శ్రీమద్భగవద్గీత - 576: 16వ అధ్., శ్లో 05 / Bhagavad-Gita - 576: Chap. 16, Ver. 05

 

🌹. శ్రీమద్భగవద్గీత - 576 / Bhagavad-Gita - 576 🌹

✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ

🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 5 🌴

05. దైవీ సమ్పద్ విమోక్షాయ నిబన్ధాయాసురీ మతా |
మా శుచ: సమ్పదం దైవీమభిజాతోసి పాణ్డవ ||

🌷. తాత్పర్యం : దైవీగుణములు మోక్షమునకు అనుకూలములై యుండగా అసురగుణములు బంధకారకములగుచున్నవి. ఓ పాండుపుత్రా! నీవు దైవీ గుణములతో జన్మించి యున్నందున శోకింపకుము.

🌷. భాష్యము : అర్జునుడు అసురగుణములను కూడి జన్మింపలేదని పలుకుచు శ్రీకృష్ణభగవానుడు అతనిని ఉత్సాహపరచుచున్నాడు. యుద్ధము యొక్క మంచిచెడ్డలను ఆలోచించుచుండుటచే అర్జునుడు యుద్ధమునందు పాల్గొనుట ఎన్నడును ఆసురీ స్వభావము కాబోదు. భీష్మ, ద్రోణాది గౌరవనీయ పురుషులు వధార్హులా, కాదా యని చింతించు చుండుటను బట్టి అతడు క్రోధము, మిథ్యాహంకారము, పరుషత్వముల ప్రభావమునకు లోనుకాలేదని తెలియుచున్నది. కనుక అర్జునుడు ఆసురీలక్షణములకు చెందినవాడు కాడు.

వాస్తవమునకు క్షత్రియుడైనవానికి శత్రువుపై బాణములను గుప్పించుటయే దైవీస్వభావము. అట్టి ధర్మము నుండి విరమించుటయే అసురస్వభావము కాగలదు. కనుక అర్జునిని శోకమునకు ఎట్టి కారణము లేదు. వర్ణాశ్రమ నియమములను యథావిధిగా పాటించువాడు సదా దైవీస్థితి యందే నెలకొని యుండును.

🌹 🌹 🌹 🌹 🌹



🌹 Bhagavad-Gita as It is - 576 🌹

✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj

🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 05 🌴

05. daivī sampad vimokṣāya nibandhāyāsurī matā
mā śucaḥ sampadaṁ daivīm abhijāto ’si pāṇḍava


🌷 Translation : The transcendental qualities are conducive to liberation, whereas the demoniac qualities make for bondage. Do not worry, O son of Pāṇḍu, for you are born with the divine qualities.

🌹 Purport : Lord Kṛṣṇa encouraged Arjuna by telling him that he was not born with demoniac qualities. His involvement in the fight was not demoniac, because he was considering the pros and cons. He was considering whether respectable persons such as Bhīṣma and Droṇa should be killed or not, so he was not acting under the influence of anger, false prestige or harshness.

Therefore he was not of the quality of the demons. For a kṣatriya, a military man, shooting arrows at the enemy is considered transcendental, and refraining from such a duty is demoniac. Therefore there was no cause for Arjuna to lament. Anyone who performs the regulative principles of the different orders of life is transcendentally situated.

🌹 🌹 🌹 🌹 🌹


No comments:

Post a Comment