🌹 14 SEPTEMBER 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹

🍀🌹 14 SEPTEMBER 2024 SATURDAY ALL MESSAGES శనివారం, స్థిర వాసర సందేశాలు🌹🍀
1) 🌹 చైతన్య బీజాలు - 1వ భాగం - దృష్టిని బాహ్య, తాత్కాలిక విషయాల నుండి అంతర్గత, శాశ్వతమైన వాటికి మార్చడమే నిజమైన ఆత్మ సాధన. 🌹
2) 🌹 Seeds of Consciousness - Part 1 - True spiritual practice is about shifting our focus from external, temporary things to internal, eternal realities. 🌹
3) 🌹 चैतन्य के बीज - भाग 1 - सच्चा आत्म साधन वही है जो हमारी दृष्टि को बाहरी, अस्थायी चीजों से आंतरिक, शाश्वत चीजों की ओर मोड़ता है। 🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 582 / Bhagavad-Gita - 582 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 11 / Chapter 16 - The Divine and Demoniac Natures - 11 🌴
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 979 / Vishnu Sahasranama Contemplation - 979 🌹
🌻 979. యజ్ఞభుక్, यज्ञभुक्, Yajñabhuk 🌻
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 560 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam - 560 - 1 🌹 
🌻 560. 'దాడిమీ కుసుమ ప్రభా' - 1 / 560. 'dadimi kusuma prabha' - 1 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 చైతన్య బీజాలు - 1వ భాగం - దృష్టిని బాహ్య, తాత్కాలిక విషయాల నుండి అంతర్గత, శాశ్వతమైన వాటికి మార్చడమే నిజమైన ఆత్మ సాధన. 🌹*
*ప్రసాద్ భరద్వాజ*

*ఈ పాఠం చైతన్యం యొక్క స్వభావాన్ని మరియు బాహ్య అనుభవాల తాత్కాలికతను విశ్లేషిస్తుంది. బాహ్య ప్రపంచంలోని విషయాలు తాత్కాలికమని, కాని "నేను ఉన్నాను" అనే నిజం శాశ్వతమని అవగాహన చెందడం ముఖ్యమని ప్రాముఖ్యతను సూచిస్తుంది. ప్రపంచం తాత్కాలికమని తెలుసుకుని, శాశ్వతమైన సత్యాన్ని అన్వేషించేందుకు అంతరంగంలోకి వెళ్ళమని ప్రోత్సహిస్తుంది.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Seeds of Consciousness - Part 1 - True spiritual practice is about shifting our focus from external, temporary things to internal, eternal realities. 🌹*
*Prasad Bharadwaj*

*This text explores the nature of consciousness and the impermanence of external experiences. It emphasizes the importance of inner awareness and understanding that while the external world and its events are temporary, the realization of "I am" is constant and eternal. The text encourages turning inward to recognize the transient nature of the world and to seek the unchanging truth within.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 चैतन्य के बीज - भाग 1 - सच्चा आत्म साधन वही है जो हमारी दृष्टि को बाहरी, अस्थायी चीजों से आंतरिक, शाश्वत चीजों की ओर मोड़ता है। 🌹*
*प्रसाद भारद्वाज*

*यह पाठ चेतना के स्वभाव और बाहरी अनुभवों की अस्थिरता की चर्चा करता है। इसमें आंतरिक जागरूकता और इस समझ पर जोर दिया गया है कि जबकि बाहरी दुनिया और इसके घटनाएँ अस्थायी हैं, "मैं हूँ" का ज्ञान स्थायी और शाश्वत है। यह पाठ हमें भीतर की ओर मुड़ने और संसार की क्षणिकता को समझकर, अपरिवर्तनीय सत्य की खोज करने के लिए प्रेरित करता है।*
🌹🌹🌹🌹🌹


🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 582 / Bhagavad-Gita - 582 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద,. 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 11 🌴*

*11. చిన్తామపరిమేయాం చ ప్రలయాన్తాముపాశ్రితా: |*
*కామోపభోగపరమా ఏతావదితి నిశ్చితా: ||*

*🌷. తాత్పర్యం : ఇంద్రియతృప్తియే మానవుల ముఖ్యావసరమని వారు విశ్వసింతురు. ఆ విధముగా జీవితాంతము వరకును వారి దుఃఖము అపరిమితముగా నుండును.*

*🌷. భాష్యము : అసురస్వభావులు ఇంద్రియభోగమునే జీవితలక్ష్యముగా అంగీకరింతురు. ఆ భావననే వారు మరణము వరకు కొనసాగింతురు. మరణము పిదప వేరొక జన్మమున్నదని గాని, కర్మానుసారము జీవుడు వివిధదేహములను పొందవలసివచ్చునని గాని వారు విశ్వసింపరు. వారి జీవనప్రణాళికలు ఎన్నడును పూర్తికావు. ఒక ప్రణాళిక పిదప వేరొక ప్రణాళికను తయారు చేయుచు పోయెడి వారి ప్రణాళికలు ఎన్నడును పూర్తి కావు. అట్టి అసురస్వభావము కలిగిన మనుజుని అనుభవము నాకు గలదు.*

*మృత్యుశయ్యపై నున్న అతడు తన ప్రణాళికలు ఇంకను పూర్తికాలేదనియు తత్కారణముగా తన ఆయువును కనీసము నాలుగేళ్ళు పొడిగింపుమనియు వైద్యుని ప్రార్థించెను. వైద్యుడు జీవితమును క్షణకాలమును కూడా పొడిగించలేడని అట్టి మూర్ఖులు ఎరగజాలరు. మరణము యొక్క పిలుపు రాగానే మనుజుని కోరికలను పట్టించుకొనుట జరుగదు. మనుజుని ఆయువు విషయమున నియమిత సమయము కంటె ఒక్క క్షణమును సైతము ప్రకృతి నియమములు అంగీకరింపవు.*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 582 🌹*
*✍️ Sri Prabhupada, *📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 11 🌴*

*11. cintām aparimeyāṁ ca pralayāntām upāśritāḥ*
*kāmopabhoga-paramā etāvad iti niścitāḥ*

*🌷 Translation : They believe that to gratify the senses is the prime necessity of human civilization. Thus until the end of life their anxiety is immeasurable.*

*🌹 Purport : The demoniac accept that the enjoyment of the senses is the ultimate goal of life, and this concept they maintain until death. They do not believe in life after death, and they do not believe that one takes on different types of bodies according to one’s karma, or activities in this world. Their plans for life are never finished, and they go on preparing plan after plan, all of which are never finished.*

*We have personal experience of a person of such demoniac mentality who, even at the point of death, was requesting the physician to prolong his life for four years more because his plans were not yet complete. Such foolish people do not know that a physician cannot prolong life even for a moment. When the notice is there, there is no consideration of the man’s desire. The laws of nature do not allow a second beyond what one is destined to enjoy.*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 979 / Vishnu Sahasranama Contemplation - 979 🌹*

*🌻 979. యజ్ఞభుక్, यज्ञभुक्, Yajñabhuk 🌻*

*ఓం యజ్ఞభుజే నమః | ॐ यज्ञभुजे नमः | OM Yajñabhuje namaḥ*

*యజ్ఞం భుఙ్క్తే భునక్తీతి యజ్ఞభుగితీర్యతే*

*యజ్ఞమును అనుభవించువాడును, యజ్ఞమును రక్షించువాడును కనుక యజ్ఞభుక్‌.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 979 🌹*

*🌻 979. Yajñabhuk 🌻*

*OM Yajñabhuje namaḥ*

*यज्ञं भुङ्क्ते भुनक्तीति यज्ञभुगितीर्यते / Yajñaṃ bhuṅkte bhunaktīti yajñabhugitīryate*

*Since He enjoys the vedic sacrificial rituals and also protects it, He is called Yajñabhhuk.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥
యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥
Yajñabhr‌dyajñakr‌dyajñī yajñabhugyajñasādhanaḥ,Yajñāntakr‌dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 560 - 1 / Sri Lalitha Chaitanya Vijnanam  - 560 - 1 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।*
*మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀*

*🌻 560. 'దాడిమీ కుసుమ ప్రభా' - 1 🌻*

*దాడిమీ పుష్పము వంటి కాంతి కలది శ్రీమాత అని అర్ధము. దాడిమీ కుసుమము లేత ఎఱుపు రంగులో నుండును. గులాబీ రంగుగా దీనిని గుర్తింపవచ్చును. శ్రీమాత మేనిఛాయ గులాబీ రంగు కాంతితో ప్రకాశించు చుండును. ముఖము కూడ అట్టి కాంతియే కలిగి ఆకర్షణీయముగ నుండును. పచ్చని పసుపు గాక, ఎఱ్ఱని ఎఱుపు. కాక కోమలమగు వర్ణముగ దాడిమీ కుసుమ ముండును. ఆ పుష్పముతో సరిపోల్చి శ్రీమాత కాంతిని హయగ్రీవుడు ప్రస్తుతి చేయుచున్నాడు.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 560 - 1 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 114. Tanbulapuritamukhi dadimikusumaprabha*
*mrugashi mohini mudhya mrudani mitrarupini  ॥114 ॥ 🌻*

*🌻 560. 'dadimi kusuma prabha' - 1 🌻*

*The meaning here is that Sri Mata possesses a radiance like that of the pomegranate flower (dadimikusuma). The pomegranate flower has a soft red color, which can be identified as a shade of pink. Sri Mata's complexion shines with a pinkish glow (Prabha). Her face also possesses this same radiance, making it highly attractive. Instead of a greenish yellow, it's a soft red. The pomegranate flower is delicate in color, and Hayagriva praises Sri Mata's glow by comparing it to this flower.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment