శ్రీ శివ మహా పురాణము - 868 / Sri Siva Maha Purana - 868
🌹 . శ్రీ శివ మహా పురాణము - 868 / Sri Siva Maha Purana - 868 🌹
✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 35 🌴
🌻. శంఖచూడుని దూత శివునితో సంభాషించుట - 5 🌻
మహేశ్వరుడిట్లు పలికెను - మేము భక్తులకు వశవర్తులమై ఉండెదము. మేము ఎన్నటికీ స్వతంత్రులము కాము. భక్తుల కోర్కెచే వారి కార్యములను చేయువారమే గాని, ఏ ఇక్కరి పక్షమునైనూ స్వీకరించువారము గాము (40). పూర్వము ప్రళయసముద్రములో విష్ణువు బ్రహ్మ యొక్క ప్రార్థన నాలకించి దైత్యవీరులగు మధుకైటభులతో సృష్ట్యాదియందు యుద్ధమును చేసెను (41). పూర్వము భక్తులకు హితమును చేయు విష్ణువు దేవతల ప్రార్థనను మన్నించి ప్రహ్లాదుని కొరకై హిరణ్యకశపుని సంహరించెను (42). పూర్వము నేను కూడా దేవతల ప్రార్థనను మన్నించి త్రిపురులతో గొప్ప యుద్ధమును చేసి వారి పురములను భస్మమొనర్చిన వృత్తాంతము లోక విదితమే (43). సర్వేశ్వరి, సర్వజగన్మాత యగు దుర్గ పూర్వము దేవతలు ప్రార్థించుటచే శుంభాదులతో జరిగిన యుద్ధములో వారిని సంహరించెను (44). ఈనాడు కూడా దేవతలందరు బ్రహ్మను శరణు జొచ్చిరి. ఆ బ్రహ్మ, మరియు విష్ణువు దేవతలతో గూడి నన్ను శరణు పొందిరి(45). ఓ దూతా! బ్రహ్మ, విష్ణువు మొదలగు వారి ప్రార్థనను మన్నించి నేను సర్వేశ్వరుడనే అయిననూ ఈ దేవతల యుద్ధము కొరకు వచ్చియుంటిని (46).
మహాత్ముడగు శ్రీ కృష్ణునకు నీవు అనుంగు సహచరుడవు. ఇంతకు ముందు సంహరింపబడిన రాక్షసు లెవ్వరూ నీతో సమానమైన వారు కారు (47). ఓ రాజ! నాకు నీతో యుద్ధమును చేయుటలో అధికమగు సిగ్గుఏమి గలదు? ఈశ్వరుడనగు నన్ను దేవతలు వినయముతో ప్రార్థించుగా, దేవకార్యము కొరకు వచ్చియుంటివి (48). నీవు వెళ్లి నా ఈ మాటలను శంఖచూడునకు చెప్పుము. ఆతడు తనకు యెగ్యముగు రీతిలో చేయుగాక! నేను దేవకార్యమును చేసెదను (49). మహేశ్వరుడగు శంకరుడిట్లు పలికి విరమించెను. అపుడు శంఖచూడుని దూత లేచి ఆతని వద్దకు వెళ్లెను (50).
శ్రీ శివ మహాపురాణములోని రుద్రసంహిత యందు యుద్ధఖండలో శివదూత సంవాదమనే ముప్పది అయిదవ అధ్యాయము ముగిసినది (35).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
🌹 SRI SIVA MAHA PURANA - 868 🌹
✍️ J.L. SHASTRI, 📚. Prasad Bharadwaj
🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 35 🌴
🌻 The conversation between Śiva and the emissary of Śaṅkhacūḍa - 5 🌻
Lord Śiva said:—
40. We are subservient to our devotees. We are never independent. We carry out their tasks at their wish. We are not the partisans of any one in particular.
41. Formerly the fight of Viṣṇu with the excellent Daityas Madhu and Kaiṭabha in the ocean of dissolution was due to the prior request of Brahmā.
42. For the sake of Prahlāda, at the request of gods, Hiraṇyakaśipu was slain by him acting in the interest of his devotees.
43. Formerly I fought with the Tripuras and reduced them to ashes, only at the request of the gods. It is well known.
44. Formerly Pārvatī, the Mother of all, the goddess of all, fought with Śumbha and others and killed them only at the request of the gods.
45. Even today, the gods have sought refuge in Brahmā. And he along with the gods and the lord Viṣṇu has sought refuge in me.
46. O Emissary, paying heed to the request of Viṣṇu, Brahmā and others, I, though lord of all, have come here in the battle of the gods.
47. Really you are the foremost of the comrades of Kṛṣṇa, the great soul. Those Daityas who had been formerly killed are not on a par with you.
48. What is there excessively shameful in my fight with you, O king? I the lord have been urged humbly to carry out the task of the gods.
49. Go to Śaṅkhacūḍa and tell him what I have said. Let him do what is proper. I shall carry out the taṣk of the gods.
Sanatkumāra said:—
50. On saying this, Śiva the great god, stopped. The emissary stood up and returned to Śaṅkhacñḍa.
Continues....
🌹🌹🌹🌹🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment