🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 552 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 3 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 112. విమర్శరూపిణీ, విద్యా, వియదాది జగత్ప్రసూః ।
సర్వవ్యాధి ప్రశమనీ, సర్వమృత్యు నివారిణీ ॥ 112 ॥ 🍀
🌻 552. 'సర్వమృత్యు నివారిణీ' - 3 🌻
ఉత్తరాయణ దక్షిణాయనములు, కృష్ణ శుక్ల పక్షములు, తిథులు, నక్షత్రములు వీని ననుసరించి కూడ అకాల మృత్యువును నిర్ధారణ చేయుదురు. అశుభ సమయములలో దేహము విడిచినపుడు, ఆ దేహియు మరియు ఆ కుటుంబము వారు చాల కష్టనష్టములకు గురి అగుదురు. పై తెలిపిన రెండునూ గాక మృత్యువు అనునది అజ్ఞాన కారణము. మృత్యువు స్వరూప స్వభావములు నెఱిగి స్వచ్చందముగా దేహమును విడచుట వేరు, దేహమున బంధింపబడి భయముతో, బాధతో, వేదనలతో అపస్మారక స్థితిలో మరణించుట వేరు. ఇందు రెండవ సంఘటనను మరణించుట లేక చచ్చుట అందురు. మొదటి విధానమును దేహమును త్యజించుట, పరిత్యజించుట, విడచుట అందురు.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 552 - 3 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 112. Vimarsharupini vidya viyadadi jagatprasuh
sarvavyadhi prashamani sarvamrutyu nivarini ॥112 ॥ 🌻
🌻 552. 'Sarvamrutyu Nivarini' - 3 🌻
Uttarayana Dakshinayanams, Krishna Shukla Pakshas, Tithi and Nakshatra these also determine premature death. When the body leaves during inauspicious times, the body and the family suffer great losses. Apart from the above, ignorance is the cause of death. It is one thing to leave the body voluntarily while knowing the nature of death, and another to die in an unconscious state with fear, pain and agony while bound to the body. The second event is death. The first method is to renounce, relinquish or separate the body.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment