శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 541 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 541 - 2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 541 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 541 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 110. సర్వౌదన ప్రీతచిత్తా, యాకిన్యంబా స్వరూపిణీ ।
స్వాహా, స్వధా, అమతి, ర్మేధా, శ్రుతిః, స్మృతి, రనుత్తమా ॥ 110 ॥ 🍀
🌻 541. ‘అనుత్తమ’ - 2 🌻
అంతరాయము లేని స్మరణ, అనుసరణ, వృద్ధి, ఉత్తమత్వము అని ఈ పదముల అవగాహన. 'మామనుస్మరా' అని శ్రీకృష్ణుడు పలుకును. అనగా ఎడతెగక నన్ను స్మరింపుము అని తెలిపెను. సాధన నిరంతరము గానపుడు సిద్ధి యుండదు. అనుచింతన, పర్యుపాసన కూడ తెలుపబడినది. కావున ఆరాధన యందు అంతరాయము లుండరాదు. ఫెళ ఫెళ ఫెళమని పది రోజులు ఆడంబరముగ ఆరాధన జేసి పదకొండవ రోజు నుండి ఆరాధన కొనసాగనిచో వృద్ధి కలుగదు. ఏ కార్యము నందైననూ సిద్ధి కలుగవలెనన్నచో నిరంతరత్వము తప్పనిసరి. ఉత్తమత్వమునకు నిరంతరత్వము విడదీయరాని అనుబంధ గుణము. భూమి క్షణకాలము కూడను తిరుగుట మానదు. అట్లే గ్రహములు. మొక్క పెరుగుటలో విరామము లుండవు. ఉన్న స్థితి నుండి ఉత్తమ స్థితికి చేరుటకు నిరంతర శ్రీమాత ఆరాధన యిచ్చట చెప్పబడుచున్నది.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 541 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 110. Sarvaodana pritachitta yakinyanba svarupini
svahasvadha amati rmedha shrutih smrutir anuttama ॥110 ॥ 🌻
🌻 541. 'Anuttama' - 2 🌻
The understanding of these words is uninterrupted remembrance, adaptation, growth, excellence. Lord Krishna said 'Mamanusmara'. That is, remember me without ceasing. There is no siddhi when sadhana is not done continuously. Continuous recollection and constant worship are also indicated. Therefore there should be no interruption in worship. A thunderous10 days of ostentatious worship and the worship is not continued from the eleventh day then there will be no growth. Continuity is a must for success in any work. Continuity is an inseparable attribute of excellence. The earth does not stop rotating even for a moment. Same is the case with the planets. There is no pause in plant growth. It is said that constant worship of Srimata is necessary to reach the best state from the present state.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment