శ్రీ శివ మహా పురాణము - 885 / Sri Siva Maha Purana - 885


🌹 . శ్రీ శివ మహా పురాణము - 885 / Sri Siva Maha Purana - 885 🌹

✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్రసంహితా-యుద్ద ఖండః - అధ్యాయము - 39 🌴

🌻. శంఖచూడుని సైన్యమును వధించుట - 5 🌻


తన గద ముక్కలు కాగా ఆ దానవుడు చాలా కోపించి శూలమును చేతబట్టెను. తేజశ్శాలియగు ఆతని శూలము మండుతూ శత్రువులకు సహింప శక్యము కానిదియై ఉండెను (37). శూలమును చేతబట్టి మీదకు వచ్చుచున్న సుందరాకారుడగు ఆ దానవచక్రవర్తిని హరుడు తన త్రిశూలముతో వేగముగా హృదయము నందు పొడిచెను (38). త్రిశూలముచే చీల్చబడిన హృదయమునుండి ఒక గొప్ప పురుషుడు బయటకు వచ్చెను. శంఖచూడుని హృదయమునుండి వచ్చిన ఆ పరాక్రమశాలియగు పురుషుడు 'నిలు, నిలు' అని పలికెను (39). ఆతడు బయటకు వచ్చుట తోడనే శివుడు బిగ్గరగా నవ్వి ఆతని భయంకరమగు శిరస్సును కత్తితో నరుకగా ఆతడు నేలగూలెను (40).

తరువాత కాళి తన నోటిని తెరచి అనేక మంది రాక్షసుల తలలు పళ్ల మధ్యలో నలుగుతుండగా క్రోధముతో భయంకరముగా వారిని భక్షించెను (41). మిగిలిన రాక్షసులలో చాల మందిని కోపముచే కల్లోలితుడైన క్షేత్రపాలుడు భక్షించెను. మరి కొందరు భైరవుని అస్త్రములచే చీల్చబడి మరణించిరి. ఇతరులు గాయపడిరి (42). బుద్ధిమంతుడగు వీరభద్రుడు అనేక మందిని క్రోధముతో సంహరించెను. దేవతలను హింసపెట్టిన అనేక రాక్షసులను నందీశ్వరుడు సంహరించెను (43). అపుడీ విధముగా వీరులగు అనేకగణములు కోపము గలవారై యుద్ధసన్నద్ధులై దేవతలను పీడించిన అనేకమంది రాక్షసులను సంహరించిరి (44). ఈ విధముగా ఆ యుద్ధములో శంఖచూడుని సైన్యములో అధికభాగము మట్టుపెట్టబడెను. మిగిలిన అనేకమంది వీరులు భయభీతులై పారిపోయిరి (45).

శ్రీ శివమహాపురాణములోని రుద్రసంహితయందు యుద్ధఖండలో శంఖచూడసైన్యవధ వర్ణనమనే ముప్పది తొమ్మిదవ అధ్యాయము ముగిసినది (39).


సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹




🌹 SRI SIVA MAHA PURANA - 885 🌹

✍️ J.L. SHASTRI, 📚. Prasad Bhadwaj

🌴 Rudra-saṃhitā (5): Yuddha-khaṇḍa - CHAPTER 39 🌴

🌻 The annihilation of the army of Śaṅkhacūḍa - 5 🌻


37. When the mace was split, the Dānava became very furious. The brilliant Dānava took up a spear that blazed unbearable to the enemies.

38. By means of his trident śiva hit the comely king of Dānavas rapidly in the chest even as he approached with the spear in his hand.

39. From the chest of Śaṅkhacūḍa pierced by the trident, a valorous huge being came out and said “Stand by, Stand by”.

40. Laughing noisily Śiva severed the terrible head of the being that was coming out, by means of a sword. He fell on the ground.

41. Then spreading her mouth wide open Kālī furiously devoured innumerable Asuras whose heads were crushed by her fierce fangs.

42. The excited and infuriated Kṣetrapāla devoured many other Daityas. Some were killed struck down by Bhairava’s missiles. Others were wounded.

43. Vīrabhadra furiously destroyed many other heroes. Nandīśvara killed many other demons.

44. Thus the other Gaṇas, readily prepared and furiously heroic, destroyed many Daityas, Asuras and suppressors of the gods.

45. Thus a major portion of his army was destroyed there. Many other soldiers, cowardly and terrified, fled.


Continues....

🌹🌹🌹🌹🌹


No comments:

Post a Comment