శ్రీ శివ మహా పురాణము - 853 / Sri Siva Maha Purana - 853


🌹 . శ్రీ శివ మహా పురాణము - 853 / Sri Siva Maha Purana - 853 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 32 🌴

🌻. పుష్పదంతుడు శంఖచూడునకు నచ్చజెప్పుట - 2 🌻



పుష్పదంతుడిట్లు పలికెను- ఓ మహారాజా! నేను శివుని దూతను. పుష్పదంతుడు నా పేరు. ఓ ప్రభూ! శంకరుని సందేహమును నీకు చెప్పెదను. దానిని వినుము (10).

శివుడిట్లు పలికెను- వెంటనే దేవతలకు రాజ్యమును, అధికారమును అప్పజెప్పుము. లేనిచో సత్పురుషులకు పరమగమ్యమగు నాతో యుద్ధమును చేయుము (11). సత్పురుషులకు మంగళమును ఇచ్చు దేవదేవుడనగు నన్ను శరణు పొందినారు. మహారుద్రుడనగు నేను కోపించియున్నాను. నిన్ను నిస్సంశయముగా వధించగలను (12). సంహారకరుడను, దుష్టులను శిక్షించువాడను, శరణాగతవత్సలుడను అగు నేను దేవతలందరికీ అభయమునిచ్చి యున్నాను (13). రాజ్యమునప్ప జెప్పెదవా? లేక, యుద్ధమును చేసెదవా! ఓ రాక్షసేంద్రా! నీవు ఆలోచించి ఈ రెండింటిలో ఒక మార్గము నెన్నుకొని యథార్థమగు ప్రతివచనము నిమ్ము (14).

పుష్పదంతుడిట్లు పలికెను- మహేశుడు చెప్పిన సందేశమును నేను నీకు విన్నవించితిని. ఓ రాక్షసరాజా! శంభుని వాక్యము ఎన్నటికీ పొల్లు పోదు (15). నేను నా ప్రభువగు హరుని వద్దకు శీఘ్రముగా చేరవలెనని ఆకాంక్షించుచున్నాను. నేను అచటకు వెళ్లి శంభునకు ఏమని చెప్పవలెను? నీ సమాధానమును ఇప్పుడు చెప్పుము (16).

సనత్కుమారుడిట్లు పలికెను - సత్పురుషులకు ప్రభువగు శివుని దాతయైన పుష్పదంతుని ఈ వచనములను విని ఆ రాజు నవ్వి ఆతనితో నిట్లనెను (17).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 853 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 32 🌴

🌻 The Emissary is sent - 2 🌻



Puṣpadanta said:—

10. O great king, O lord, I am the Emissary of Śiva named Puṣpadanta. Please listen to what is mentioned by Śiva himself. I am telling you the same.


Śiva said:—

11. Now, give back their kingdom to the gods and their authority. If not, fight with me, the greatest of the good warriors.

12. The gods have sought refuge in me, the lord of the gods and the benefactor of the good. I the infuriated will certainly slay you.

13. I am Śiva, the destroyer. I have granted protection to all the gods. I am the holder of the chastising rod for the wicked and favourably disposed to those who seek refuge in me.

14. O lord of Dānavas, consider and let me know one of the two alternatives specifically, whether you will return the kingdom or fight.


Puṣpadanta said:

15. O lord of Dānavas, what has been stated by Śiva has been conveyed to you. Śiva’s words have never gone in vain.

16. I wish to return to my lord Śiva immediately. After going back what shall I tell Śiva, you clearly let me know.


Sanatkumāra said:—

17. On hearing these words of Puṣpadanta who was the emissary of lord Śiva, the king laughed, then spoke to him.



Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment