1) 🌹. శ్రీమద్భగవద్గీత - 556 / Bhagavad-Gita - 556 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 05 / Chapter 15 - Purushothama Yoga - 05 🌴
3) 🌹 సిద్దేశ్వరయానం - 110 🌹
🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 6 🏵
4) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 5 🌹
🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 5 / 552. 'Sarvamrutyu Nivarini' - 5 🌻
5) 🌹 అతీత స్పృహ : దైవీ ఆనందం వైపుకి ప్రయాణం 🌹
6) 🌹 Transcendental Consciousness: Journey to Divine Bliss 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 అతీత స్పృహ : దైవీ ఆనందం వైపుకి ప్రయాణం 🌹*
*ప్రసాద్ భరధ్వాజ*
*చైతన్య విజ్ఞానం యూట్యూబ్ ఛానెల్‌కి స్వాగతం! ఈ రోజు మనం ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు ఉన్నతమైన స్పృహ దశలను అన్వేషిస్తున్నాము. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించి తుర్య దశకు చేరుకోవడం ఎలా జరుగుతుందో, దైవానికి సమీపించడానికి ఏకాగ్రత ఎందుకు అవసరమో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ ఆధ్యాత్మిక మార్గంలో మరింత లోతుగా వెళ్లడానికి ఈ ప్రయాణంలో నాతో చేరండి!*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Transcendental Consciousness: Journey to Divine Bliss 🌹*
*Prasad Bharadwaj*
*Welcome to our YouTube Channel! Today we explore the stages of spiritual growth and higher consciousness. In this video, we will learn how a person can progress spiritually and reach the stage of Turya and why concentration is necessary to approach the divine. Join us on this journey to go deeper on your spiritual path!*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 556 / Bhagavad-Gita - 556 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 05 🌴*
*05. నిర్మానమోహా జితసఙ్గదోషా ఆధ్యాత్మనిత్యా వినివృత్తకామా: |*
*ద్వన్ద్వైర్విముక్తా: సుఖదుఃఖసంఙ్ఞైర్ గచ్చన్త్యమూఢా: పదమవ్యయమ్ తత్ ||*
*🌷. తాత్పర్యం : మిథ్యాహంకారము, భ్రాంతి, దుస్సాంగత్యముల నుండి విడివడినవారును, శాశ్వతత్వమును అవగతము చేసికొనినవారును, కామవర్జితులును, సుఖదుఃఖములనెడి ద్వంద్వముల నుండి బయటపడినవారును, భ్రాంతిరహితులై ఏ విధముగా పరమపురుషుని శరణువేడవలెనో తెలిసినవారును అగు మనుజులు అట్టి అవ్యయపదమును పొందగలరు*
*🌷. భాష్యము : కృష్ణలోకముగా (గోలోకబృందావనము) తెలియబడు దేవదేవుడైన శ్రీకృష్ణుని ధామము (ఆధ్యాత్మికజగము) ఇచ్చట వర్ణింపబడినది. ఆధ్యాత్మికలోకములన్నియును స్వయంప్రకాశమానములు కనుక ఆధ్యాత్మికజగత్తు నందు సూర్యకాంతి, చంద్రకాంతి, అగ్ని, విద్యుత్తుల అవసరము లేదు. ఈ విశ్వములో సూర్యుడొక్కడే స్వయం ప్రకాశమానుడు. కాని ఆధ్యాత్మికజగత్తులోని లోకములన్నియు స్వయం ప్రకాశమానములే. వైకుంఠలోకములుగా పిలువబడు ఆ లోకముల ప్రకాశమాన కాంతియే బ్రహ్మజ్యోతి యనబడు తేజోమయ ఆకాశమును రూపొందించును.*
*వాస్తవమునకు ఆ కాంతి కృష్ణలోకమైన గోలోకబృందావనము నుండియే బయల్వెడలుచున్నది. ఆ తేజపు అతికొద్దిభాగము మహత్తత్త్వముచే (భౌతికజగము) కప్పుబడినను మిగిలిన భాగమంతయు వైకుంఠములని పిలువబడు ఆధ్యాత్మిక లోకములచే నిండియుండును. ఆ లోకములలో ముఖ్యమైనదే గోలోక బృందావనము.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 556 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 15 - Purushothama Yoga - 05 🌴*
*05. nirmāna-mohā jita-saṅga-doṣā adhyātma nityā vinivṛtta-kāmāḥ*
*dvandvair vimuktāḥ sukha-duḥkha-saṁjñair gacchanty amūḍhāḥ padam avyayaṁ tat*
*🌷 Translation : Those who are free from false prestige, illusion and false association, who understand the eternal, who are done with material lust, who are freed from the dualities of happiness and distress, and who, unbewildered, know how to surrender unto the Supreme Person attain to that eternal kingdom.*
*🌹 Purport : The surrendering process is described here very nicely. The first qualification is that one should not be deluded by pride. Because the conditioned soul is puffed up, thinking himself the lord of material nature, it is very difficult for him to surrender unto the Supreme Personality of Godhead. One should know by the cultivation of real knowledge that he is not lord of material nature; the Supreme Personality of Godhead is the Lord. When one is free from delusion caused by pride, he can begin the process of surrender. For one who is always expecting some honor in this material world, it is not possible to surrender to the Supreme Person.*
*Pride is due to illusion, for although one comes here, stays for a brief time and then goes away, he has the foolish notion that he is the lord of the world. He thus makes all things complicated, and he is always in trouble. The whole world moves under this impression. People are considering the land, this earth, to belong to human society, and they have divided the land under the false impression that they are the proprietors. One has to get out of this false notion that human society is the proprietor of this world. When one is freed from such a false notion, he becomes free from all the false associations caused by familial, social and national affections.*
*These faulty associations bind one to this material world. After this stage, one has to develop spiritual knowledge. One has to cultivate knowledge of what is actually his own and what is actually not his own. And when one has an understanding of things as they are, he becomes free from all dual conceptions such as happiness and distress, pleasure and pain. He becomes full in knowledge; then it is possible for him to surrender to the Supreme Personality of Godhead.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 6 🏵*
*హైదరాబాదులో ఒకసారి భాగవతసప్తాహం చేస్తూ ఉండగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నత స్థానంలో ఉన్న ఒక భద్రమహిళ వచ్చి తన విషయాన్ని ఇలా విన్నవించుకొన్నది. "స్వామీ! పదవి, ఐశ్వర్యం, సేవకులు, క్రింద ఉద్యోగులు - అన్నీ ఉన్న జీవితం నాది. ఎందరో అసూయపడుతున్న వైభవం నాది. ఇతరులకు తెలియని చెప్పలేని కష్టం నన్ను పీడిస్తున్నది. సాంసారిక బంధం విచ్ఛిన్న మయింది. నేను మానసికంగా ఏకాకిని. నిరాశా నిస్పృహలతో బాధపడుతున్నాను. దీనికి పరిష్కారం ఏదయినా అనుగ్రహించండి". ధ్యానంలో ఆమె సంగతి చూచి ఈ విధంగా చెప్పాను. “అమ్మా! నిన్ను ఇంతకుముందు 300 సంవత్సరాల నుండి ఎరుగుదును, ఒకప్పుడు నీవు కాళీ భక్తురాలివి, నా శిష్యురాలివి. ఆనాడు తెలిసో తెలియకో ఒక తప్పు చేశావు. దాని ఫలితంగా సర్ప జన్మ వచ్చింది. అయితే పూర్వస్మృతి ఉండడం వల్ల ఆ శరీరంలో ఉండలేక బాధపడుతూ ఒకరోజు మా కాళీ ఆశ్రమానికి వచ్చి పడగ ఎత్తి నిల్చొని దీనంగా నీ బాధను తెలియచేశావు. మనుష్యజన్మ వచ్చేటట్లు చేయమని ప్రార్థించావు.*
*"అమ్మా! ఈ శరీరంలో మరికొంతకాలం, ఉంటే కర్మానుభవం పూర్తవుతుంది. అప్పుడు మనిషి జన్మ వస్తుంది" అన్నాను. "స్వామీ! ఈ శరీరం భరించలేకుండా ఉన్నాను. మానవశరీరం కావాలి. ఎంతటి కష్టాన్నయినా ఆ దేహంతో అనుభవిస్తాను" అని మరీ మరీ ప్రార్థించావు. ఆనాడు నాకు ఉన్న సిద్ధశక్తుల వల్ల నీకు మనుష్య జన్మ వచ్చేలా చేశాను. అదే నీ విప్పుడు ఉన్న జన్మ. అనుభవించవలసిన ఉన్న పాపం ఇంకా కొంత మిగిలి ఉంది. దానివలన ఈ జన్మలో ఇక సుఖములు పొందలేవు. వచ్చే జన్మలో పురుష శరీరం వస్తుంది. మంచిసాధన చేసి యోగివవుతావు. ఇక ఈ జన్మలో సుఖము లేకపోయినా మానసికంగా శాంతిని పొందే పద్ధతులు చెపుతాను. నేనుపదేశించిన మార్గంలో కాళీదేవి యొక్క ధ్యాన సాధన చేయవలసింది, అన్నాను. ఇప్పుడు ఆమె ఆ సాధనలో ఉంది.*
*మంత్రశాస్త్రంలో సంతానకాళి మంత్రం ఒకటి అద్భుతంగా ఉపయోగిస్తున్నది. సంతానం లేని వ్యక్తులు ఎందరో ఈ మంత్రోపదేశం పొంది, సాధన చేసి సంతానవంతులు అయినారు. భూతప్రేత బాధా నివారణలో కాళీదేవి అసామాన్యమైన అనుగ్రహాన్ని చూపిస్తున్నది. గుంటూరు కాళీపీఠంలో కాళీమంత్రసాధన చేసినవారిలో దాదాపు పదిమంది కాళీదేవి యొక్క దర్శనాన్ని పొందారు. అందులో ఒక సాధకురాలు పూర్వజన్మలో ఈ సిద్ధకాళికి అర్చకురాలుగా ఉండేది.*
*ఇలా కాళీదేవి ఎన్నో అద్భుత లీలలను చూపిస్తున్నది. ఆమె భీషణ సౌందర్యం నన్ను క్షణక్షణమూ ఆకర్షిస్తుంటే ఇలా స్తుతించాను.*
*శ్లో॥ ఆరక్తజిహ్వాం వికటోగ్ర దంష్ట్రాం శూన్యాంబరాం సుందరభీషణాంగీం*
*కరత్రిశూలాం గళముండమాలాం కాళీం కరాళీం సతతం భజామి.*
*ఎర్రని నాలుకతో వికటమైన దంష్ట్రలతో, చేతిలో శూలము, మెడలో పుర్రెల మాల అలరుతూ ఉండగా దిగంబరయై భయంకరంగా ప్రకాశించే భీషణ సౌందర్య మూర్తియైన కాళీదేవిని భజిస్తున్నాను.*
*ఉ॥ కంటకులైన శాత్రవుల గర్వము ఖర్వము సేయ అల్ల ము క్కంటి గృహంబు నుండి అజకల్పిత లోకము లెన్నొ దాటి నా యింటికి వచ్చి హోమగృహ మెర్రని నవ్వుల నింపి కుండపున్ మంటల మధ్య నిల్చు అతిమానుష కేళిని కాళినెంచెదన్.*
*నా శత్రువుల గర్వాన్ని అణచి వేయటానికి, నన్ను రక్షించటానికి కైలాసం నుండి బయలుదేరి ఎన్నో లోకాలు దాటి నా యింటిలోని హోమగృహంలో ఎర్రగా నవ్వుతూ కుండంలోని అగ్నిజ్వాలల మధ్య నిల్చున్న మానవాతీత క్రీడా స్వరూపిణియైన కాళీదేవిని స్మరిస్తున్నాను.*
*ఉ॥ అంటిన ప్రేమ వచ్చెను స్వయంభువుగా హిమశైలమందు, నే డుంట కళింగ భూముల నహో ! శతషట్క సువర్షమూర్తియై గుంటురిలోని నన్ మరల గోరి వియత్తలి నుండి దేవతల్ ఘంటలు మ్రోయ విగ్రహముగా దిగివచ్చిన కాళి గొల్చెదన్.*
*ఆరువందల యేండ్లు హిమాలయాలలో చేసిన నా తపస్సుకు సంతోషించి అవతరించి చిన్న విగ్రహంగా రూపుదాల్చింది. అది వయస్సును బట్టి పెరుగుతున్నది. పెద్ద విగ్రహమయ్యే సరికి నేను ఒరిస్సాలోని అడవిలో ఆశ్రమాన్ని నిర్మించుకొన్నాను. నే నిప్పుడు జన్మమారినా నా మీద దయవల్ల గుంటూరు లోని మా పీఠంలో దిగి వచ్చిన ఆ కాళిని భజిస్తున్నాను.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 5 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 5 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।*
*సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀*
*🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 5 🌻*
*అట్లే ధ్యానోపాసనము, యోగ విద్యాభ్యాసము యిత్యాదివి కూడ ఉపాయములే. మార్గమేదైననూ మృత్యువను అజ్ఞానపు తెరను తొలగింప వలసినది శ్రీమాతయే కదా! దేహికిని, దేహమునకు అనుసంధానము కూర్చునది ప్రాణము. దేహికి దేహముతో ప్రాణము వలన ముడిపడును. ప్రాణము ముడిని యోగము ద్వారా, జ్ఞానము ద్వారా విడదీసుకొని అందు వసించుట నిజమగు స్వేచ్ఛా జీవనము. అప్పుడు దేహమును ఒక నివాసముగ వినియోగించుకొన వచ్చును. ఈ ఉపాయమును నేర్వనివారు స్వేచ్ఛలేక దేహమను కారాగారమున యుందురు. ఇట్టి కారాగారము నుండి బయలు వెడలుటకే తారణవిద్య లన్నియును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 5 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh*
*sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻*
*🌻 552. 'Sarvamrutyu Nivarini' - 5 🌻*
*Similarly, meditation, yoga etc. are also ways. It is Sri Mata who has to remove the veil of ignorance called death in any way! Prana is the connection between the body and the one in the body. The soul gets tangled in the body through prana.A true life of freedom is to live by disentangling with body through yoga and knowledge. Then the body can be used as an abode. Those who do not learn this method are not free and are in the body like in a prison. All the Taranavidyas are to free oneself from this prison.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj
No comments:
Post a Comment