1) 🌹 శివ సూత్రాలు 002 - 1.2. జ్ఞానం బంధః 🌹
🌻 "పరిమిత జ్ఞానం బంధనాన్ని సృష్టిస్తుంది." 🌻
2) 🌹 Shiva Sutras - 002 - 1.2. Jnanam Bandhaḥ 🌹
"Limited knowledge creates bondage."
3) 🌹 शिव सूत्र 002 - 1.2. ज्ञानं बंधः 🌹
🌻 "सीमित ज्ञान बंधन को उत्पन्न करता है।" 🌻
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 560 / Bhagavad-Gita - 560 🌹
🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 10 / Chapter 15 - Purushothama Yoga - 10 🌴
5) 🌹 సిద్దేశ్వరయానం - 118 🌹
🏵 భైరవసాధన 🏵
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 553 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 553 - 2 🌹
🌻 553. ‘అగ్రగణ్యా’ - 2 / 553. 'Agraganya' - 2 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 శివ సూత్రాలు 002 - 1.2. జ్ఞానం బంధః 🌹*
*🌻 "పరిమిత జ్ఞానం బంధనాన్ని సృష్టిస్తుంది." 🌻*
https://youtu.be/Y-bcBk-_x8M
*✍️. ప్రసాద్ భరధ్వాజ*
*ఈ వీడియోలో, శివ సూత్రాల శాంభవోపాయ విభాగం నుండి రెండవ సూత్రం "జ్ఞానమ్ బంధః" గురించి తెలుసుకుంటాము, దీని అర్థం "పరిమిత జ్ఞానం బంధనాన్ని సృష్టిస్తుంది." ఈ సూత్రం, మనం లోకజ్ఞానానికి బంధించబడటం మరియు పరమజ్ఞానం ద్వారా విముక్తి పొందడం మధ్య తేడాను వివరిస్తుంది. మాయ అనే అజ్ఞానం మనల్ని సంసారంలో ఎలా ఇరుక్కుపోయేలా చేస్తుందో, ఆధ్యాత్మిక జ్ఞానం, అంతర్గత అన్వేషణ ద్వారా పొందిన జ్ఞానం, మనలను ఈ బంధనంలో నుండి ఎలా విముక్తం చేస్తుందో తెలుసుకోండి.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Shiva Sutras - 002 - 1.2. Jnanam Bandhaḥ 🌹*
*"Limited knowledge creates bondage."*
https://youtu.be/YvKzoVmWReA
*✍️.Prasad Bharadwaj*
*In this video, we explore the second sutra from the Shiva Sutras' Sāmbhavopāya section: "Jñānam Bandhaḥ," which means "Limited knowledge creates bondage." This sutra delves into the distinction between sensory knowledge, which binds us to the material world, and supreme knowledge, which leads to liberation. Learn how ignorance ("mala") keeps us trapped in the cycle of saṁsārā and how spiritual knowledge, gained through inner exploration, can free us from this bondage and lead to self-realization.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 शिव सूत्र 002 - 1.2. ज्ञानं बंधः 🌹*
*🌻 "सीमित ज्ञान बंधन को उत्पन्न करता है।" 🌻*
https://youtu.be/p1t5sF_h03s
*✍️. प्रसाद भारद्वाज.*
*इस वीडियो में, हम शिव सूत्रों के सांभवोपाय खंड से दूसरे सूत्र "ज्ञानं बंधः" का अध्ययन करते हैं, जिसका अर्थ है "परिमित ज्ञान बंधन को उत्पन्न करता है।" यह सूत्र हमें लोक-ज्ञान और परम ज्ञान के बीच के अंतर को समझाता है, जिसमें माया के अज्ञान से हम संसार में कैसे फंसे रहते हैं और आत्मिक ज्ञान और आंतरिक अन्वेषण के माध्यम से कैसे मुक्त हो सकते हैं।*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 560 / Bhagavad-Gita - 560 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 15వ అధ్యాయము - పురుషోత్తమ యోగము - 09 🌴*
*09. శ్రోత్రం చక్షు: స్పర్శనం చ రసనం ఘ్రాణేమేవ చ |*
*అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే ||*
*🌷. తాత్పర్యం : ఈ విధముగా జీవుడు వేరొక స్థూలదేహమును గ్రహించి మనస్సుతో కూడియున్న ఒకానొక రకమైన కర్ణములు, నయనములు, జిహ్వ, నాసిక, స్పర్శను పొందును. ఆ విధముగా అతడు ఒక ప్రత్యేక రకమగు ఇంద్రియార్థములను అనుభవించును.*
*🌷. భాష్యము : మరొక రీతిలో చెప్పవలెనన్న జీవుడు తన చైతన్యమును శునక, మార్జాల గుణములతో కలుషిత మొనర్చుకొనినచో తదుపరి జన్మమున అతడు ఎట్టి దేహమును పొందుననిగాని లేదా ఎందులకై ఒక ప్రత్యేక దేహమున అతడు వసించియున్నాడని ఎరుగలేరు. అందులకై ఆధ్యాత్మికగురువు నుండి శ్రవణము చేసి అవగతము చేసికొనిన భగవద్గీత మరియు తత్సదృశ వాజ్మయపు విశిష్టజ్ఞానము అత్యంత అవసరము. ఈ విషయములను అవగాహన చేసికొనుతను అభ్యసించువాడు నిక్కముగా భాగ్యవంతుడు. జీవుడు వివిధపరిస్థితులలో దేహమును త్యాగము చేయుచుండును. వివిధ పరిస్థితులలో జీవించుచుండును. అదే విధముగా గుణప్రభావమున కొన్ని పరిస్థితుల యందు భోగించుచుండును. అట్టి భోగభ్రాంతి యందే అతడు పలువిధములైన సుఖదుఃఖములను అనుభవించు చుండును.*
*కామము మరియు కోరికచే శాశ్వతముగా మోసగింపబడినవారు తమ దేహమార్పు విషయమున గాని, ప్రస్తుత దేహమున ఎందులకై వసించియున్నామని గాని అవగాహన చేసికొనగలిగే శక్తి నశించియుందురు. వారి దానిని అర్థము చేసికొనజాలరు. కాని ఆధ్యాత్మికజ్ఞానమును అలవరచుకొనినవారు జీవాత్మ దేహముకన్నను అన్యమైనదనియు, అది దేహములను మార్చుచు పలురీతుల భోగించుచున్నదనియు గాంచగలరు. అట్టి జ్ఞానము కలవాడు ఎట్లు బద్ధజీవుడు ఈ భౌతికజగమున దుఃఖము ననుభవించునో అవగాహన చేసికొనగలడు. జనసామాన్యపు బద్ధజీవనము మిక్కిలి క్లేశకరమైనందునే కృష్ణభక్తిభావన యందు పురోగతి నొందినవారు తమ శక్తి కొలది ఈ జ్ఞానమును వారికి అందింప యత్నింతురు. కావున జనులు బద్ధజీవనము నుండి వెలుపలికి వచ్చి, కృష్ణభక్తిరసభావితులై, ఆధ్యాత్మికలోకమును చేరుటకు తమను తాము ముక్తులను కావించుకొనవలెను.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 560 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 15 - Purushothama Yoga - 09 🌴*
*09. śrotraṁ cakṣuḥ sparśanaṁ ca rasanaṁ ghrāṇam eva ca*
*adhiṣṭhāya manaś cāyaṁ viṣayān upasevate*
*🌷 Translation : The living entity, thus taking another gross body, obtains a certain type of ear, eye, tongue, nose and sense of touch, which are grouped about the mind. He thus enjoys a particular set of sense objects.*
*🌹 Purport : In other words, if the living entity adulterates his consciousness with the qualities of cats and dogs, in his next life he gets a cat or dog body and enjoys. Consciousness is originally pure, like water. But if we mix water with a certain color, it changes. Similarly, consciousness is pure, for the spirit soul is pure. But consciousness is changed according to the association of the material qualities. Real consciousness is Kṛṣṇa consciousness. When, therefore, one is situated in Kṛṣṇa consciousness, he is in his pure life.*
*But if his consciousness is adulterated by some type of material mentality, in the next life he gets a corresponding body. He does not necessarily get a human body again; he can get the body of a cat, dog, hog, demigod or one of many other forms, for there are 8,400,000 species.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 553 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 553 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*
*🌻 553. ‘అగ్రగణ్యా’ - 2 🌻*
*శ్రీమాతను ప్రధానము అని కూడ అందురు. ఆమెయే ప్రధాన కారణము. శ్రీమాతతోనే కథ ప్రారంభము, శ్రీమాతతోనే కథ అంతము అగును. సృష్టి కథకు మొదలు చివర కూడ ఆమెయే. ఓంకారము ఆదిత్య వర్ణము. అంకెలలో పూర్ణము. కాలము, ప్రకృతి యిత్యాది వన్నియూ ఆమె సంకల్పము నుండి దిగివచ్చినవే. కావుననే ఆమెను కాల స్వరూపిణి యని, ప్రకృతి స్వరూపిణి యని, ఓంకార రూపిణి యని, పూర్ణయని, అదితి యని ప్రశంసింతుము. ముందుగా గుర్తింపదగినది గనుక 'అగ్రగణ్యా' అని ఈ నామమున శ్రీమాతను ప్రశంసించుట జరిగినది.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 553 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini*
*katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻*
*🌻 553. 'Agraganya' - 2 🌻*
*They also say that Srimata is the most significant. She is the fundamental reason. The story of creation begins with Srimata and ends with Srimata. She is the beginning and the end of the story of creation. Omkara is Aditya Varna. Whole number in digits. Time, nature, etc. all come from her will. Therefore praise her as the form of time, the form of nature, the form of Omkara, Complete and Boundless. She is the first to be noted and hence Srimata was praised by the name 'Agraganya'.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 సిద్దేశ్వరయానం - 118 🌹*
*💐 శ్రీ సిద్దేశ్వరానంద భారతీ స్వామి విరచిత 💐*
*🏵 భైరవసాధన 🏵*
*బృందావనేశ్వరి -రాధాదేవి, సిద్ధశక్తి స్వరూపిణి - కాళీదేవి, పీఠాధిదేవత * లలితాదేవి. జీవితంలో ప్రధాన స్థానం ఆక్రమించుకొని ఉండగా పర్వతాగ్రం నుండి జలపాతం దూకినట్లుగా నాలోకి భైరవుడు ప్రవేశించాడు. అభౌమ భూమికల నుండి కాలభైరవ మంత్రోపదేశం జరిగింది. కాశీ వెళ్ళి అక్కడ ఈ మంత్రసాధన చేయాలన్న వాంఛ ప్రబలమైంది. అంతకుముందు కాశీకి తల్లిదండ్రుల అస్థి నిమజ్జనం కోసం ఒకసారి వెళ్ళటం జరిగింది. ఇప్పుడు పీఠాధిపతిగా సపరివారంగా సుమారు వందమందితో వారణాసి చేరుకొన్నాము. వెళ్ళిన రెండురోజులకు నాతో వచ్చిన ముగ్గురికి మరణగండం ఉందని కాలభైరవుడు తెలియచేశాడు. ఆ ముగ్గురు నాకు అత్యంత సన్నిహితులు. వారిని రక్షించమని ప్రార్థించాను. ఆ రోజు రాత్రి కాలభైరవ మంత్రాన్ని జపం చేశాను. నాతో వచ్చినవారిలో ఒకరికి పక్షపాతం వచ్చింది. తాత్కాలికంగా వైద్యసేవ చేయించి ఆసుపత్రిలో చేర్చటం జరిగింది. తలలో రక్తప్రసారానికి ఏదో ఆటంకం కల్గిందని, కపాలానికి రంధ్రం చేసి శస్త్ర చికిత్స చేశారు. రెండు రోజులలో అతడు మామూలు మనిషి అయినాడు. ఇప్పుడతడు అవసరమైనప్పుడల్లా కాలభైరవునికి మ్రొక్కు కొంటున్నాడు. అతని కష్టం తీరుతున్నది. నాతోపాటు ప్రతిసారి కాశీ వచ్చి కాలభైరవునకు మ్రొక్కు చెల్లించుకొంటున్నాడు.*
*మరొకరి విషయంలో భైరవుడు బస్సు ప్రమాదాన్ని సూచించాడు. మరునాడు వీరు మరికొందరు బస్సులో గయ బయలుదేరుతున్నారు. నేను మొదట్లో వెడదామని అనుకోలేదు. కానీ ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. భైరవాలయానికి వెళ్ళి నమస్కరించాను. అర్చకులు నల్లని పూలమాల ఇచ్చారు. స్వామికి దేవా ! వీరికి ప్రమాదం తప్పాలి. నేను కూడా ఆ బస్సులో వెడుతున్నాను. ఆ పైన నీ దయ అని విన్నవించి ఆ పుష్పమాలతో నేను కూడా వెళ్ళి బస్ కూర్చున్నాను. ఎర్రని కన్నుల భైరవుని నల్లని నవ్వు నెమ్మదిగా వెన్నెలలాగా తెల్లగా మారటం కన్పిస్తున్నది. బస్సుకు ఏ ప్రమాదమూ జరుగలేదు. ఈ మధ్య బృందావనంలో కూడా ఒక విచిత్రం జరిగింది. రాధాకృష్ణుల చిత్రపటం ఎదురుగా ఉన్నది. ఆ రోజు ననాతన గోస్వామి పూజించిన మదనగోపాలునిఆలయానికి వెళ్ళటం అక్కడి మహంతు సుపరిచితుడు కావటం వల్ల దేవతలకు అలంకరించిన ఒక పూలమాలను ఇవ్వటం, నా మామూలు పద్ధతిలో దానిని ధరించి జపం చేయటం జరుగుతున్నది. శ్యామల కోమల దేహంతో మురళీధరుడు వచ్చి నించొన్నాడు. రాధాదేవి దూరం నుంచి నెమ్మదిగా వస్తున్నట్లు అనిపిస్తున్నది. ఇంతలో శ్వానసహితుడై భైరవుడు వచ్చాడు. ఆశ్చర్యం ! రాధాదేవి నుండి గౌరకాంతి కిరణాలు ప్రసరిస్తుంటే భైరవుడు, శునకము రెండూ తెల్లగా మారి ప్రసన్నాకృతి ధరించటం జరిగింది. బృందావనధామానికి అధీశ్వరి అయిన రాధాదేవి సామ్రాజ్యంలోకి నా మీది ప్రేమతో అడుగు పెట్టిన భైరవుడు కూడా ఆమె ప్రభావం వల్ల ధవళసాత్వికమూర్తిగా మారాడు.*
*భైరవుడు చాలామందికి జరగబోయే ఆపదలను ముందు తెలియచేస్తున్నాడు. ఒకసారి నేను నెల్లూరులో భాగవతసప్తాహ ప్రవచనాలు చేస్తున్నాను. నా బాల్య మిత్రుడొకడు మంచి రచయిత. నాకు తన గ్రంథము నొకదానిని అంకితం చేశాడు కూడా. భైరవుడు ఒక రోజు కనిపించి 'అతనికి మృత్యువు రాబోతున్నది' అన్నాడు. రక్షించమని అడగబోతున్నాను ఇంతలోనే నవ్వుతూ “అతని ఆయువు అయిపోయింది. మరణం తప్పదు. నీకు మిత్రుడు కనుక ముందు తెలియచేశాను" అని అదృశ్యమైనాడు. కొద్ది రోజులకే నిర్దిష్ట సమయానికి ఆ మిత్రుడు మరణించాడు. అతని కుమారుని విషయంలోనూ ఇటువంటిదే ఒక చిత్రం జరగింది. అతనికి ముగ్గురు కుమారులు. మధ్యవాడు పెరిగి పెద్దవాడవుతుండగా పోలియోనో లేక పక్షవాతమో వచ్చి వికలాంగు డయినాడు. అన్నీ మంచంలోనే. అతనిని బాగు చేయమని స్నేహితుడర్థించాడు. ఆశ్రమంలో ఆ బాలుని కోసం హోమం చేయించాను. ఆనాటి రాత్రి అతని సూక్ష్మదేహం కనిపించి “నా కోసం ఏ మంత్ర ప్రయోగములు హోమములు చేయించవద్దు. నేను పూర్వజన్మలో ఒక యోగిని. చేసిన కొంత దుష్కృతం ఇంకా అనుభవించవలసి ఉన్నది. దానికోసం జన్మ ఎత్తాను. ఆ మిగిలిన కర్మ ఈ వ్యాధి రూపంలో అనుభవించి త్వరలో నేను వెళ్ళిపోతాను. ఆ తరువాత నాకు మళ్ళీ మంచి జన్మవచ్చి తపస్సాధన చేస్తాను” అని చెప్పింది. అనంతరం కొద్దిరోజులకే అతడు మరణించాడు. జీవుల ప్రయాణంలో జరిగే ఇటువంటి చిత్రవిచిత్రాలను భైరవుడు తెలియ చేస్తున్నాడు.*
*( సశేషం )*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj
No comments:
Post a Comment