DAILY WISDOM - 206 : 24. The Absolute is All-pervading / నిత్య ప్రజ్ఞా సందేశములు - 206 : 24. సంపూర్ణత సర్వవ్యాప్తమైనది


🌹. నిత్య ప్రజ్ఞా సందేశములు - 206 / DAILY WISDOM - 206 🌹

🍀 📖 మహాభారతం మరియు భగవద్గీత యొక్క ఆధ్యాత్మిక అంశాలు 🍀

✍️. ప్రసాద్ భరద్వాజ

🌻 24. సంపూర్ణత సర్వవ్యాప్తమైనది 🌻

భగవంతుడు విశ్వంలోని ప్రతి మూలలో వ్యాపించి ఉన్నాడు. విశ్వం లోని ప్రతి కణం పరమాత్మతో నిండి ఉంది. సృష్టిలోని ప్రతి అంశంలో పరమాత్మే నిండి యున్నాడు అనే స్పృహే అంతిమ విశ్వ ధర్మం. అదే సృష్టి మూలం. అందులో నుండే ప్రతి ఇతర ధర్మం ఉద్భవించింది.

రాజకీయ చట్టాలు, సామాజిక చట్టాలు, కుటుంబ చట్టాలు, వ్యక్తిగత చట్టాలు, భౌతిక చట్టాలు, మానసిక చట్టాలు -ఇవన్నీ కూడా సృష్టి మొత్తం ఒకే చైతన్యంతో నిండి ఉంది అనే ఒక ప్రాథమిక ధర్మం యొక్క దేశ కాల పరిస్థితుల అనుగుణంగా ఉన్న వ్యక్తీకరణలు. దేవుని ఉనికి ఇక్కడ ఒక వ్యక్తీకరించ బడని అదృశ్య ఉనికిగా నిర్వచించ బడింది. దాన్నే అవ్యక్త మూర్తినా అంటారు. ఇది స్థూల, కనిపించే, ఇంద్రియ ఉనికి కాదు.


కొనసాగుతుంది...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 DAILY WISDOM - 206 🌹

🍀 📖 The Spiritual Import of the Mahabharata and the Bhagavadgita 🍀

📝 Swami Krishnananda
📚. Prasad Bharadwaj

🌻 24. The Absolute is All-pervading 🌻


The Absolute Almighty pervades every nook and corner of the universe. Every nook and cranny is permeated by the presence of the Supreme Being. The consciousness of the presence of the Almighty inseparably in every little thing in the whole of creation is the ultimate constitutional dharma. It is the central constitution of the cosmos, and all local and provincial laws follow from it.

Political laws, social laws, family laws, personal laws, physical laws, psychological laws, and what not—all these are expressions according to the requirement of the particular state of affairs of that eternal deciding factor which is the presence of one common Being everywhere, equally, unanimously, perpetually in everything. The presence of God is defined here as an invisible presence, an unmanifested existence—avyakta-murtina. It is not a gross, visible, sensory presence.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment