సు అంతరమందుండుటచే అతరేంద్రియముగా పిలువబడును. కావున ఈ మనస్సుతో కలిపి మొత్తము పదుకొండు ఇంద్రియములు గలవు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 495 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 06 🌴*

*06. mahā-bhūtāny ahaṅkāro buddhir avyaktam eva ca*
*indriyāṇi daśaikaṁ ca pañca cendriya-gocarāḥ*

*🌷 Translation : The five great elements, false ego, intelligence, the unmanifested, the ten senses and the mind, the five sense objects.,*

*🌹 Purport : From all the authoritative statements of the great sages, the Vedic hymns and the aphorisms of the Vedānta-sūtra, the components of this world can be understood as follows. First there are earth, water, fire, air and ether. These are the five great elements (mahā-bhūta). Then there are false ego, intelligence and the unmanifested stage of the three modes of nature. Then there are five senses for acquiring knowledge: the eyes, ears, nose, tongue and skin. Then five working senses: voice, legs, hands, anus and genitals. Then, above the senses, there is the mind, which is within and which can be called the sense within.*

*Therefore, including the mind, there are eleven senses altogether. Then there are the five objects of the senses: smell, taste, form, touch and sound. Now the aggregate of these twenty-four elements is called the field of activity. If one makes an analytical study of these twenty-four subjects, then he can very well understand the field of activity.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 850 / Sri Siva Maha Purana - 850 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 31 🌴*

*🌻. బ్రహ్మవిష్ణువులకు శివుని ఉపదేశము - 5 🌻*

*శివుడిట్లు పలికెను- ఓ హరీ! ఓ బ్రహ్మా! నా ఈ మాటను ప్రీతితో వినుడు. కుమారులారా! మీరు వెంటనే దేవతలను దోడ్కొని నిర్భయముగా కైలాసవాసియగు రుద్రునివద్దకు వెళ్లుడు. ఉత్తమమగు నాపూర్ణరూపమే రుద్రుడు. నేను దేవకార్యము కొరకై రెండవ ఆకారమును దాల్చి ఉద్భవించినాను (38, 39). ఓ హరీ! నా అవతారము. పరిపూర్ణుడు, సర్వసమర్థుడు అగు రుద్రుడు భక్తులకు సులభుడై వారి కొరకై కైలాసపర్వతమునందు స్థిరుడై ఉన్నాడు (40). నీకు నాకు భేదము లేదు. మీరిద్దరు ఆ రుద్రుని సేవించదగుదురు. దేవతలు మొదలగు స్థావరజంగమాత్మకముగ సర్వప్రాణులు ఆయనను సేవింతురు (41). మన ఇద్దరిలో భేదమును కల్పించు వ్యక్తి ఇహలోకములో పుత్రులచే, పౌత్రులచే నిరాకరింపబడినవాడై కష్టముల ననుభవించి, పిదప నరకమును పొందును (42).*

*ఈ విధముగా పలికిన దుర్గాపతియగు శివుని రాధాసమేతుడైన శ్రీకృష్ణుడు పలుమార్లు ప్రణమిల్లి తన అనుచరులతో గూడి తన స్థానమునకు వెళ్లెను (43). ఓ వ్యాసా! బ్రహ్మవిష్ణువులు కూడ భయరహితులై ఆనందముతో ఈశ్వరునకు పలుమార్లు ప్రణమిల్లి వెంటనే వైకుంఠమునకు వెళ్లిరి (44). ఆ బ్రహ్మ విష్ణువులు అచటకు చేరి దేవతలకు వృత్తాంతమునంతను వివరించి వారిని దోడ్కొని కైలసపర్వతమునకు వెళ్లిరి (45). అచట పార్వతీ వల్లభుడు, దీనుల రక్షణ కొరకై దేహమును స్వీకరించినవాడు, సగుణుడు, దేవదేవుడు అగు మహేశ్వర ప్రభుని గాంచి (46). పూర్వమునుందు వలెనే వారందరు వినయముతో గూడిన వారై తలలు వంచి చేతులు జోడించి భక్తితో బొంగురుపోయిన కంఠములతో స్తుతించిరి (47).

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 850 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 31 🌴*

*🌻 Śiva’s advice to Viṣṇu and Brahmā - 5 🌻*


Śiva said:—
38. “O Viṣṇu, O Brahmā, lovingly listen to my words. O dear ones, go quickly for the pleasure of the gods. Be fearless.

39. Go to Rudra, resident of Kailāsa,[2] who has my excellent and perfect form. He has manifested himself for the task of the gods with a separate form and features.

40. O Viṣṇu, it is for this purpose that the lord assuming my form fully and perfectly stays on the mountain Kailāsa favouring the devotees by being subservient to them.

41. There is no difference in him from us both. He shall be served by you two and all living beings—mobile and immobile as well as the gods and others always.

42. He who differentiates between us falls into hell. In this life too he will attain stress and be devoid of sons and grandsons.

Sanatkumāra said:—
43. After bowing again and again to the lord of Pārvatī who had spoken thus, Kṛṣṇa returned to his abode accompanied by Rādhā.

44. O Vyāsa, Viṣṇu and Brahmā became delighted and relieved of fear. After bowing again and again to Śiva they hastened to Vaikuṇṭha.

45. Having come there and mentioning everything to the gods, Brahmā and Viṣṇu went to Kailāsa taking the gods with them.

46-47. On seeing lord Śiva there, the lord and husband of Pārvatī, who had taken a body for protecting the distressed, the lord of the gods possessed of attributes, they eulogised him as before with devotion and choking words. They joined their palms in reverence humbly and with drooping shoulders.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹


*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 108 / Osho Daily Meditations  - 108 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 108. గజిబిజి తల 🍀*

*🕉  లావోట్జు ఇలా అంటాడు: నేను అయోమయం మనిషిని. అందరూ స్పష్టంగా ఉన్నప్పుడు, నేను మాత్రమే అస్పష్టంగా ఉంటాను; అందరూ మేధావులుగా అనిపించినప్పుడు, నేను మూర్ఖుడిని. 🕉*
  
*లావోట్జు ఉద్దేశ్యం ఏమిటంటే, అతను తన జీవితం గురించి లెక్కలెయ్యడు. జీవిస్తాడు. ఏ జంతువులాగానో, ఏ చెట్టులాగానో, ఏ పక్షిలాగానో జీవిస్తాడు. అతను అది ఏమిటో మరియు ఎక్కడికి దారితీస్తుందో అని లెక్కలెయ్యకుండా సరళంగా జీవిస్తాడు. ఎక్కడైనా మంచిదే; ఎక్కడా కాకపోయినా మంచిదే. నీ మనసును పక్కన పెట్టు. ఇది కష్టం, కానీ సాధ్యమే. ఆధునిక మనస్సుకు ఇది కీలకమైన సమస్యలలో ఒకటి - తెలివిని పక్కన పెట్టడం. మీరు కొంచెం విశృంఖలంగా ఉండాలి. అది మీకు గొప్ప అమాయకత్వాన్ని తెస్తుంది; అది మిమ్మల్ని గొప్ప ప్రేమలోకి దూకడానికి సిద్ధం చేస్తుంది.*

*ఇది ప్రత్యేకంగా ఎవరి మీదా ఉండవలసిన అవసరం లేదు, కేవలం జీవితం పట్ల, ఉనికి పట్ల లేదా ఒక మనిషి పట్లా ఉద్వేగభరితమైన ప్రేమగా ఉండాలి. ఇది చిత్రలేఖనం, కవిత్వం, నృత్యం, సంగీతం, నాటకం, ఏదైనా కావచ్చు--కానీ మీ జీవితమంతా గొప్ప, ఉద్వేగభరితమైన ప్రేమగా మారుతుంది, దీనిలో మీరు ఏమీ మిగలకుండా పూర్తిగా నిమగ్నమైపోతారు: కాబట్టి మీరూ మీ ప్రేమ ఒకటి అవుతుంది. అది మీకు పరివర్తన అవుతుంది. భయం ఉంది, కానీ భయాన్ని ఎంచుకోవద్దు. భయాన్ని ఎంచుకునే వారు తమను తాము నాశనం చేసుకుంటారు. భయం ఉండనివ్వండి; అయినప్పటికీ, ప్రేమలోకి వెళ్లండి.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 108 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 108. MUDDLE-HEADED 🍀*

*🕉  Lao Tzu says: I am a muddle-headed man. When everybody is clear, only I am unclear; when everybody seems to be intelligent, I am stupid.  🕉*

*What Lao Tzu means is that he does not calculate about his life--he lives it. He lives like any animal, like any tree, like any bird. He lives it simply, without figuring out what it is and where it is leading. Anywhere is good; even nowhere is good. Put your mind aside. It will be difficult, but it can be done. This is one of the crucial problems for the modern mind--putting cleverness aside. You need to be a little more wild. That will bring great innocence to you; that will make you ready to jump into a great love.*

*It need not be with anybody in particular, but it should be just a passionate love-for life, for existence, or for any human being. It could be for painting, poetry, dance, music, drama, anything--but a great, passionate love that becomes your whole life, in which you are so totally absorbed that nothing is left outside: so you and your love become one. That will be the transformation for you.  Fear is there, but don't choose fear. Those who choose fear destroy themselves. Let the fear be there; in spite of it, go into love.* 

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 530 / Sri Lalitha Chaitanya Vijnanam  - 530 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।*
*సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥ 🍀*

*🌻 530. 'సర్వవర్ణ ఉపశోభితా'  🌻*

*అన్ని వర్ణములతో ప్రకాశించునది శ్రీమాత. సమస్తమగు శబ్దము లిచ్చట సహస్రము నుండియే పుట్టును. సహస్రము సమస్తమగు రంగులకు కూడ మూల స్థానము. అక్షరములకు మూలస్థానము కూడ నిదియే. కావున సర్వ వర్ణములతో శోభించు పద్మము అందురు. వర్ణములనగా శబ్దములని, రంగులని, అక్షరములని తెలుపబడినది. అకారాది క్షకారాంతములైన అక్షరములకు ఉత్పత్తి స్థానమిది.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 530 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 Sahasradala padmasdha sarva varnopa shobhita*
*sarvayudha dhara shukla sansdhita sarvatomukhi  ॥109 ॥ 🌻*

*🌻 530. 'Sarvavarna Upasobhita' 🌻*

*Shrimata shines with all colors. The word ALL here originates from Sahasra or Thousand. Sahasra is also the source for all colors. It is also the source for letters or alphabets. Therefore, the lotus, which is adorned with all colors. Words, colors and letters are expressed as colors. This is the originator for all letters from A (first letter) to Ksha (last letter).*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3

No comments:

Post a Comment