శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 553 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 553 - 2


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 553 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 553 - 2 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀

🌻 553. ‘అగ్రగణ్యా’ - 2 🌻

శ్రీమాతను ప్రధానము అని కూడ అందురు. ఆమెయే ప్రధాన కారణము. శ్రీమాతతోనే కథ ప్రారంభము, శ్రీమాతతోనే కథ అంతము అగును. సృష్టి కథకు మొదలు చివర కూడ ఆమెయే. ఓంకారము ఆదిత్య వర్ణము. అంకెలలో పూర్ణము. కాలము, ప్రకృతి యిత్యాది వన్నియూ ఆమె సంకల్పము నుండి దిగివచ్చినవే. కావుననే ఆమెను కాల స్వరూపిణి యని, ప్రకృతి స్వరూపిణి యని, ఓంకార రూపిణి యని, పూర్ణయని, అదితి యని ప్రశంసింతుము. ముందుగా గుర్తింపదగినది గనుక 'అగ్రగణ్యా' అని ఈ నామమున శ్రీమాతను ప్రశంసించుట జరిగినది.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 553 - 2 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 113. Agraganya chintyarupa kalikalmashanashini
katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻

🌻 553. 'Agraganya' - 2 🌻


They also say that Srimata is the most significant. She is the fundamental reason. The story of creation begins with Srimata and ends with Srimata. She is the beginning and the end of the story of creation. Omkara is Aditya Varna. Whole number in digits. Time, nature, etc. all come from her will. Therefore praise her as the form of time, the form of nature, the form of Omkara, Complete and Boundless. She is the first to be noted and hence Srimata was praised by the name 'Agraganya'.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment