1) 🌹 పాపాలు తొలగడానికి శరణాగతియే మందు - పాప విముక్తికి మార్గం 🌹
2) 🌹 Surrender is the Remedy for Removing Sins - The Path to Liberation from Sin 🌹
3) 🌹 पापों को दूर करने के लिए शरणागति ही उपाय है - पाप विमुक्ति का मार्ग 🌹
1) 🌹. శ్రీమద్భగవద్గీత - 575 / Bhagavad-Gita - 575 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 4 / Chapter 16 - The Divine and Demoniac Natures - 4 🌴
2) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 972 / Vishnu Sahasranama Contemplation - 972 🌹
🌻 972. యజ్ఞపతిః, यज्ञपतिः, Yajñapatiḥ 🌻
3) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 557 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 557 - 3 🌹
🌻 557. 'కాలహంత్రీ' - 3 / 557. 'Kalahantree' - 3 🌻
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 పాపాలు తొలగడానికి శరణాగతియే మందు - పాప విముక్తికి మార్గం 🌹*
*ప్రసాద్ భరద్వాజ*
*ఈ వీడియోలో శరణాగతియే పాప విముక్తికి మార్గంగా వివరించ బడింది. లోక సంబంధమైన పేరుప్రతిష్ఠ, ధనార్జన వంటి విషయాలు స్థిరంగా ఉండవని, పాపాలు తొలగడానికి భగవంతుని పట్ల భక్తి, శరణాగతి అవసరమని చర్చించబడింది. ఆత్మనివేదన ద్వారా, భగవంతుని చింతన, నామస్మరణ మరియు పుణ్యకథా శ్రవణం ద్వారా మనస్సు పవిత్రం అవుతుందని వివరించ బడింది.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 Surrender is the Remedy for Removing Sins - The Path to Liberation from Sin 🌹*
*Prasad Bharadwaj*
*This video explains how surrender is the way to liberation from sins. It discusses that worldly fame, prestige, and wealth are not permanent, and devotion and surrender to God are essential to remove sins. It elaborates that through self-surrender, meditation on God, chanting His name, and listening to sacred stories, the mind becomes purified.*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹 पापों को दूर करने के लिए शरणागति ही उपाय है - पाप विमुक्ति का मार्ग 🌹*
*प्रसाद भारद्वाज*
*इस वीडियो में बताया गया है कि शरणागति ही पाप विमुक्ति का मार्ग है। इसमें चर्चा की गई है कि सांसारिक प्रसिद्धि, प्रतिष्ठा, और धन स्थायी नहीं होते, और पापों को दूर करने के लिए भगवान के प्रति भक्ति और शरणागति आवश्यक है। आत्म-समर्पण के माध्यम से, भगवान का ध्यान, नामस्मरण, और पवित्र कथाओं के श्रवण द्वारा मन शुद्ध हो जाता है।*
🌹🌹🌹🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీమద్భగవద్గీత - 575 / Bhagavad-Gita - 575 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*
*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 4 🌴*
*04. దమ్భో దర్పోభిమానశ్చ క్రోధ: పారుష్యమేవ చ |*
*అజ్ఞానం చాభిజాతస్య పార్థ సమ్పదమాసురీమ్ ||*
*🌷. తాత్పర్యం : ఓ పార్థా! గర్వము, పొగరు, దురహంకారము, కోపము, పరుషత్వము, అజ్ఞానములనెడి లక్షణములు ఆసురస్వభావము కలిగినవారికి చెందినవి.*
*🌷. భాష్యము : నరకమునకు రాజమార్గము ఈ శ్లోకమున వివరింపబడినది. దానవప్రవృత్తి గలవారు తాము నియమములను పాటింపకున్నను ధర్మప్రవర్తనమును, ఆధ్యాత్మికజ్ఞాన పురోగతియును ప్రదర్శనమును మాత్రము గావింతురు. ఏదియో ఒక విద్యను లేదా అధికధనమును కలిగియున్న కారణమున వారు పొగరును, గర్వమును కలిగియుందురు. ఇతరులచే పూజింప బడవలెననియు భావింతురు. గౌరవింప బడుటకు అర్హులు కాకున్నను ఇతరులచే గౌరవము నొందగోరుదురు. అల్ప విషయముల గూర్చియు వారు క్రోధముచెంది పరుషముగా మాట్లాడుదురు. మృదువుగా వారెన్నడును పలుకరు.*
*ఏది చేయదగినదో ఏది చేయరానిదో వారెరుగలేరు. ఎవ్వరి ప్రామాణికత్వమును స్వీకరింపక వారు ప్రతిదియు తమ కోరిక ననుసరించి చపలముగా నొనర్తురు. ఈ ఆసురీలక్షణములను వారు తల్లిగర్భమున ఉన్న సమయము నుండియే గ్రహించియుందురు. పెరిగి పెద్దయైన కొలది వారు ఆ అశుభగుణములను ప్రదర్శించుట నారంభింతురు.*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Bhagavad-Gita as It is - 575 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*
*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 04 🌴*
*04. dambho darpo ’bhimānaś ca krodhaḥ pāruṣyam eva ca*
*ajñānaṁ cābhijātasya pārtha sampadam āsurīm*
*🌷 Translation : Pride, arrogance, conceit, anger, harshness and ignorance – these qualities belong to those of demoniac nature, O son of Pṛthā.*
*🌹 Purport : In this verse, the royal road to hell is described. The demoniac want to make a show of religion and advancement in spiritual science, although they do not follow the principles. They are always arrogant or proud in possessing some type of education or so much wealth. They desire to be worshiped by others, and demand respectability, although they do not command respect. Over trifles they become very angry and speak harshly, not gently.*
*They do not know what should be done and what should not be done. They do everything whimsically, according to their own desire, and they do not recognize any authority. These demoniac qualities are taken on by them from the beginning of their bodies in the wombs of their mothers, and as they grow they manifest all these inauspicious qualities.*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 972 / Vishnu Sahasranama Contemplation - 972 🌹*
*🌻 972. యజ్ఞపతిః, यज्ञपतिः, Yajñapatiḥ 🌻*
*ఓం యజ్ఞపతయే నమః | ॐ यज्ञपतये नमः | OM Yajñapataye namaḥ*
*యజ్ఞానాం రక్షకః స్వామీ వా యజ్ఞపతిరుచ్యతే*
*యజ్ఞములను, యజ్ఞములలో సమర్పించు హవిస్సులను రక్షించువాడు. యజ్ఞమునకు ప్రభువు.*
:: శ్రీమద్భగవద్గీత - రాజవిద్యా రాజగుహ్య యోగము ::
అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ ।
న తు మామభిజానన్తి తత్త్వేనాతశ్చ్యవన్తి తే ॥ 24 ॥
*సమస్త యజ్ఞములకు భోక్తను, ప్రభువును నేనే అయియున్నాను. అట్టి నన్ను - వారు యథార్థముగ తెలిసికొనుటలేదు. ఇందువలన జారిపోవుచు పునర్జన్మను పొందుచున్నారు.*
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 972 🌹*
*🌻972. Yajñapatiḥ🌻*
*OM Yajñapataye namaḥ*
*यज्ञानां रक्षकः स्वामी वा यज्ञपतिरुच्यते / Yajñānāṃ rakṣakaḥ svāmī vā yajñapatirucyate*
*The protector of Yajña - vedic sacrificial rituals and of the sacrifice or the Lord of it.*
:: श्रीमद्भगवद्गीत - राजविद्या राजगुह्य योग ::
अहं हि सर्वयज्ञानां भोक्ता च प्रभुरेव च ।
न तु मामभिजानन्ति तत्त्वेनातश्च्यवन्ति ते ॥ २४ ॥
Śrīmad Bhagavad Gīta - Chapter 9
Ahaṃ hi sarvayajñānāṃ bhoktā ca prabhureva ca,
Na tu māmabhijānanti tattvenātaścyavanti te. 24.
*I indeed am the enjoyer as also the Lord of all sacrifices; but they do not know Me in reality. Therefore they fall.*
🌻 🌻 🌻 🌻 🌻
Source Sloka
भूर्भुवस्स्वस्तरुस्तारस्सविता प्रपितामहः ।यज्ञो यज्ञपतिर्यज्वायज्ञाङ्गोयज्ञवाहनः ॥ १०४ ॥
భూర్భువస్స్వస్తరుస్తారస్సవితా ప్రపితామహః ।యజ్ఞో యజ్ఞపతిర్యజ్వాయజ్ఞాఙ్గోయజ్ఞవాహనః ॥ 104 ॥
Bhūrbhuvassvastarustārassavitā prapitāmahaḥ,Yajño yajñapatiryajvāyajñāṅgoyajñavāhanaḥ ॥ 104 ॥
Continues....
🌹 🌹 🌹 🌹🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 557 - 3 / Sri Lalitha Chaitanya Vijnanam - 557 - 3 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁*
*🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।*
*కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀*
*🌻 557. 'కాలహంత్రీ' - 3 🌻*
*కాత్యాయనీ నామము వెనువెంటనే 'కాలహంత్రీ' నామము పేర్కొనబడినది. దేహము నందు మృత్యువు కలుగకుండా కాత్యాయనీ దేవి రక్షింపగలదు. కటి భాగము సడలినపుడు మృత్యువున కవకాశము మిక్కుటముగ యేర్పడును. కటి భాగమున కధిష్ఠాన దేవతగా నున్న కాత్యాయనీ దేవిని స్మరించుట వలన దేహమునందు మృత్యువు కలుగక జీవుడు ఉద్దరింప బడును.*
*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹
*🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 557 - 3 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi*
*✍️ Prasad Bharadwaj*
*🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini*
*katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻*
*🌻 557. 'Kalahantree' - 3 🌻*
*The name "Kalahantree" is mentioned right after the name "Katyayani." Katyayani Devi can protect from death, ensuring that death does not occur within the body. When the waist area becomes weak, the chances of death increase. By chanting on Katyayani Devi, who presides over the waist area, one can be protected from death and attain liberation.*
*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages
Join and Share
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj
No comments:
Post a Comment