శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 558 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 1


🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 558 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 1 🌹

🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻

✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్

సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁

🍀 అగ్రగణ్యా,ఽచింత్యరూపా, కలికల్మష నాశినీ ।
కాత్యాయినీ, కాలహంత్రీ, కమలాక్ష నిషేవితా ॥ 113 ॥ 🍀

🌻 558. 'కమలాక్ష నిషేవితా’ - 1 🌻

కమలాక్షునిచే నిత్యమూ సేవింపబడునది శ్రీమాత అని అర్థము. కమలాక్షు డనగా విష్ణువు. త్రిమూర్తులలో ఒకడైన విష్ణువు నిత్యమూ శ్రీమాత నర్చించి, ఆమెతో సారూప్యము పొందెను. శ్రీమాత ఇంద్రనీలమయమైన తత్త్వము. ఆమె నారాధించుచూ విష్ణువు కూడ యింద్రనీల ఛాయను పొందెను. ఆమెతో సారూప్యము చెందెను. అందువలననే శ్రీమాతతో సరిపోలు సౌందర్యము, ఆకర్షణము, శక్తి సంపన్నత, సౌకుమార్యము కలిగెను. తనకును శ్రీమాతకును అభేద స్థితిని పొందెను. అందువలన విష్ణుపూజ శ్రీమాతకే చెందును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹




🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 558 - 1 🌹

Contemplation of 1000 Names of Sri Lalitha Devi

✍️ Prasad Bharadwaj

🌻 113. Agraganya chintyarupa kalikalmasha nashini
katyayani kalahantri kamalaksha nishevita ॥113 ॥ 🌻

🌻 558. 'kamalaksha nishevita' - 1 🌻


The meaning of this title is that Sri Mata is constantly worshiped by Kamalaksha, who is Lord Vishnu. Among the Trimurti, Vishnu is eternally devoted to Sri Mata and has achieved a form that resembles hers. Sri Mata embodies the principle of indra-neela (a deep blue gem). By worshiping her, Vishnu also attained the hue of indra-neela and became similar to her. As a result, he gained beauty, attraction, power, and delicacy that matched Sri Mata's divine qualities, achieving a state of non-duality with her. Therefore, the worship offered to Vishnu is actually directed toward Sri Mata.


Continues...

🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment