1) 🌹. శ్రీమద్భగవద్గీత - 529 / Bhagavad-Gita - 529 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 40 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 40 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 883 / Sri Siva Maha Purana - 883 🌹
🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 3 / The annihilation of the army of Śaṅkhacūḍa - 3 🌻
3) 🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 142 / Osho Daily Meditations - 142 🌹
🍀 142. రెండు తలుపులు / 142. THE TWO DOORS 🍀
4) 🌹 సిద్దేశ్వరయానం - 56 🌹
5) 🌹 మేల్కొన్న మనిషి / Awakened Person 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 544 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 544 - 2 🌹
🌻 544. 'పుణ్యశ్రవణ కీర్తనా' - 2 / 544. 'Punyashravana Kirtana' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 529 / Bhagavad-Gita - 529 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 5 🌴*
*05. సత్త్వం రజస్తమ ఇతి గుణా: ప్రకృతిసమ్భవా : |*
*నిబధ్నన్తి మహాబాహో దేహే దేహినమవ్యయమ్ ||*
*🌷. తాత్పర్యం : ఓ మహాబాహుడవైన అర్జునా! భౌతిక ప్రకృతి సత్త్వరజస్తమో గుణములనెడి మూడు గుణములను కలిగి యుండును. నిత్యుడైన జీవుడు ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణములచే బంధితుడగును.*
*🌷. భాష్యము : జీవుడు దివ్యుడైనందున వాస్తవమునకు ప్రకృతితో ఎట్టి సంబంధము లేనివాడు. అయినను భౌతిక జగత్తు నందు అతడు బంధితుడగుట వలన భౌతిక ప్రకృతి త్రిగుణముల ననుసరించి వర్తించు చుండును. జీవులు ప్రకృతి త్రిగుణముల ననుసరించి వివిధ దేహములను కలిగి యుండుట వలన ఆ గుణముల ననుసరించియే వర్తించ వలసి వచ్చును. ఇట్టి వర్తనమే వివిధములైన సుఖదుఃఖములకు కారణమగుచున్నది.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 529 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 05 🌴*
*05. sattvaṁ rajas tama iti guṇāḥ prakṛti-sambhavāḥ*
*nibadhnanti mahā-bāho dehe dehinam avyayam*
*🌷 Translation : Material nature consists of three modes – goodness, passion and ignorance. When the eternal living entity comes in contact with nature, O mighty-armed Arjuna, he becomes conditioned by these modes.*
*🌹 Purport : The living entity, because he is transcendental, has nothing to do with this material nature. Still, because he has become conditioned by the material world, he is acting under the spell of the three modes of material nature.*
*Because living entities have different kinds of bodies, in terms of the different aspects of nature, they are induced to act according to that nature. This is the cause of the varieties of happiness and distress.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 . శ్రీ శివ మహా పురాణము - 883 / Sri Siva Maha Purana - 883 🌹*
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 39 🌴*
*🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 3 🌻*
*తన మీదకు వచ్చుచున్న ఆ దానవుని గాంచి శివుడు ఉత్సాహముతో డమరుధ్వనిని చేసి, మరియు సహింప శక్యము కాని ధనస్సు యొక్క నారిత్రాటి శబ్దమును కూడ చేసెను (19). ఆ ప్రభుడు కొమ్ము బూరా ధ్వనితో దిక్కులను నింపి వేసెను. ఆ కైలాసపతి అపుడు రాక్షసులకు భయమును గొల్పువాడై స్వయముగా గర్జించెను (20). ఆయన అధిష్ఠించిన మహావృషభము బిగ్గరగా నాదములను చేసి ఆకాశమును భూమిని ఎనిమిది దిక్కులను శబ్దముతో నింపివేసెను. ఆ నాదమును విన్న ఏనుగులు తాము గొప్పయను గర్వమును విడువవలసినదే (21). భయంకరాకారుడగు రుద్రుడు నేలపై రెండు చేతులతో కొట్టి ఆకాశములోనికి ఎగిరి చప్పట్లు కొట్టగా ఆ ధ్వని తత్పూర్వమునందలి ధ్వనులనన్నిటినీ మించి యుండెను (22).*
*ఆ మహాయుద్ధములో క్షేత్రపాలుడు అమంగళకరమగు పెద్ద అట్టహాసమును చేసెను. భైరవుడు కూడ పెద్ద నాదమును చేసెను (23). సంగ్రామమధ్యములో భయంకరమగు పెద్ద కోలాహలము చెలరేగెను. అపుడు గణముల మధ్యలో అన్నివైపుల నుండియు వీరుల గర్జనలు బయలుదేరెను (24). భయంకరములగు ఆ పరుషశబ్దములను విని దానవులందరు చాల భయపడిరి. దానవచక్రవర్తి, మహాబలశాలి యగు శంఖచూడుడు ఆ ధ్వనులను విని మిక్కిలి కోపించెను (25). హరుడు 'ఓరీ దుర్బుద్ధీ! నిలు నిలు' అని పలుకగానే, దేవతలు మరియు గణములు వెంటనే జయజయధ్వనులను చేసిరి (26). అపుడు దంభుని పుత్రుడు, గొప్ప ప్రతాపశాలియగు ఆ శంఖచూడుడు వచ్చి జ్వాలల మాలలతో మిక్కిలి భయమును గొల్పు శక్తిని రుద్రుని పైకి విసిరెను (27). యుద్ధరంగములో పెద్ద నిప్పుల గుండమువలె వచ్చుచున్న ఆ శక్తిని క్షేత్రపాలుడు వెంటనే తన నోటినుండి పుట్టిన పెద్ద ఉల్కతో చల్లార్చివేసెను. (28).*
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 SRI SIVA MAHA PURANA - 883 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj *
*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 39 🌴*
*🌻 The annihilation of the army of Śaṅkhacūḍa - 3 🌻*
19. On seeing him coming on, Śiva sounded his Ḍamaru enthusiastically and twanged the bowstring, the noise whereof was unbearable.
20. The lord filled all the quarters with the sound of his horn. Śiva himself roared then, frightening the Asuras.
21. The lordly bull then bellowed putting the haughty trumpeting elephants to shame. The deep roar filled the sky, the earth and the eight quarters.
22. With his hands the fierce lord Śiva clapped the earth and the sky. All the previous shouts and roars were surpassed by that sound.
23. The Kṣetrapāla produced a boisterous laughing sound boding ill to the Asuras. In that great battle Bhairava too roared.
24. There was a terrific tumult in the midst of that battle. All round amongst the Gaṇas, the shouts of heroes rose up.
25. The Dānavas were frightened by those harsh and terrible sounds. On hearing them the powerful king of Dānavas became very furious.
26. When Śiva shouted “O wicked one, stay by. Stay by”, the gods and the Gaṇas rapidly shouted “victory, Victory”.
27. Then coming again the valorous son of Dambha hurled at Rudra his spear terrible with shooting flames.
28. While it came on, blazing brilliantly like a great conflagration in the battleground, it was immediately suppressed by Kṣeṭrapāla by means of the meteor springing from his mouth.
Continues....
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. ఓషో రోజువారీ ధ్యానాలు - 142 / Osho Daily Meditations - 142 🌹*
*✍️. ప్రసాద్ భరద్వాజ*
*🍀 142. రెండు తలుపులు 🍀*
*🕉 ఇది సత్యం మరియు భ్రాంతి మధ్య ఎంచుకునే ప్రశ్న కాదు, ఎందుకంటే మీకు బయట ఉన్న అన్ని తలుపులు భ్రమకు దారి తీస్తాయి. 🕉*
*సత్యం నీలోనే ఉంది. ఇది సాధకుని హృదయంలో ఉంది. కాబట్టి ఒక తలుపు మీద 'భ్రాంతి' అని వ్రాసి, మరొకదానిపై 'సత్యం' అని వ్రాసి ఉంటే, వాటిలో దేనినైనా ఎంచుకోవడానికి తొందర పడకండి. రెండూ భ్రమలే. నువ్వు సత్యం. సత్యం అనేది మీ చైతన్యం. మరింత అప్రమత్తంగా మరియు మరింత ఎరుకతో ఉండండి. ఇది తలుపుల మధ్య ఎంచుకునే ప్రశ్న కాదు. మీరు అపస్మారక స్థితిలో ఉన్నందున చీకటి ఉంది, కాబట్టి బయటి నుండి వచ్చే కాంతి ఏదీ సహాయం చేయదు. నేను ఇప్పుడు మీకు దీపం ఇవ్వగలను, కానీ అది సహాయం చేయదు. మీరు మీ గదికి చేరుకునే సమయానికి, అది ఆరిపోతుంది.*
*మీరు మరింత మరింత చైతన్యంతో ఉండాలి మరియు అప్రమత్తంగా ఉందాలి, ఎందుకంటే మీ అంతర్గత జ్వాల మాత్రమే మీ పరిసరాలను ప్రకాశవంతం చేస్తుంది. ఆ వెలుతురులో అన్ని తలుపులు మాయమైనట్లు మీరు చూస్తారు. భ్రాంతి అయిన తలుపు మరియు సత్యమైన తలుపు రెండూ అదృశ్యమయ్యాయి. ఆ రెండూ కుట్ర పన్నాయి. నిజానికి, అవి రెండూ ఒకే ప్రదేశానికి దారితీస్తాయి. అవి మీకు ఎంపిక యొక్క భ్రమను మాత్రమే ఇస్తాయి. కాబట్టి మీరు ఏది ఎంచుకున్నా, మీరు ఎల్లప్పుడూ ఒకే విషయాన్ని ఎంచుకుంటారు. అవి రెండూ ఒకే మార్గానికి దారితీస్తాయి. చివరికి మీరు భ్రమలో ముగుస్తారు. కాబట్టి అది సమస్య కాదు. మరింత అప్రమత్తంగా ఉండటం ఎలా అనేదే సమస్య.*
*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Osho Daily Meditations - 142 🌹*
*📚. Prasad Bharadwaj*
*🍀 142. THE TWO DOORS 🍀*
*🕉 It is not a question of choosing between truth and illusion, because all doors that are outside you lead to illusion.🕉*
*The truth is within you. It is in the very heart of the seeker. So if on one door is written "illusion" and on another is written "truth," don't bother to choose between them. Both are illusory. You are truth. Truth is your very consciousness. Become more alert and more conscious. It is not a question of choosing between doors. The darkness is there because you are unconscious, so no light from the outside can help. I can give you a lamp right now, but it won't help. By the time you have reached your room, it will be out.*
*You have to become more conscious, more and more conscious and alert, so your inner flame, only that, will enlighten your surroundings. In that light you will see that all doors have disappeared. The door that was illusion and the door that was truth both have disappeared. They were both in conspiracy. In fact, they both lead to the same place. They just give you an illusion of choice. So no matter what you choose, you always choose the same thing. They both lead to the same passage. Eventually you end up in illusion. So that is not the problem. The problem is how to become more alert.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 56 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*
*యోగేశ్వరి నెమ్మది నెమ్మదిగా బృందావనం వైపు ఎక్కువ ఆకర్షించబడింది. బంగారు రంగుతో లోకోత్తర సౌందర్యవతిగా రూపుదిద్దుకొన్న ఆ బాలిక బృందావన ధామంలోని ఆకర్షణతో రాధాకృష్ణ రస ప్రపంచంలో మునిగిపోయింది. యాత్రకు వచ్చిన వారి సహకుటుంబీకులు ఆప్తులు అందరూ తిరిగి వెళ్ళటానికి ఉద్యుక్తులవుతున్న దశలో వీరు మాత్రం మరి కొంతకాలం బృందావనంలో ఉందామని నిశ్చయించు కొన్నారు. బెంగాలు నుంచి అప్పుడప్పుడు యాత్రికుల బృందాలురావటం అలవాటు గనుక వెళ్ళాలని అనిపిస్తే అటువైపు వెళ్ళే మరో బృందంతో వెళ్ళవచ్చునని అనుకొన్నారు. పెళ్ళీడుకు వచ్చింది. అమ్మాయికి పెళ్ళి చేయాలన్న ఆలోచన తల్లికి ఉన్నా యోగేశ్వరి ఎంత మాత్రం అంగీకరించటం లేదు. తాను సన్యాసిని అవుతానని తనకు విషయ సుఖములయందు ఆసక్తి లేదని తల్లితో ఎప్పుడూ అంటూండేది.*
*కాలం ఇలాగడుస్తూండగా ఒకనాడు రూపగోస్వామి సమాధిమందిరం దగ్గర ఒక మహనీయ వ్యక్తిని యోగేశ్వరి దర్శించింది. మధ్యవయస్కుడుగా ఉన్న ఆవ్యక్తికి అక్కడి పిన్నలు, పెద్దలు అందరూ సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు. ఎవరీయన అని తెలిసిన ఒకవృద్దుని అడిగితే ఆయన ఇలా అన్నాడు “అమ్మా! ఆయన ఎవరో ఎక్కడివారో ఎవరికీ తెలియదు. నా చిన్నప్పుడు సుమారు 80 సంవత్సరాల క్రింద మొదటిసారి ఆయనను చూచాను. అప్పుడూ ఇలానే ఉన్నాడు. మహా పురుషుడైన రూపగోస్వామికి స్నేహితుడని అందరూ చెప్పుకోనేవారు. అంటే ఇప్పుడు ఆయన వయస్సు 300 సంవత్సరాలు పై బడి ఉంటుంది. బృందావన ధామంలో ఎప్పుడోగాని ఇటువంటి మహాత్ములురారు. అందరూ ఆయనను 'కాళీయోగి' అంటారు. కాళీదేవి అనుగ్రహం వల్ల దీర్ఘాయువును అద్భుతశక్తులను సాధించాడని చెపుతారు” అందరితో పాటు యోగీశ్వరి కూడా వెళ్ళి ఆయన పాదములకు మ్రొక్కింది.*
*ఆయన తలెత్తి చూచి చిరునవ్వుతో యోగేశ్వరీ ! బాగున్నావా ? అని తెలిసినవానివలె పలకరించాడు. తన పేరాయనకు ఎలా తెలుసు ?ఈ అమ్మాయికి ఆశ్చర్యం కలిగింది. ఆయన చూపులో మాటలో చిరకాలంగా తెలిసినవాడు పలకరించిన తీరు కనిపించింది. జనం చాలా మంది ఉండటం వల్ల అప్పుడు ఆయనతో మాట్లాడే అవకాశం కలుగలేదు. ఆ రోజు రాత్రి ఎంత సేపయినా సరే ఉండి ఆయనతో మాట్లాడాలని వేచి ఉన్నది. అందరూ కదిలి వెళ్ళేసరికి చాలా ఆలస్యమైంది. అయినాసరే పట్టుదలతో దృఢసంకల్పంతో ఉన్నది. చివరికాయన లేచి తన వసతిగదిలోకి వెడుతూ ఈ అమ్మాయివైపు ఒక్కసారి చూచి మాట్లాడకుండా లోపలకు వెడుతున్నాడు. ఆయన పొమ్మనలేదు, అన్న ధైర్యంతో ఆయన వెంట లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళి ఆయన ఒక ఆసనం మీద కూర్చున్నాడు. ఆయన పాదములకు నమస్కరించి చేతులు కట్టుకుని ఎదురుగా నిల్చున్నది. అప్పుడాయన ఇలా అన్నాడు.*
*కాళీయోగి : యోగేశ్వరీ ! నీకేం కావాలి ? చాలాసేపటి నుండి వేచి ఉన్నావు.*
*యోగేశ్వరి : స్వామీ! నాకేం కావాలో నాకు తెలియదు. మీరు కాళీదేవి అనుగ్రహం వల్ల సిద్ధశక్తులు సాధించారని కొన్ని వందల ఏండ్ల నుండి జీవిస్తున్నారని విని, మీతో మాట్లాడాలని అనిపించింది. కొత్తగా వచ్చిన నన్ను పేరుతో పలకరించారు. నే నెవరో మాములుగా మీకు తెలిసే అవకాశం లేదు. చిన్నపిల్లను గనుక నన్ను ఎవరూ పరిచయమూ చేయలేదు.*
*కాళీయోగి : నేను ఎవరి గురించి తెలుసు కోవాలనుకుంటే వారి గురించి తెలుస్తుంది. నిన్ను చూడగానే చాలాకాలం నుండి, అంటే కొన్ని వందల ఏండ్ల నుండి నిన్నెరుగుడు సన్న స్మృతి వచ్చింది.*
*యోగేశ్వరి : స్వామీ ! నన్నంతగా ఎరిగిన మీరెవరు ? నేనెవరు ?*
*యోగి : తెలియవలసిన సమయం వచ్చినప్పుడు అన్నీ తెలుస్తాయి. మీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తున్నది. ఈపూటకు ఇంటికి వెళ్ళు. తరువాత కలువవచ్చు.
యోగేశ్వరి : నాకు మళ్ళీ దర్శనమెప్పుడు అనుగ్రహిస్తారు ?*
*యోగి : రేపు రూపగోస్వామి ఆరాధన. అతడు నా చిరకాల మిత్రుడు. చాలా కాలం తరువాత అతనిని చూడాలని సమాధిలో ఉన్న అతనిని పలుకరించాలని వచ్చాను. అందువల్ల రేపు పగలంతా అక్కడ కార్యక్రమంలో మునిగి ఉంటాను. రేపు కూడా ఇదే సమయానికి రా. ఆమె నమస్కరించి వెళ్ళిపోయింది.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 మేల్కొన్న మనిషి / Awakened Person 🌹*
✍️. ప్రసాద్ భరధ్వాజ
*'సాక్షిగా ఉన్న ఆత్మ ఆకాశం లాంటిది. పక్షులు ఆకాశంలో ఎగురుతాయి కానీ అవి పాదముద్రలు వేయవు. మేల్కొన్న మనిషి పాదముద్రలు వేయని విధంగా జీవిస్తాడని బుద్ధుడు చెప్పేది అదే. అతను గాయాలు లేకుండా మరియు మచ్చలు లేకుండా ఉంటాడు. అతను వెనక్కి తిరిగి చూడడు -- ప్రయోజనం లేదు. అతను ఆ క్షణాన్ని పూర్తిగా జీవించాడు, మళ్లీ మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఏమిటి? అతను ఎప్పుడూ ముందుకు చూడడు, వెనక్కి తిరిగి చూడడు, కేవలం ప్రస్తుత క్షణంలో జీవిస్తాడు.'*
*🌹Awakened Person 🌹*
*"The witnessing soul is like the sky. The birds fly in the sky but they don't leave any footprints. That's what Buddha says, that the man who is awakened lives in such a way that he leaves no footprints. He is without wounds and without scars; he never looks back -- there is no point. He has lived that moment so totally that what is the need to look back again and again? He never looks ahead, he never looks back, he lives in the moment."*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 544 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 544 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*
*పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀*
*🌻 544. 'పుణ్యశ్రవణ కీర్తనా' - 2 🌻*
*దేవుని కథల యందాసక్తి లేనివారు అదృష్టహీనులు. వానిని సతతము వినుట, కీర్తించుట, మరల మరల స్మరించుట పుణ్యకార్యము. శౌనకాది మునులు కూడ నిత్యము సూతమహర్షి ప్రవచనములు విను చుందురని ప్రతీతి. ఎచ్చట దివ్యకథల శ్రవణము జరుగుచుండునో అచట శ్రీమాత సాన్నిధ్య ముండునని తెలియవలెను. అట్టి తెలివితో ప్రవచించుట, శ్రవణము చేయుట యుండవలెను. వినిన కథలను ప్రశంసించుకొను చుండవలెను. పుణ్యకథల విమర్శ, విచికిత్స అహంకార హేతువు. భక్తి శ్రద్దలతో వినుట, కీర్తించుట శ్రీమాత అనుగ్రహమునకు ఒక చక్కని ఉపాయము.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 544 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*
*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*
*🌻 544. 'Punyashravana Kirtana' - 2 🌻*
*Unfortunate are those who are not interested in God's stories. It is a meritorious act to listen to them constantly, glorify then, and recollect them again and again. It is believed that even the monks like Shaunaka etc listen to Suta Maharshi's preachings all the time. It should be known that Srimata's proximity is present wherever the hearing of divine stories is going on. There should be preaching and listening with such intelligence. The stories heard should be appreciated. Criticism and dissection of the holy stories is an indication of ego. Listening and glorifying with devotional attention is a good way to propitiate Srimata*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj
No comments:
Post a Comment