🌹 03, FEBRUARY 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹

🍀🌹 03, FEBRUARY 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు 🌹🍀
1) 🌹 03, FEBRUARY 2024 SATURDAY శనివారం, స్థిర వాసరే, నిత్య పంచాంగము Daily Panchangam🌹
2) 🌹. శ్రీమద్భగవద్గీత - 496 / Bhagavad-Gita - 496 🌹
🌴. 12వ అధ్యాయము -భక్తియోగము -27 / Chapter 12 - Devotional Service - 27 🌴
🌹. శ్రీ శివ మహా పురాణము - 851 / Sri Siva Maha Purana - 851 🌹
🌻.బ్రహ్మవిష్ణువులకు శివుని ఉపదేశము - 6 / Śiva’s advice to Viṣṇu and Brahmā - 6 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 109 / Osho Daily Meditations  - 109 🌹
🍀 109. పరిమితి వలయం / 109. CIRCLE OF LIMITATION 🍀
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 531 / Sri Lalitha Chaitanya Vijnanam - 531 🌹 
🌻 531. 'సర్వాయుధ ధరా’  / 531. 'Sarvayudha Dhara' 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 03, ఫిబ్రవరి, FEBRUARY 2024 పంచాంగము - Panchangam 🌹*
*శుభ శనివారం, Saturday, స్థిర వాసరే*
*మనందరికి ఈ రోజు కాలము, ప్రకృతి అనుకూలించాలి అని పరమాత్మని స్మరిస్తూ - ప్రసాద్ భరద్వాజ*

*🌻. పండుగలు మరియు పర్వదినాలు : లేవు 🌻*

*🍀. శ్రీ వేంకటేశ సహస్రనామ స్తోత్రం - 57 🍀*
 
*57. వరుణాభ్యర్చితో గోపీప్రార్థితః పురుషోత్తమః |*
*అక్రూరస్తుతి సంప్రీతః కుబ్జా యౌవన దాయకః*

🌻 🌻 🌻 🌻 🌻

*🍀. నేటి సూక్తి : పురుషుని యందలి విభాగ వ్యవస్థ : ఈ వ్యవస్థ రెండు విధములుగా ఉన్నది. రెండూ ఏకకాలంలో ప్రవరిల్లుతూ వున్నవే. ఒకటి, హృత్పురుషుడు కేంద్రముగా వివిధ కోశముల రూపమున ఏర్పాటైన వ్యవస్థ. మరియొకటి, సోపానపంక్తి వలె ఎక్కుటకు, దిగుటకు, ఒకదానిపై నొకటిగ వివిధ భూమికల రూపమున ఏర్పాటైన వ్యవస్థ. ఈ సోపాన పంక్తిలో విజ్ఞాన మయ, అధిమనోమయ భూమికలు మానవత్వము నుండి దివ్యత్వానికి పరివర్తనము నొందించుటలో ముఖ్యపాత్ర వహిస్తున్నవి.🍀*

🌷🌷🌷🌷🌷

విక్రమ: 2080 నల, శఖ: 1945 శోభన
కలియుగాబ్ది : 5124, శోభకృత్‌,
హేమంత ఋతువు, ఉత్తరాయణం,
పుష్య మాసము
తిథి: కృష్ణ అష్టమి 17:22:35
వరకు తదుపరి కృష్ణ నవమి
నక్షత్రం: విశాఖ 31:21:11 వరకు
తదుపరి అనూరాధ
యోగం: దండ 12:52:46 వరకు
తదుపరి వృధ్ధి
కరణం: కౌలవ 17:15:35 వరకు
వర్జ్యం: 11:52:36 - 13:34:12
దుర్ముహూర్తం: 08:18:51 - 09:04:29
రాహు కాలం: 09:38:43 - 11:04:16
గుళిక కాలం: 06:47:35 - 08:13:09
యమ గండం: 13:55:24 - 15:20:57
అభిజిత్ ముహూర్తం: 12:07 - 12:51
అమృత కాలం: 22:02:12 - 23:43:48
సూర్యోదయం: 06:47:35
సూర్యాస్తమయం: 18:12:05
చంద్రోదయం: 00:21:41
చంద్రాస్తమయం: 11:54:48
సూర్య సంచార రాశి: మకరం
చంద్ర సంచార రాశి: తుల
యోగాలు: శుభ యోగం - కార్య జయం
31:21:11 వరకు తదుపరి అమృత
యోగం - కార్య సిధ్ది
దిశ శూల: తూర్పు
✍️. శ్రీ వక్కంతం చంద్రమౌళి

🌻 🌻 🌻 🌻 🌻  

*🍀. నిత్య ప్రార్థన 🍀*
*వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ*
*నిర్విఘ్నంకురుమేదేవ సర్వకార్యేషు సర్వదా*
*యశ్శివో నామ రూపాభ్యాం యాదేవీ సర్వ మంగళా*
*తయో సంస్మరణాత్పుంసాం సర్వతో జయ మంగళం*
*తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ* 
*విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్రి యుగం స్మరామి.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 496 / Bhagavad-Gita - 496 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 07 🌴*

*07. ఇచ్చా ద్వేష: సుఖం దుఃఖం సఙ్ఘాతశ్చేతనా ధృతి: |*
*ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతమ్ ||*

*🌷. తాత్పర్యం : కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము, సముదాయము, జీవలక్షణములు, విశ్వాసము అనునవి సంగ్రహముగా కర్మక్షేత్రముగను, దాని అంత:ప్రక్రియలుగను భావింపబడు చున్నవి.*

*🌷. భాష్యము : మనస్సు అంతరమందుండుటచే అతరేంద్రియముగా పిలువబడును. కావున ఈ మనస్సుతో కలిపి మొత్తము పదుకొండు ఇంద్రియములు గలవు. ఇక శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములనెడి ఇంద్రియార్థములు ఐదు. ఈ ఇరువదినాలుగు అంశములు విశ్లేషణాత్మక అధ్యయనము కావించినచో కర్మక్షేత్రము అతనికి సంపూర్ణముగా అవగతము కాగలదు. ఇక అంత:ప్రక్రియములైన కోరిక, ద్వేషము, సుఖము, దుఃఖము అనునవి దేహమునందు పంచభూతముల యొక్క ప్రాతినిధ్యములు. అదే విధముగా చైతన్యముచే సుచింపబడు జీవలక్షణములు మరియు విశ్వాసమనునవి మనస్సు, బుద్ధి, అహంకారమును సూక్ష్మశరీరమును యొక్క వ్యక్తరూపములు. ఈ సూక్ష్మంశములు కర్మక్షేత్రమునందే చేర్చబడియున్నవి.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 496 🌹
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 07 🌴*

*07. icchā dveṣaḥ sukhaṁ duḥkhaṁ saṅghātaś cetanā dhṛtiḥ*
*etat kṣetraṁ samāsena sa-vikāram udāhṛtam*

*🌷 Translation : The desire, hatred, happiness, distress, the aggregate, the life symptoms, and convictions – all these are considered, in summary, to be the field of activities and its interactions.*

*🌹 Purport : Then, above the senses, there is the mind, which is within and which can be called the sense within. Therefore, including the mind, there are eleven senses altogether. Then there are the five objects of the senses: smell, taste, form, touch and sound. Now the aggregate of these twenty-four elements is called the field of activity. If one makes an analytical study of these twenty-four subjects, then he can very well understand the field of activity. Then there are desire, hatred, happiness and distress, which are interactions, representations of the five great elements in the gross body. The living symptoms, represented by consciousness, and convictions are the manifestation of the subtle body – mind, ego and intelligence. These subtle elements are included within the field of activities.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 851 / Sri Siva Maha Purana - 851 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 31 🌴*

*🌻. బ్రహ్మవిష్ణువులకు శివుని ఉపదేశము - 6 🌻*

*దేవతలిట్లు పలికిరి - ఓ దేవదేవా! మహాదేవా! గిరిజాపతీ! శంకరా! మేము నిన్ను శరణు జొచ్చినాము. భయముచే కంగారు పడుతున్న దేవతలను రక్షించుము (48). దేవతలను నశింపజేసిన దానవవీరుడగు శంఖచూడుని సంహరించుము. ఆతడు దేవతలను యుద్ధములో జయించి కష్టములకు గురిచేసినాడు (49) దేవతలు అధికారములను గోల్పోయి మానవులవలె భూలోకములో తిరుగాడు చున్నారు. వాని భయము వలన వారు దేవలోకమును కన్నెత్తి చూడలేకున్నారు (50). దీనులనుద్ధరించే దయానిధీ! దేవతలనీ సంకటమునుండి ఉద్ధరించుము. ఆ దానవరాజును సంహరించి ఇంద్రునకు భయము నుండి విముక్తిని చేయుము. ఓ మహేశ్వరా! (51). ఈ మాటలను విని భక్త వత్సలుడగు శంభుడు నవ్వి మేఘగర్జనవలె గంభీరమగు స్వరముతో దేవతలనుద్దేశించి ఇట్లు పలికెను (52).*

*శ్రీ శంకరుడిట్లు పలికెను- ఓ హరీ! ఓ బ్రహ్మా! దేవతలారా! మీరు నిశ్చయముగా మీమీ స్థానములకు వెళ్లుడు. అనుచరులతో సహా శంఖచూడుని వధించెదను. ఈ విషయములో సంశయము వలదు (53).*

*సనత్కుమారుడిట్లు పలికెను- మహేశ్వరుని అమృతతుల్యమగు ఈ పలుకులను విని వారు అందరు శంఖచూడుడు నశించినట్లే యని తలంచి మహానందమును పొందిరి (54). అపుడు హరి వైకుంఠమునకు , బ్రహ్మ సత్యలోకమునకు వెళ్లిరి. దేవతలు మొదలగు వారు మహేశునకు ప్రణమిల్లి తమ స్థానములకు వెళ్లిరి (55).*

*శ్రీ శివ మహా పురాణములోని రుద్ర సంహితయందు యుద్ధఖండలో శివోపదేశవర్ణనము అనే ముప్పది ఒకటవ ఆధ్యాయము ముగిసినది (31).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 851 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 31 🌴*

*🌻 Śiva’s advice to Viṣṇu and Brahmā - 6 🌻*

The gods said:—
48. O great god, lord of the gods, O Śiva, the lord of Pārvatī, we seek refuge in you. Please save the terrified gods.

49. Please slay Saṅkhacūḍa the king of Asura and the destroyer of the gods. The gods have been defeated and harassed by him.

50. Like men they are roaming on the earth divested of their powers. Their region the Devaloka has become very dreary to look at due to fear.

51. O uplifter of the distressed, O ocean of mercy, redeem the gods, from this exigency. O great lord, save Indra from fright by killing that ruler of Dānavas.

Sanatkumāra said:—
52. “On hearing the words of the gods, Śiva favourably disposed to his devotees spoke to them laughingly in the rumbling tone of the cloud.

Lord Śiva said:—
53. O Viṣṇu, O Brahmā, O Gods, return to your own abodes by all means. I shall kill Śaṅkhacūḍa along with his followers and attendants. There is no doubt about it.

Sanatkumāra said:—
54. On hearing the words of lord Śiva sweet as nectar they were excessively delighted considering the Dānava already killed.

55. After bowing to lord Śiva, Viṣṇu went to Vaikuṇṭha and Brahmā to Satyaloka. The god and others went to their own abodes.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 109 / Osho Daily Meditations  - 109 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*

*🍀 109. పరిమితి వలయం 🍀*

*🕉 మనం పరిమితులమని విశ్వసిస్తే, మనం పరిమిత మానవులుగా పనిచేస్తాము. మనం ఆ మూర్ఖపు నమ్మకాన్ని విడిచిపెట్టిన తర్వాత, మనం అపరిమిత జీవులుగా పనిచేయడం ప్రారంభిస్తాము. 🕉*

*మీరు మీ స్వంత వృత్తాన్ని గీసుకున్నారు. ఇది జిప్సీలతో జరుగుతుంది. జిప్సీలు నిరంతరం కదులుతూ ఉంటారు-వారు సంచార జాతివారు. కాబట్టి పెద్దలు ఒక పట్టణంలోకి వెళ్లినప్పుడు, వారు తమ పిల్లల చుట్టూ వలయాలు గీసి అంటారు, 'ఇక్కడ కూర్చోండి. మీరు వదిలి వెళ్ళలేరు. ఇదొక మాయా వలయం.' మరియు జిప్సీ పిల్లవాడు దాని నుండి బయటపడలేడు - ఇది అసాధ్యం! అప్పుడు అతను పెరుగి పెరిగి వృద్ధుడు అవుతాడు; అప్పుడు కూడా, అతని తండ్రి ఒక వృత్తం గీస్తే, వృద్ధుడు దాని నుండి బయటపడలేడు. అతను నమ్ముతున్నాడు-మీరు ఇక విశ్వసించినప్పుడు, అది పని చేస్తుంది. ఇప్పుడు మీరు అనవచ్చు అది మీకు వర్తించదని.*

*ఎవరైనా వృత్తం గీస్తే, మీరు వెంటనే దాని నుండి దూకుతారు; ఏమీ జరగదు. కానీ అతని చిన్నతనం నుండి, ఈ ముసలి జిప్సీ మనిషి దాని కోసం కండిషన్ చేయబడ్డాడు. ఇది అతని కోసం పనిచేస్తుంది, ఇది అతనికి ఒక వాస్తవికత, ఎందుకంటే మిమ్మల్ని ప్రభావితం చేసేది వస్తవికత. వాస్తవికతకు వేరే ప్రమాణం లేదు. కాబట్టి పరిమితి అనేది ఒక భావన. ప్రజలు తప్పుడు నమ్మకాలను కలిగి ఉంటారు మరియు వారు తప్పుగా పనిచేస్తారు. వారు తప్పుగా పనిచేసినప్పుడు వారు కారణాన్ని వెతుకుతారు. వారు నమ్మకాన్ని ఎదుర్కొంటారు మరియు దానిని నొక్కి చెబుతారు: 'నేను దీని కారణంగా తప్పుగా పని చేస్తున్నాను.' ఇది ఒక విష వలయంగా మారుతుంది. అప్పుడు వారు మరింత పరిమితంగా ఉంటారు. ఆ ఆలోచనను పూర్తిగా వదిలేయండి. ఇది కేవలం మీరు లేదా ఇతరులు మీ చుట్టూ గీయడానికి సహాయం చేసిన వృత్తం మాత్రమే.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Osho Daily Meditations  - 109 🌹*
*📚. Prasad Bharadwaj*

*🍀 109. CIRCLE OF LIMITATION 🍀*

*🕉  If we believe we are limited, we function as limited human beings. Once we drop that foolish belief, we start functioning as unlimited beings.  🕉*

*You have drawn your own circle. It happens with gypsies. Gypsies are continually moving-they are wandering people. So when the older people go into a town, they draw circles around their children and tell them, "Sit here. You cannot leave. It is a magic circle." And the gypsy child cannot get out of it-it's impossible! Then he grows and grows and becomes an old man; and even then, if his father draws a circle, the old man cannot get out of it. Now he believes-and when you believe, it works. Now you will say that this cannot be done to you.*

*If somebody draws a circle, you will immediately jump out of it; nothing will happen. But from his very childhood, this old gypsy man has been conditioned for it. It functions for him, it is a reality for him, because reality is that which affects you. There is no other criterion for reality. So limitation is a concept. People have wrong beliefs and then they function wrongly. When they function wrongly they search for a reason why. They come across the belief and go on emphasizing it: "I am functioning wrongly because of this." This becomes a vicious circle. Then they are more limited. Drop that idea completely. It is just a circle that you or others have helped you to draw around yourself.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 531 / Sri Lalitha Chaitanya Vijnanam  - 531 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 109. సహస్రదళ పద్మస్థా, సర్వవర్ణోప శోభితా ।*
*సర్వాయుధధరా, శుక్ల సంస్థితా, సర్వతోముఖీ ॥ 109 ॥ 🍀*

*🌻 531. 'సర్వాయుధ ధరా’  🌻*

*సమస్త ఆయుధములను ధరించి యుండునది. అమృతము మొదలు క్షమాగుణము వరకు గల సర్వశక్తులు, ఆయుధములు, ఈ పద్మము నుండే పుట్టి ప్రకాశించును. అందువలన ఈ పద్మమందలి శ్రీమాతను 'సర్వాయుధ ధరా' అని కీర్తింతురు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 531 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 Sahasradala padmasdha sarva varnopa shobhita*
*sarvayudha dhara shukla sansdhita sarvatomukhi  ॥109 ॥ 🌻*

*🌻 531. 'Sarvayudha Dhara' 🌻*

*She is wearing all the weapons. All the powers and weapons, from Immortality to Forgiveness, are born and shine from this lotus. Therefore, Srimata in this lotus is glorified as 'Sarvayudha Dhara'.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3

No comments:

Post a Comment