శ్రీ శివ మహా పురాణము - 883 / Sri Siva Maha Purana - 883


🌹 . శ్రీ శివ మహా పురాణము - 883 / Sri Siva Maha Purana - 883 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 39 🌴

🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 3 🌻

తన మీదకు వచ్చుచున్న ఆ దానవుని గాంచి శివుడు ఉత్సాహముతో డమరుధ్వనిని చేసి, మరియు సహింప శక్యము కాని ధనస్సు యొక్క నారిత్రాటి శబ్దమును కూడ చేసెను (19). ఆ ప్రభుడు కొమ్ము బూరా ధ్వనితో దిక్కులను నింపి వేసెను. ఆ కైలాసపతి అపుడు రాక్షసులకు భయమును గొల్పువాడై స్వయముగా గర్జించెను (20). ఆయన అధిష్ఠించిన మహావృషభము బిగ్గరగా నాదములను చేసి ఆకాశమును భూమిని ఎనిమిది దిక్కులను శబ్దముతో నింపివేసెను. ఆ నాదమును విన్న ఏనుగులు తాము గొప్పయను గర్వమును విడువవలసినదే (21). భయంకరాకారుడగు రుద్రుడు నేలపై రెండు చేతులతో కొట్టి ఆకాశములోనికి ఎగిరి చప్పట్లు కొట్టగా ఆ ధ్వని తత్పూర్వమునందలి ధ్వనులనన్నిటినీ మించి యుండెను (22).

ఆ మహాయుద్ధములో క్షేత్రపాలుడు అమంగళకరమగు పెద్ద అట్టహాసమును చేసెను. భైరవుడు కూడ పెద్ద నాదమును చేసెను (23). సంగ్రామమధ్యములో భయంకరమగు పెద్ద కోలాహలము చెలరేగెను. అపుడు గణముల మధ్యలో అన్నివైపుల నుండియు వీరుల గర్జనలు బయలుదేరెను (24). భయంకరములగు ఆ పరుషశబ్దములను విని దానవులందరు చాల భయపడిరి. దానవచక్రవర్తి, మహాబలశాలి యగు శంఖచూడుడు ఆ ధ్వనులను విని మిక్కిలి కోపించెను (25). హరుడు 'ఓరీ దుర్బుద్ధీ! నిలు నిలు' అని పలుకగానే, దేవతలు మరియు గణములు వెంటనే జయజయధ్వనులను చేసిరి (26). అపుడు దంభుని పుత్రుడు, గొప్ప ప్రతాపశాలియగు ఆ శంఖచూడుడు వచ్చి జ్వాలల మాలలతో మిక్కిలి భయమును గొల్పు శక్తిని రుద్రుని పైకి విసిరెను (27). యుద్ధరంగములో పెద్ద నిప్పుల గుండమువలె వచ్చుచున్న ఆ శక్తిని క్షేత్రపాలుడు వెంటనే తన నోటినుండి పుట్టిన పెద్ద ఉల్కతో చల్లార్చివేసెను. (28).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 883 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 39 🌴

🌻 The annihilation of the army of Śaṅkhacūḍa - 3 🌻


19. On seeing him coming on, Śiva sounded his Ḍamaru enthusiastically and twanged the bowstring, the noise whereof was unbearable.

20. The lord filled all the quarters with the sound of his horn. Śiva himself roared then, frightening the Asuras.

21. The lordly bull then bellowed putting the haughty trumpeting elephants to shame. The deep roar filled the sky, the earth and the eight quarters.

22. With his hands the fierce lord Śiva clapped the earth and the sky. All the previous shouts and roars were surpassed by that sound.

23. The Kṣetrapāla produced a boisterous laughing sound boding ill to the Asuras. In that great battle Bhairava too roared.

24. There was a terrific tumult in the midst of that battle. All round amongst the Gaṇas, the shouts of heroes rose up.

25. The Dānavas were frightened by those harsh and terrible sounds. On hearing them the powerful king of Dānavas became very furious.

26. When Śiva shouted “O wicked one, stay by. Stay by”, the gods and the Gaṇas rapidly shouted “victory, Victory”.

27. Then coming again the valorous son of Dambha hurled at Rudra his spear terrible with shooting flames.

28. While it came on, blazing brilliantly like a great conflagration in the battleground, it was immediately suppressed by Kṣeṭrapāla by means of the meteor springing from his mouth.


Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment