🌹 11, MAY 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀🌹 11, MAY 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 531 / Bhagavad-Gita - 531 🌹
🌴. 13వ అధ్యాయము - క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం - ప్రకృతి, పురుషుడు, చైతన్యము - 42 / Chapter 13 - Kshetra Kshtrajna Vibhaga Yoga - Nature, the Enjoyer and Consciousness - 42 🌴
2) 🌹. శ్రీ శివ మహా పురాణము - 885 / Sri Siva Maha Purana - 885 🌹
🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 5 / The annihilation of the army of Śaṅkhacūḍa - 5 🌻
3) 🌹 సిద్దేశ్వరయానం - 60 🌹
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 544 - 4 / Sri Lalitha Chaitanya Vijnanam - 544 - 4 🌹 
🌻 544. 'పుణ్యశ్రవణ కీర్తనా' - 4 / 544. 'Punyashravana Kirtana' - 4 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 531 / Bhagavad-Gita - 531 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 14వ అధ్యాయము - గుణత్రయ విభాగ యోగము - ప్రకృతి త్రిగుణములు - 7 🌴*

*07. రజో రాగాత్మకం విద్ధి తృష్ణాసఙ్గసముద్భవమ్ |*
*తన్నిబధ్నాతి కౌన్తేయ కర్మసఙ్గేన దేహినమ్ ||*

*🌷. తాత్పర్యం : ఓ కౌంతేయా! అపరిమితములైన కోరికలు మరియు ఆకాంక్షల వలన రజోగుణము ఉద్భవించుచున్నది. దీని కారణమున జీవుడు కామ్యకర్మలచే బద్ధుడగును.*

*🌷. భాష్యము : స్త్రీ పురుషుల నడుమ గల ఆకర్షణము రజోగుణలక్షణము. అనగా స్త్రీ పురుషుని యెడ ఆకర్షణను కలిగియుండుట మరియు పురుషుడు స్త్రీ యెడ ఆకర్షితుడగుట యనునది రజోగుణమనబడును. ఇట్టి రజోగుణము అధికమైనప్పుడు మనుజుడు భౌతికానందాభిలాషుడై ఇంద్రియసుఖమును అనుభవింపగోరును. అట్టి ఇంద్రియసుఖము కొరకు రజోగుణము నందున్నవాడు సంఘమునందు లేదా దేశమునందు గౌరవమును మరియు చక్కని ఇల్లు, భార్య, సంతానము కలిగిన సుఖసంసారమును వాంచించును. ఇవియన్నియును రజోగుణము నుండి పుట్టినవే. ఇట్టి విషయములకై ప్రాకులాడునంత కాలము అతడు అధికముగా శ్రమింప వలసి వచ్చును.*

 *కనుకనే రజోగుణము నందున్నవాడు తన కర్మఫలముల యెడ రతుడై యుండి, ఆ కర్మలచే బంధితుడగునని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. భార్యను, సంతానమును, సంఘమును సంతృప్తిపరచుటకు మరియు తన గౌరవమును నిలుపుకొనుటకు మనుజుడు సదా కర్మయందు నిమగ్నుడు కావలసివచ్చును. దీనిని బట్టి భౌతికప్రపంచమంతయు ఇంచుమించుగా రజోగుణమునందు ఉన్నదనియే చెప్పవచ్చును. రజోగుణము దృష్ట్యా నవనాగరికత అభివృద్ది నొందినట్లు పరిగణింపబడినను వాస్తవమునకు సత్త్వగుణాభివృద్దియే ప్రగతిగా పరిగణింపబడును. పూర్వము ఆ విధముగనే భావింపబడెడిది. సత్త్వగుణమునందు నిలిచినవారికే ముక్తిలేదన్నచో రజోగుణమున బద్ధులైనవారి మాట వేరుగా చెప్పానేల?*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 531 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 14 - Gunatraya Vibhaga Yoga - Nature, 3 Gunas - 07 🌴*

*07. rajo rāgātmakaṁ viddhi tṛṣṇā-saṅga-samudbhavam*
*tan nibadhnāti kaunteya karma-saṅgena dehinam*

*🌷 Translation : The mode of passion is born of unlimited desires and longings, O son of Kuntī, and because of this the embodied living entity is bound to material fruitive actions.*

*🌹 Purport :The mode of passion is characterized by the attraction between man and woman. Woman has attraction for man, and man has attraction for woman. This is called the mode of passion. And when the mode of passion is increased, one develops the hankering for material enjoyment. He wants to enjoy sense gratification. For sense gratification, a man in the mode of passion wants some honor in society, or in the nation, and he wants to have a happy family, with nice children, wife and house. These are the products of the mode of passion.*

*As long as one is hankering after these things, he has to work very hard. Therefore it is clearly stated here that he becomes associated with the fruits of his activities and thus becomes bound by such activities. In order to please his wife, children and society and to keep up his prestige, one has to work. Therefore, the whole material world is more or less in the mode of passion. Modern civilization is considered to be advanced in the standard of the mode of passion. Formerly, the advanced condition was considered to be in the mode of goodness. If there is no liberation for those in the mode of goodness, what to speak of those who are entangled in the mode of passion?*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 . శ్రీ శివ మహా పురాణము - 885 / Sri Siva Maha Purana - 885 🌹* 
*✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 39 🌴*

*🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 5 🌻*

*తన గద ముక్కలు కాగా ఆ దానవుడు చాలా కోపించి శూలమును చేతబట్టెను. తేజశ్శాలియగు ఆతని శూలము మండుతూ శత్రువులకు సహింప శక్యము కానిదియై ఉండెను (37). శూలమును చేతబట్టి మీదకు వచ్చుచున్న సుందరాకారుడగు ఆ దానవచక్రవర్తిని హరుడు తన త్రిశూలముతో వేగముగా హృదయము నందు పొడిచెను (38). త్రిశూలముచే చీల్చబడిన హృదయమునుండి ఒక గొప్ప పురుషుడు బయటకు వచ్చెను. శంఖచూడుని హృదయమునుండి వచ్చిన ఆ పరాక్రమశాలియగు పురుషుడు 'నిలు, నిలు' అని పలికెను (39). ఆతడు బయటకు వచ్చుట తోడనే శివుడు బిగ్గరగా నవ్వి ఆతని భయంకరమగు శిరస్సును కత్తితో నరుకగా ఆతడు నేలగూలెను (40).*

*తరువాత కాళి తన నోటిని తెరచి అనేక మంది రాక్షసుల తలలు పళ్ల మధ్యలో నలుగుతుండగా క్రోధముతో భయంకరముగా వారిని భక్షించెను (41). మిగిలిన రాక్షసులలో చాల మందిని కోపముచే కల్లోలితుడైన క్షేత్రపాలుడు భక్షించెను. మరి కొందరు భైరవుని అస్త్రములచే చీల్చబడి మరణించిరి. ఇతరులు గాయపడిరి (42). బుద్ధిమంతుడగు వీరభద్రుడు అనేక మందిని క్రోధముతో సంహరించెను. దేవతలను హింసపెట్టిన అనేక రాక్షసులను నందీశ్వరుడు సంహరించెను (43). అపుడీ విధముగా వీరులగు అనేకగణములు కోపము గలవారై యుద్ధసన్నద్ధులై దేవతలను పీడించిన అనేకమంది రాక్షసులను సంహరించిరి (44). ఈ విధముగా ఆ యుద్ధములో శంఖచూడుని సైన్యములో అధికభాగము మట్టుపెట్టబడెను. మిగిలిన అనేకమంది వీరులు భయభీతులై పారిపోయిరి (45).*

*శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శంఖచూడసైన్యవధ వర్ణనమనే ముప్పది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (39).*

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 SRI SIVA MAHA PURANA - 885 🌹*
*✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj *

*🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 39 🌴*

*🌻 The annihilation of the army of Śaṅkhacūḍa - 5 🌻*

37. When the mace was split, the Dānava became very furious. The brilliant Dānava took up a spear that blazed unbearable to the enemies.

38. By means of his trident śiva hit the comely king of Dānavas rapidly in the chest even as he approached with the spear in his hand.

39. From the chest of Śaṅkhacūḍa pierced by the trident, a valorous huge being came out and said “Stand by, Stand by”.

40. Laughing noisily Śiva severed the terrible head of the being that was coming out, by means of a sword. He fell on the ground.

41. Then spreading her mouth wide open Kālī furiously devoured innumerable Asuras whose heads were crushed by her fierce fangs.

42. The excited and infuriated Kṣetrapāla devoured many other Daityas. Some were killed struck down by Bhairava’s missiles. Others were wounded.

43. Vīrabhadra furiously destroyed many other heroes. Nandīśvara killed many other demons.

44. Thus the other Gaṇas, readily prepared and furiously heroic, destroyed many Daityas, Asuras and suppressors of the gods.

45. Thus a major portion of his army was destroyed there. Many other soldiers, cowardly and terrified, fled.

Continues....
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 సిద్దేశ్వరయానం - 60 🌹*

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
     
*🏵 శిష్యురాలు భైరవీ బ్రాహ్మణి 🏵*

*కాళీ యోగి, యోగేశ్వరి గగన వీధులలో భూమికి కొంచెంపైన వాళ్ళు వెడుతూంటే కింద అడవులు కొండలు గుట్టలు, నదులు, సరస్సులు, గ్రామాలు, పట్టణాలు ఎన్నో వెనుకకు వెళ్ళుతున్నవి. వారు వెడుతున్న ఆ మహావేగం ఆశ్చర్యకరంగా ఉన్నది. అస్త్రమంత్రాలతో అభిమంత్రించిన బాణాలు వెళ్తున్నట్లుగా వాళ్ళిద్దరూ వెళుతూంటే మబ్బులు విచ్చుకొని త్రోవ ఇస్తున్నట్లుగా ఉన్నది. ఆకాశంలో ఉన్న పక్షులు వీరి గమనాన్ని తెలుసుకో గలిగినట్లు లేదు. బహుశా అదృశ్యంగా ఉన్నారేమో. సూర్యోదయం అవుతూ ఉండగా ఒక అరణ్య ప్రదేశంలో భూమిమీద దిగారు. అడవిబాటగుండా ఆయన నడుస్తూ ముందుకు వెళుతున్నాడు.*

*ఇంతలో ఒక పెద్దపులి గాండ్రిస్తూ వచ్చింది. దాని ముందుగానే ఏమీ మాట్లాడకుండా ఆయన నడుస్తూ వెళ్ళాడు. ఆయన వెంట యోగేశ్వరి - ఆ పులి నిశ్శబ్దంగా నిల్చున్నది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తరువాత ఎటు చూచినా పెద్ద పెద్ద పాముపుట్టలు. కొన్ని మహాసర్పాలు పడగ విప్పి చూస్తున్నవి. నెమ్మదిగా నడిచి ఆశ్రమంలోకి ప్రవేశించారు. అక్కడ ఏమనుష్యుల అలికిడీ లేదు ఒక కుటీరము ఒక దేవతా మందిరము కొండరాళ్ళతో గుహవలె కనిపిస్తున్న ఆ మందిరంలోకి ప్రవేశించగానే లోపల ఎనిమిదడుగుల ఎత్తైన కాళీదేవి యొక్క భీషణ విగ్రహం ప్రకాశిస్తున్నది. దాని ముందొక హోమకుండం వెలుగుతున్నది.*

*కాళీదేవికి ఆయనతో పాటు తాను కూడా నమస్కరించింది. ఆయన మౌనంగా కొద్ది దూరంలో ఉన్న సరస్సు దగ్గరకు వెళ్ళి స్నానం చేశాడు. ఆమె కూడా స్నానం చేసింది. కుటీరానికి తిరిగి వచ్చిన తరువాత ఆయన “అమ్మవారికి అలంకరించిన చీరలు లోపల ఉన్నవి. వాటిని నీవు ధరించవచ్చును” అన్నాడు ఆమె లోపలకు వెళ్ళి తడిబట్టలు విప్పి చీరను మార్చుకు వచ్చింది.
ఆమె సిద్ధమై వచ్చేసరికి ఆయన పూజకు సిద్ధంగా ఉన్నాడు. ఎవరో అమర్చినట్లు పూజావస్తువులన్నీ అక్కడ ఉన్నవి. కాళీదేవికి శాస్త్రోక్త విధానంగా పూజచేసి ఎదురుగా ఉన్న హోమ కుండంలో కొన్ని ప్రత్యేకద్రవ్యాలతో ఆయన ఆహుతులు వేశాడు. పూజ, హోమము ఇంచుమించు రెండు గంటలు పట్టింది.*

*మరికొంతసేపు గంభీర కంఠంతో ఆయన, కాళీ స్త్రోత్రాలను పారాయణ చేశాడు. కొద్దిసేపు ధ్యానం చేసి "యోగీశ్వరీ! ఈపూటకు, అమ్మవారికి నైవేద్యం పెట్టిన పండ్లు తేనె, మనకు ఆహారం. రేపటి నుండి వంటకు ఏర్పాట్లు జరుగుతవి. ఇక్కడకు చుట్టూ ఉన్న క్రూరజంతువులు, సర్పములు, నిన్నేమీ చేయవు. నిర్భయంగా విశ్రాంతి తీసుకోవచ్చు” అన్నాడు. "స్వామీ! మీరుండగా నాకు భయమన్నది లేదు, మహాపురుషులైన మీపాద సన్నిధిలో నాజీవితం చరితార్థమౌతుంది" అన్నది.*

* ప్రసాదస్వీకారానంతరం కొంత విశ్రాంతి తీసుకొన్న తరువాత సాయంకాలం కలకలం మొదలైంది. కొంత మంది గ్రామీణులు అమ్మవారి దర్శనం స్వామి వారిదర్శనం కోసం వచ్చారు. వస్తూ వస్తూ వంటసామగ్రి, ఆహారపదార్ధాలు కాయగూరలు, పాలు రకరకాల వస్తువులూ తీసుకువచ్చారు. స్వామికి నమస్కరించి ఆయన సంజ్ఞతో ఆ సామాగ్రి అంతా ఆమెకు అప్పగించి కాళీదేవి దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయినారు. కాళీయోగి యోగేశ్వరితో "కావలిసిన సామాగ్రి వచ్చింది. ఇకమీద వంట చేసుకొని మామూలు భోజనం చేయవచ్చు రేపటి నుండి నీ సాధన ప్రారంభం అవుతుంది".*

*యోగేశ్వరి: స్వామీ! కావలసిని సామగ్రివచ్చింది. వంట చేస్తాను కానీ ఇక్కడ ఇంతకుముందు పొయ్యి రాజేసిన జాడ కనపడటం లేదు. ఇన్నాళ్ళుగా మీరు ఏమి ఆహారం తీసుకొంటున్నారో అర్ధంగావటం లేదు.*
*యోగి: ఓ అమాయక బాలికా! నాకు ఆహారంతో కాని నిద్రతో కాని పనిలేదు. ఏమయినా తినగలను, ఎంతయినా తినగలను, ఏమీ తినకుండా ఎంత కాలమయినా ఉండగలను. సామాన్య మానవ శరీరాలకు ఉండే ఏ
అవసరమూ నన్ను బాధించదు.*
*యోగేశ్వరి: మహాత్మా! నాకాస్థితి ఎప్పటికీ వస్తుంది?*
*యోగి: వచ్చిన దాకా ఈ ఆహార విహారాదులు అవసరమే కదా!*
*యోగేశ్వరి: నేను వంట చేస్తాను కానీ మీరు భోజనం చేస్తేనే నేను చేసేది.*
*యోగి: అలానే నాకు తీసుకున్నా ఒకటే, తీసుకోక పోయినా ఒకటే. అయినా నీ కోసం తీసుకొంటాను.*
*యోగేశ్వరి: తమ అనుగ్రహము.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 544 - 4  / Sri Lalitha Chaitanya Vijnanam  - 544 - 4 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।*
*పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀*

*🌻 544. 'పుణ్యశ్రవణ కీర్తనా' - 4 🌻*

*హరినామ సంకీర్తనము కలికల్మష నాశనమని, మరియొక గతి లేదని చైతన్య మహాప్రభువు ఘంటా పథముగ తెలిపినాడు. హరి యనగా దిగివచ్చు దివ్యత్వము అని అర్థము. 'యత్ర యత్ర రఘునాథ కీర్తనం' అను శ్లోక మందరికినీ తెలియును. రామాయణ శ్రవణ సమయమున హనుమంతుని సాన్నిధ్య ముండును. భాగవత శ్రవణమున నారదాది మహర్షుల సాన్నిధ్య ముండును. దేవతా కథలు, మహాత్ముల కథలు అప్రయత్నముగ సాన్నిధ్య మందించును. ఈ రహస్యము తెలిసిన పెద్దలు ఏకాహములని, సప్తాహములని, సత్రయాగములని యేర్పరచుకొని దివ్య సాన్నిధ్యమును గ్రోలుదురు. కావున పుణ్య శ్రవణము, కీర్తనము ప్రధానము.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 544 - 4 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana*
*pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻*

*🌻 544. 'Punyashravana Kirtana' - 4 🌻*

*Chaitanya Mahaprabhu reiterated that Harinama Sankirtana is the only way for destruction of Kali's toxicity and there is no other way. Hari means the descending divinity. Everybody knows the hymn 'Yatra Yatra Raghunatha Keertanam'. During the hearing of Ramayana, the proximity of Lord Hanuman is there. Listening to the Bhagavata, the sages Narada and others are in close proximity. The stories of deities and the stories of the great souls give proximity without effort. Elders who know this secret perform Ekahams, Saptahs and Satrayagas and cultivate divine communion. Therefore, pious listening and chanting are important.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom FB Telegram groups 🌹
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.kooapp.com/profile/Prasad_Bharadwaj
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment