శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 3
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 539 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।
స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀
🌻 539. 'శ్రుతిః' - 3 🌻
తత్త్వమును యెట్లుండునో తెలియ గోరువారు దానిని గూర్చి తపస్సు చేసి, తపస్సు ద్వారా దాని లోనికి కరిగిపోవుదురు. తిరిగి తాముగ నేర్పడినపుడు దానిని వివరించలేరు. తాము దానియందు కరగిపోయినపు డది యెట్లుండునో తమకునూ తెలియదు. యిట్లుండునని యెవరును వర్ణింపలేరు. అట్టి వేదమును నిర్వచించుట దుర్లభము. అది అనిర్వచనీయము. దానికి నామము లేదు. రూపము లేదు. లింగము లేదు. అనగా చిహ్నము లేదు. అది స్త్రీ కాదు. పురుషుడు కాడు. నపుంసకుడునూ కాడు. సృష్టిలో తెలియబడు ఏ వస్తువుతోనైననూ దానిని పోల్చలేము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 539 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini
svahasvadha amati rmedha shrutih smrutiranuttama ॥110 ॥ 🌻
🌻 539. 'Shrutih' - 3 🌻
Wanting to know what the Tattva is, the devotees do penance for it and dissolve into it through penance. They cannot explain it when they revive themselves again. They don't even know how it is even when they melt into it. No one can describe it as such. It is difficult to define such a Veda. It is indefinable. It has no name. No form. No gender. That is, there is no symbol. It is not a woman. Not a man. It is not a eunuch. It cannot be compared to any known thing in creation.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment