🌹 27, JULY 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀🌹 27, JULY 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
1) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 956 / Vishnu Sahasranama Contemplation - 956 🌹
🌻 956. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ 🌻
2) 🌹 సిద్దేశ్వరయానం - 110🌹
🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 7 🏵
3) 🌹. శివ సూత్రములు - 270 / Siva Sutras - 270 🌹
🌻 3 - 44. నాసికాంతర్ మధ్య సంయమాత్ కిమాత్ర సవ్యపసవ్య సౌసుమ్నేసు - 2 / 3 - 44. nāsikāntar madhya samyamāt kimatra savyāpasavya sausumnesu - 2 🌻
4) 🌹 सच्चा सुख 🌹
🌹📽Chaitanya Vijnanam - Spiritual Wisdom Channel 📽🌹
Like, Subscribe and Share 👀

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అతీత స్పృహ : దైవీ ఆనందం వైపుకి ప్రయాణం 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*చైతన్య విజ్ఞానం యూట్యూబ్‌ ఛానెల్‌కి స్వాగతం! ఈ రోజు మనం ఆధ్యాత్మిక ఎదుగుదల మరియు ఉన్నతమైన స్పృహ దశలను అన్వేషిస్తున్నాము. ఒక వ్యక్తి ఆధ్యాత్మికంగా పురోగమించి తుర్య దశకు చేరుకోవడం ఎలా జరుగుతుందో, దైవానికి సమీపించడానికి ఏకాగ్రత ఎందుకు అవసరమో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీ ఆధ్యాత్మిక మార్గంలో మరింత లోతుగా వెళ్లడానికి ఈ ప్రయాణంలో నాతో చేరండి!*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Transcendental Consciousness: Journey to Divine Bliss 🌹*
*Prasad Bharadwaj*

*Welcome to our YouTube Channel! Today we explore the stages of spiritual growth and higher consciousness. In this video, we will learn how a person can progress spiritually and reach the stage of Turya and why concentration is necessary to approach the divine. Join us on this journey to go deeper on your spiritual path!*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹



*🌹 सच्चा सुख 🌹*
*सच्चे सुख और आत्म-परिवर्तन के मार्ग को जानें। समझें क्यों बाहरी स्रोतों पर खुशी निर्भरता पैदा करती है और असली खुशी भीतर से आती है। स्थायी सुख के लिए अलगाव और आंतरिक स्वतंत्रता का महत्व जानें।*

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 956 / Vishnu Sahasranama Contemplation - 956 🌹*

*🌻 956. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ 🌻*

*ఓం ప్రాణదాయ నమః | ॐ प्राणदाय नमः | OM Prāṇadāya namaḥ*

*మృతాన్ పరీక్షిత్ ప్రభృతిన్ జీవయన్ ప్రాణదో హరిః*

*మృతి నొందిన పరీక్షిదాదులకు ప్రాణములను ఇచ్చినవాడు కనుక ప్రాణదః.*

65. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ 
321. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ
408. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 956 🌹*

*🌻 956. Prāṇadaḥ 🌻*

*OM Prāṇadāya namaḥ*

*मृतान् परीक्षित् प्रभृतिन् जीवयन् प्राणदो हरिः / Mr‌tān parīkṣit prabhr‌tin jīvayan prāṇado hariḥ*

*Since Lord Hari brought back to life the likes of Parīkṣit and others who died - by giving them life, He is called Prāṇadaḥ.*

65. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ 
321. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ
408. ప్రాణదః, प्राणदः, Prāṇadaḥ

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
आधारनिलयोऽधाता पुष्पहासः प्रजागरः ।ऊर्ध्वगस्सत्पथाचारः प्राणदः प्रणवः पणः ॥ १०२ ॥
ఆధారనిలయోఽధాతా పుష్పహాసః ప్రజాగరః ।ఊర్ధ్వగస్సత్పథాచారః ప్రాణదః ప్రణవః పణః ॥ 102 ॥
Ādhāranilayo’dhātā puṣpahāsaḥ prajāgaraḥ,Ūrdhvagassatpathācāraḥ prāṇadaḥ praṇavaḥ paṇaḥ ॥ 102 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 యోగులు - సూక్ష్మశరీరులు - 7 🏵*

*సిద్ధేశ్వరీపీఠంలోకి నా ప్రవేశం కూడా చిత్రమైన పరిణామం. కాళీదేవి ఆలయ నిర్మాణం తరువాత సన్యాసం తీసుకోవాలన్న ఆశ ప్రబలంగా పెరిగింది. కుర్తాళ సిద్ధేశ్వరీపీఠాధిపతి శ్రీ శివచిదానందభారతీస్వామివారిని ఈ విషయమై అభ్యర్థించాను. వారు సంతోషంగా అంగీకరించి పీఠ ఉత్తరాధికారిగా మీరు తగిన వారు అంగీకరించండి అన్నారు"స్వామి ! నేను సన్యాసం తీసుకొని గుంటూరు లోని కాళీదేవి దగ్గర కొంతకాలం, బృందావనం వెళ్ళి రాధాసాధనలో ఎక్కువ కాలం ఉందామన్న ఆలోచనలో ఉన్నాను" అన్నాను. వారు మీ ఇష్టదేవతను నేను చెప్పిన విషయమై అడగండి ఆమె ఆజ్ఞను మీరు పాటింతురు గాని అన్నారు. ఆ రోజు రాత్రి ధ్యానంలో కూర్చున్నాను. సిద్ధేశ్వరీదేవి సాక్షాత్కరించి “బృందావనంలో గుంటూరులో ఉన్నది నేనే. కుర్తాళానికి రా” అని మధురమైన పాయాసాన్ని స్వయంగా అనుగ్రహించింది. ఈ విషయాన్ని శివచిదానందస్వామివారికి చెప్పగా వారు సంతోషంతో సన్యాసదీక్ష ఇచ్చి యువరాజ పదవీ పట్టాభిషేకం చేశారు. ఆ తరువాత కొంతకాలానికి అంతకు ముందే గుప్తంగా వారి శరీరంలో ఉన్న బ్లడ్ కాన్సర్ బైటపడటం, మూడు నెలలకే వారు సిద్ధిపొందటం జరిగింది.*

*నేను 2002, డిసెంబరు 19వ తేదీ దత్తజయంతి నాడు పీఠాధిపత్యం స్వీకరించడం జరిగింది. దానితో పాటు, నెల్లూరు, విజయవాడ, విశాఖపట్నంలోని పీఠాలకు అధిపతి కావడం సంభవించింది. ఇవి కాక అనేక అనుబంధ దేవాలయాలకు పాలక పదవి స్వీకరించవలసి వచ్చింది. వీనిలో కొన్ని చోట్ల స్థానికులయిన బలవంతులతో సంఘర్షణ ఏర్పడింది. కొన్ని చోట్ల దేవాలయాలను, కొన్ని చోట్ల ఆస్తులను, స్థలాలను, భవనాలను ఆక్రమించుకొన్న వ్యక్తులతో వివాదాలు బహు ముఖాలుగా వచ్చినవి. గూండాగిరి, బెదిరింపులు కోర్టు వివాదాలు ఎక్కువ అయినాయి. అన్నీవదలి తపస్సు చేసుకుంటూ ఉందామన్న నాకు ఈ వ్యవహరాలు తలనొప్పిని కలిగించినవి. సిద్ధేశ్వరీ, సిద్ధమాత అయిన లలితాదేవికి నా వేదనను విన్నవించాను. ఆమె వాత్సల్యంతో ఎటువంటి శత్రువులనైన జయించ గల్గిన ఒక అద్భుత మంత్రాన్ని స్వయంగా ఉపదేశించింది. కొద్దిపాటి జపసాధన చేయగానే చాలా పరిమిత సమయంలో సమస్యలన్నీ పరిష్కారమైనవి. ఆ తరువాత బ్రహ్మాండ పురాణాంతర్గత మైన ఆ దేవి యొక్క చరిత్రను సామాన్యజనులకు అందుబాటు లోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతో సరళంగా, సుబోధకంగా లలితమైన శైలిలో రచించాను, ఆ సందర్భంగా ఆమెను స్తుతిస్తూ ఇలా పలికాను.*

*సీ॥ ఉపదేశమొనరించె కృపతోడ నేదేవి శత్రుంజయంబైన శాక్త విద్య అరుణారుణంబైన తరుణ సుందరమూర్తి దర్శనంబిచ్చె నే ధర్మవీర పిలిచి స్వయమ్ముగా పీఠత్రయాధీశు చేసె నే మహనీయ సిద్ధమాత రచియింపజేసి నే రసమహాసమ్రాజ్ఞి ఘనరహస్యంబైన తన చరిత్ర*

*గీ॥ సుకవిగా దీర్చి దివ్యమౌస్ఫురణ నిచ్చి యోగిగా మార్చె నన్ను నే రాగమూర్తి 
 ఆ సకల నేత్రి సిద్ధేశ్వరీ సవిత్రి లలిత నా గుండెగుడిలోన నిలుచుగాక !*

*లలితా సంప్రదాయంలోని సిద్ధులతో ఉన్న కొన్ని పూర్వానుబంధాలు అప్పుడప్పుడు ప్రకాశిస్తున్నవి. కాశీలో గంగాతీరంలోని అక్కడి లలితాదేవిలో లలిత కోమల లక్షణాల కంటె తీవ్ర లక్షణాలే ఎక్కువగా కనిపించి పరశంభుదేవుడు దైత్యసంహారానికి ఆమెను పిలిచిన పిలుపుగుర్తుకు వచ్చింది.*

*శ్లో॥ లోకసంహార రసికే కాళికే భద్రకాళికే లలితాపరమేశాని సంవిద్వహ్నే స్సముద్భవ (బ్రహ్మాండపురాణము)*

*( సశేషం )*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శివ సూత్రములు - 270 / Siva Sutras - 270 🌹*
*🍀. శివ ఆగమ తత్వశాస్త్రం యొక్క సూత్రములు 🍀*
*3వ భాగం - ఆణవోపాయ*
*✍️. ప్రసాద్‌ భరధ్వాజ*

*🌻 🌻 3 - 44. నాసికాంతర్ మధ్య సంయమాత్ కిమాత్ర సవ్యపసవ్య సౌసుమ్నేసు - 2 🌻*

*🌴. ఎడమ, కుడి మరియు మధ్య నాడిలలో ప్రాణ శక్తి మధ్యలో సమ్యమా లేదా నియంత్రణ చేసిన తర్వాత, ఇంకా ఏమి చేయాలి? 🌴*

*ప్రాణం ఏ నాడి నుండి ప్రయాణించినా సరే, దానితో సంబంధం లేకుండా, యోగి తన అవగాహనను చెదరడానికి ఎప్పుడూ అనుమతించడు. యోగి, అనుభవం ద్వారా తన ప్రాణాన్ని తన ఇష్టానుసారం నడిపించడం నేర్చుకున్నాడు. అతను తన ఉద్దేశ్య అవగాహన ద్వారా దీనిని సాధించాడు. అతని శ్వాస సాధన ద్వారా కాదు. అతని ప్రాణం అతనిచే నియంత్రించ బడుతుంది. మరో మాటలో చెప్పాలంటే, అతను తన జీవిత శక్తిని తన స్వంత ఇష్టానుసారం నిర్దేశిస్తాడు. అతడు ఇప్పుడు భగవంతుని అత్యున్నత శక్తిని పొందుతున్నాడు. అతను ఎల్లవేళలా భగవంతునితో అనుసంధానించబడి ఉండటం వలన అతనికి ఇది సాధ్యం అవుతుంది.*

*కొనసాగుతుంది...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Siva Sutras  - 270 🌹*
*🍀Aphorisms of philosophy of Shiva āgama 🍀*
*Part 3 - āṇavopāya*
*✍️. Acharya Ravi Sarma, 📚. Prasad Bharadwaj*

*🌻 3 - 44. nāsikāntar madhya samyamāt kimatra savyāpasavya sausumnesu - 2 🌻*

*🌴. After doing samyama or control on the middle of the prana shakti in the left, right and middle nadis, what else should be done? 🌴*

*Irrespective of the channel through which prāṇa traverses, the yogi never allows his awareness to get distracted. The yogi, by experience has learnt to direct his prāṇa at his own will. He accomplishes this by his intent awareness and not by his breathing. His prāṇa is controlled by him. In other words, he directs his life energy at his own will. He now attains the supreme power of the Lord. This happens to him because he stays connected to the Lord at all times.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment