మీలో ఉన్న లోపాల నుండి మీరు ముక్తులు అవడానికి మృత్యువు మీద ఆధార పడకoడి Do not rely on death to be free from your own shortcomings


🌹🌹🌹🌹శుభోదయం మిత్రులు అందరికీ... 🌹🌹🌹🌹

మీలో ఉన్న లోపాల నుండి మీరు ముక్తులు అవడానికి మృత్యువు మీద ఆధార పడకoడి. మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో, మృత్యువు తరువాత కూడా మీరు ముందు ఎలా ఉన్నారో అలాగే ఉంటారు. మార్పు ఏమీ ఉండదు. మీరు కేవలం శరీరం మాత్రం వదులుతారు. మీరు మరణం కి ముందు దొంగ, లేదా మోసం చేసే వాళ్లు అయి ఉంటే, చనిపోగానే మీరు మహాపురుషుడు లేదా దేవ దూత అయిపోరు. ఒకవేళ నిజంగా అలానే జరిగితే, అందరం కలసి సముద్రంలో దూకి ఒక్కసారిగా దేవదూతలా మారిపోవచ్చు . కానీ అలా జరగదు. మీరు ముందు నుంచి మిమ్మల్ని మీరు ఎలా తయారు చేసుకున్నారో, మరణం తరువాత కూడా అలానే ఉంటారు. మీరు పునర్జన్మ ఎత్తునపుడు, అదే స్వభావం తీసుకుని వస్తారు. మార్పు రావాలి అంటే మార్పు కోసం ప్రయత్నం చేయాలి అదీ ఈ ప్రపంచంలో దేహం లో ఉన్నప్పుడు మాత్రమే సాధ్యము. భగవద్గీత లో శ్రీకృష్ణుడు అదే చెప్పారు, దేహం విడిచిపెట్టిన తరువాత ఆత్మ ఇంకో శరీరం తీసుకున్నప్పుడు, అదే మనసు, అవే వాసనలు, అవే సంస్కారాలు తీసుకుని మళ్ళీ పుడతారు అని. అంటే ఇదే మనసుతో మళ్ళీ పునర్జన్మ తీసుకుంటారు. అందుకే మార్పు అనేది దేహం లో ఉన్నప్పుడే తెచ్చుకోవాలి....

No comments:

Post a Comment