శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 547 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 547 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 111. పుణ్యకీర్తిః, పుణ్యలభ్యా, పుణ్యశ్రవణ కీర్తనా ।
పులోమజార్చితా, బంధమోచనీ, బంధురాలకా ॥ 111 ॥ 🍀

🌻 547. 'బర్బరాలకా’ - 1 🌻


అలల వలె వెలువడు శిరోజములు కలది శ్రీమాత అని అర్ధము. ఈ నామమును 'బంధురాలకా' అని కూడ వాడుదురు. శ్రీమాత శిరోజములు కెరటములవలె, అలలవలె అనంతముగ యేర్పడును. గిరజాలతో కూడియుండు శిరోజము లామెవి. ఉంగరములు, ఉంగరములుగా నేర్పడుట జరుగగా గిరజములు యేర్పడును. సృష్టి అంతయూ ఆమె నుండి యిట్లే యేర్పడుచుండును. చుట్టలు చుట్టలుగా సృష్టి యేర్పడగా అవి చిక్కుపడుట సహజమే. ఉంగరముల జుట్టు కలవారు నిత్యమూ జుట్టును సంస్కరించుకొననిచో చిక్కుపడి గూడు కట్టుట, అట్టలు కట్టుట కూడ జరుగును. అడవి వలె యేర్పడును. అపవిత్రత యేర్పడుచుండును. సృష్టి పవిత్రమే అయినను నిత్యమూ దానిని సంస్కరించుట జరిగినచో చిక్కుపడునని తెలియవలెను.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 547 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 111. Punyakirtih punyalabhya punyashravana kirtana
pulomajarchita bandhamochani bandhuralaka ॥111 ॥ 🌻

🌻 547. 'Barbaralaka' - 1 🌻


It means Sri Mata, who has tresses like waves. This name is also used as 'Bandhuralaka'. Srimata's tresses are endless like waves. Her hair is in curls. Rings and rings of curls are formed. Even the creation is formed from her in the same way. It is natural for creation to become tangled when it spirals like continuous curls. People with curly hair know that it gets tangled and matted if they don't groom their hair regularly. Becomes a forest. Impurity accumulates. It should be known that although the creation is pure it gets tangled if it is not constantly reformed.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment