🌹 15 SEPTEMBER 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹

🍀🌹 15 SEPTEMBER 2024 SUNDAY ALL MESSAGES ఆదివారం, భాను వాసర సందేశాలు🌹🍀
🌹 వామన జయంతి శుభాకాంక్షలు అందరికి / Vamana Jayanthi Greetings to All 🌹
1) 🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 7వ శ్లోకము - దేహంతో, మనస్సుతో, బుద్ధితో, అహంకారంతో మమేకత్వమే నీ బంధానికి, బాధలకు కారణం. 🌹
2) 🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 7 - Identifying with the body, mind, intellect and Ego is the cause of your bondage and suffering. 🌹
3) 🌹 अष्टावक्र गीता - पहला अध्याय - आत्मानुभव उपदेश - 7वाँ श्लोक - देह, मन, बुद्धि और अहंकार के साथ तादात्म्य ही तुम्हारे बंधन और कष्ट का कारण है। 🌹
4) 🌹. శ్రీమద్భగవద్గీత - 583 / Bhagavad-Gita - 583 🌹
🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 12 / Chapter 16 - The Divine and Demoniac Natures - 12 🌴
5) 🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 980 / Vishnu Sahasranama Contemplation - 980 🌹
🌻 980. యజ్ఞసాధనః, यज्ञसाधनः, Yajñasādhanaḥ 🌻
6) 🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 560 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 560 - 2 🌹 
🌻 560. 'దాడిమీ కుసుమ ప్రభా' - 2 / 560. 'dadimi kusuma prabha' - 2 🌻

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 వామన జయంతి శుభాకాంక్షలు అందరికి / Vamana Jayanthi Greetings to All 🌹*
*Prasad Bharadwaj*

*'ధర్మ సంస్థాపనకోసం అవసరమైన సందర్భాల్లో అవతరిస్తూనే ఉంటా'నని శ్రీమహావిష్ణువు అభయ ప్రదానం చేశాడు. ఆ పరంపరలో ఆవిష్కారమైన అయిదోది వామనావతారం. భాద్రపద శుద్ధ ద్వాదశినాడు అదితి, కశ్యపుల కుమారుడిగా శ్రీహరి వామనమూర్తిగా అవతరించాడు. దీన్ని వామన ద్వాదశిగా, విజయ ద్వాదశిగా వ్యవహరిస్తారు. సృష్టిలోని జీవావరణంలో జీవులు సూక్ష్మరూపం నుంచి మహా భారీకాయం వరకు వైవిధ్యభరితంగా గోచరమవుతాయి. ఈ అణుత్వం, మహారూపాలు పరస్పర విరుద్ధమైనవి. కానీ, ఆ వైవిధ్యం ఆత్మ, పరమాత్మల విషయంలో లేదని వేదోక్తి. ఆత్మ అణువు కంటే సూక్ష్మమైనది, మహత్తరమైనది. అది ఎంత సూక్ష్మమైనదో, అంత స్థూలమైనదని కఠోపనిషత్తు ప్రకటించింది. వామనావతార నేపథ్యం ఇదే!*

*వామనావతార విశేషాల్ని శ్రీమద్భాగవతం, వామన పురాణాలు విశదీకరిస్తున్నాయి. ఓసారి బలి చక్రవర్తి ఇంద్రుణ్ని ఓడించి, స్వర్గానికి అధిపతి అయ్యాడు. విజయగర్వంతో రాక్షసులు అనేక అకృత్యాలకు పాల్పడసాగారు. దాంతో దేవతల మాతృమూర్తి అదితి కలత చెంది, కేశవుణ్ని వేడుకుని, అనుగ్రహాన్ని పొందింది. ఫలితంగా నారాయణుడు దేవతల రక్షణార్థం వామనుడిగా అవతరించాడు. అతనికి ఉపనయన సంస్కారాలు జరిగాయి. బ్రహ్మ తేజస్సు, దివ్య యశస్సులతో వెలిగే వటుడైన వామనుడు దండాన్ని, గొడుగును, కమండలాన్ని ధరించి బలి చక్రవర్తి నిర్వహించే యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. 'స్వస్తి జగత్త్రయీ భువన శాసనకర్తకు...' అంటూ బలిని ఆశీర్వదించాడు. సందర్భోచిత లౌక్యాన్ని ప్రదర్శించాడు. వామనుడి వర్చస్సు, వాక్చాతుర్యానికి ముగ్ధుడై బలి చక్రవర్తి ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. 'కేవలం నా పాదాలకే పరిమితమైన మూడు అడుగుల భూమిని మాత్రం నాకివ్వు చాలు' అన్నాడు వామనుడు. ఆ వటుడి రూపంలాగానే అతడి కోరిక కూడా కురచగానే ఉందని బలి భావించాడు. భూ దానానికి సమాయత్తమైన బలిని అతడి గురువు శుక్రాచార్యుడు నిలువరించాడు. అయినా బలి శుక్రుడి మాట వినకుండా, వామనుడికి ఉదకపూర్వకంగా భూమిని దానం చేశాడు. త్రివిక్రముడిగా వామనుడు విరాట్‌ రూపాన్ని సంతరించుకుని, ఓ పాదంతో భూమినీ, మరో పాదంతో స్వర్గాన్నీ ఆక్రమించి, మూడోపాదం బలి శిరస్సుపై ఉంచి, అతణ్ని రసాతలానికి అణగదొక్కాడు. బలి సర్వ సమర్పణా భావానికి ప్రసన్నుడైన వామనుడు సుతల లోక రాజ్యాన్ని అనుగ్రహించాడు. ఇంద్రుడికి తిరిగి స్వర్గలోకాధిపత్యాన్ని కల్పించాడు.*

*వామన పురాణంలో ఇదే గాథను పోలిన మరో వృత్తాంతం గోచరమవుతుంది. దుంధుడు అనే దానవుడు దేవతలపై దండెత్తే బలాన్ని సమకూర్చుకోవడానికి దేవికా నదీ తీరాన అశ్వమేధ యాగం చేయసాగాడు. దుంధుణ్ని యుక్తితో జయించాలని, శ్రీహరి వామన రూపంలో దేవికానదిలో ఓ దుంగలాగా తేలుతూ కొట్టుకుపోసాగాడు. దుంధుడు, అతడి అనుచరులు ఆ బాలుణ్ని రక్షించారు. తన పేరు గతి భానుడనీ, తాను మరుగుజ్జునైనందువల్ల ఆస్తి వివాదాల్లో తనను దాయాదులు నదిలో పడవేశారని చెప్పాడు. అతడి దీనగాథను విని దుంధుడు ఏం కావాలో కోరుకొమ్మన్నాడు. మూడడుగుల నేల కోరిన వామనుడు ఆ సంవిధానంలోనే దుంధుణ్ని భూమిలోకి తొక్కి సమాధి చేశాడని పురాణగాథ.*

*వామనావతారం ఆత్మ తత్వాన్ని అద్భుతంగా ప్రకటించింది. జీవుడు తనలో ఉన్న ఆత్మ, విశ్వాంతరాళంలో ఉన్న పరమాత్మ ఒక్కటేనని జ్ఞానపూర్వకంగా గుర్తించాలి. ఆ స్పృహ ఏర్పడే కొద్దీ వామనరూపం అనూహ్యంగా పెరిగి పెద్దదై, విశ్వవ్యాప్తమై, పరమాత్మ తత్వమై భాసిల్లుతుంది. యజ్ఞయాగాదులనేవి పేరుకోసం చేయవద్దనీ, నేను ప్రభువును, నేను గొప్ప దాతనని గర్వించడం తగదని భగవద్గీత హెచ్చరించింది. పరుల ధనాన్నీ, భూమిని ఆక్రమించడం, దానం చేయడం, నేను కర్తను, భోక్తను అని విర్రవీగేవారు అజ్ఞానులని ఈశావాస్య ఉపనిషత్తు చెబుతోంది. ఈ నేపథ్యమే బలి పతనానికి దారి తీసింది. మనిషి బిందు స్థితిలో బీజప్రాయంగా నిద్రాణంగా ఉన్న శక్తిని ఆత్మవిశ్వాసంతో గుర్తించాలి. దీని ద్వారా మనిషి మహనీయుడిగా ఎదగవచ్చని వామనావతారం సందేశమిస్తుంది.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 అష్టావక్ర గీత - 1వ అధ్యాయం - ఆత్మానుభవోపదేశము - 7వ శ్లోకము - దేహంతో, మనస్సుతో, బుద్ధితో, అహంకారంతో మమేకత్వమే నీ బంధానికి, బాధలకు కారణం. 🌹*
*ప్రసాద్‌ భరధ్వాజ*

*అష్టావక్ర గీతలో 1వ అధ్యాయం, 7వ శ్లోకము, ఆత్మ యొక్క సాక్షి స్వభావం మరియు దేహం, మనస్సు, బుద్ధి, అహంకారంతో మమేకం అవడమే బంధనానికి కారణమని చెప్పడం జరిగింది. ఆత్మ శాశ్వత స్వతంత్రంగా ఉంటే, మనస్సు, ఇంద్రియాలతో మమేకం కాకుండా దానిని సాక్షిగా చూడటం ద్వారా ముక్తి పొందవచ్చు.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 Ashtavakra Gita - Chapter 1 - Teaching of Self-Realization - Verse 7 - Identifying with the body, mind, intellect and Ego is the cause of your bondage and suffering. 🌹*
*Prasad Bharadwaj*

*In Ashtavakra Gita, Chapter 1, Verse 7, it is explained that identifying with the body, mind, intellect, and ego leads to bondage and suffering. The true self is the eternal witness, free from these temporary aspects. By realizing this, one can overcome the illusion of suffering and experience liberation, as the self is pure, indivisible consciousness.*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹 अष्टावक्र गीता - पहला अध्याय - आत्मानुभव उपदेश - 7वाँ श्लोक - देह, मन, बुद्धि और अहंकार के साथ तादात्म्य ही तुम्हारे बंधन और कष्ट का कारण है। 🌹*
*प्रसाद भरद्वाज*

*अष्टावक्र गीता के पहले अध्याय के 7वें श्लोक में बताया गया है कि शरीर, मन, बुद्धि और अहंकार के साथ तादात्म्य ही बंधन और दुख का कारण है। असली आत्मा शाश्वत साक्षी है, जो इन अस्थायी तत्वों से मुक्त है। इस सत्य को पहचानकर, व्यक्ति बंधन के भ्रम को समाप्त कर सकता है और मुक्ति का अनुभव कर सकता है, क्योंकि आत्मा शुद्ध, अविभाज्य चेतना है।*
🌹🌹🌹🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీమద్భగవద్గీత - 583 / Bhagavad-Gita - 583 🌹*
*✍️. శ్రీ ప్రభుపాద, 📚. ప్రసాద్ భరద్వాజ*

*🌴. 16వ అధ్యాయము - దైవాసుర స్వభావములు - 12 🌴*

*12. ఆశాపాశశతైర్బద్దా: కామక్రోధ పరాయణా: |*
*ఈహన్తే కామభోగార్థ మన్యాయేనార్థ సంచయాన్ ||*

*🌷. తాత్పర్యం : వేలాది ఆశాపాశములచే బద్ధులై, కామక్రోధములందు మగ్నులై ఇంద్రియభోగము కొరకు వారు అధర్మమార్గము ద్వారా ధనమును గడింతురు.*

🌷. భాష్యము :

🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Bhagavad-Gita as It is - 583 🌹*
*✍️ Sri Prabhupada, 📚 Prasad Bharadwaj*

*🌴 Chapter 16 - The Divine and Demoniac Natures - 12 🌴*

*12. āśā-pāśa-śatair baddhāḥ kāma-krodha-parāyaṇāḥ*
*īhante kāma-bhogārtham anyāyenārtha-sañcayān*

*🌷 Translation : Bound by a network of hundreds of thousands of desires and absorbed in lust and anger, they secure money by illegal means for sense gratification.*

🌹 Purport :

🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. విష్ణు సహస్ర నామ తత్వ విచారణ - 980 / Vishnu Sahasranama Contemplation - 980 🌹*

*🌻 980. యజ్ఞసాధనః, यज्ञसाधनः, Yajñasādhanaḥ 🌻*

*ఓం యజ్ఞసాధనాయ నమః | ॐ यज्ञसाधनाय नमः | OM Yajñasādhanāya namaḥ*

*తత్ప్రాప్తౌ సాధనం యజ్ఞా ఇత్యతో యజ్ఞసాధనః*

*ఆ పరమాత్ముని పొందుట విషయమున చిత్తశుద్ధి ద్వారమున జ్ఞానమును కలిగించుటకు హేతువులగుచు యజ్ఞములు సాధనములుగా ఉన్నవి కనుక ఆ పరమాత్ముడు యజ్ఞసాధనః.*

సశేషం... 
🌹 🌹 🌹 🌹 🌹 

*🌹. VISHNU SAHASRANAMA CONTEMPLATION- 980🌹*

*🌻 980. Yajñasādhanaḥ 🌻*

*OM Yajñasādhanāya namaḥ*

*तत्प्राप्तौ साधनं यज्ञा इत्यतो यज्ञसाधनः / Tatprāptau sādhanaṃ yajñā ityato yajñasādhanaḥ*

*Since Vedic sacrificial rituals, which are performed sincerely and thus lead to enlightenment, are the means to attain Him, He is called Yajñasādhanaḥ.*

🌻 🌻 🌻 🌻 🌻 
Source Sloka
यज्ञभृद्यज्ञकृद्यज्ञी यज्ञभुग्यज्ञसाधनः ।यज्ञान्तकृद्यज्ञगुह्यमनमन्नाद एव च ॥ १०५ ॥
యజ్ఞభృద్యజ్ఞకృద్యజ్ఞీ యజ్ఞభుగ్యజ్ఞసాధనః ।యజ్ఞాన్తకృద్యజ్ఞగుహ్యమనమన్నాద ఏవ చ ॥ 105 ॥
Yajñabhr‌dyajñakr‌dyajñī yajñabhugyajñasādhanaḥ,Yajñāntakr‌dyajñaguhyamanamannāda eva ca ॥ 105 ॥

Continues....
🌹 🌹 🌹 🌹🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹

*🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము  - 560 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam  - 560 - 2 🌹*
*🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻*
*✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్*
*సేకరణ : ప్రసాద్ భరద్వాజ*
*🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం  శ్రీమాత్రే నమః 🍁*

*🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।*
*మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀*

*🌻 560. 'దాడిమీ కుసుమ ప్రభా' - 2 🌻*

*ఈ కాంతి సర్వ బాధలను శమింప జేయును. బాధలలో నున్నవారికి ఈ కాంతి పుష్పము నిచ్చుట సంప్రదాయము. దాడిమీ వృక్షమనగా దానిమ్మ చెట్టు అని కొందరి మతము. దానిమ్మ వృక్షములందు కూడ పువ్వులు మాత్రమే పూచు వృక్షము కలదు. అట్టి వృక్షపు పువ్వు కాంతి కలది శ్రీమాత. ఎట్లైననూ ఆకర్షణీయమగు దేహకాంతి కలది శ్రీమాత అని అవగాహన చేసుకొనవలెను.*

*సశేషం...*
🌹 🌹 🌹 🌹 🌹

*🌹 Sri Lalitha Chaitanya Vijnanam  - 560 - 2 🌹*
*Contemplation of 1000 Names of Sri Lalitha Devi* 
*✍️ Prasad Bharadwaj*

*🌻 114. Tanbulapuritamukhi dadimikusumaprabha*
*mrugashi mohini mudhya mrudani mitrarupini  ॥114 ॥ 🌻*

*🌻 560. 'dadimi kusuma prabha' - 2 🌻*

*This glow is said to soothe all forms of suffering. It is customary to offer this radiant flower to those in distress. Some interpret the dadimi tree as the 'Danimma' (pomegranate) tree. Among pomegranate trees, there are some that only bloom with flowers. Sri Mata is likened to the radiant flower of such a tree. In any case, it should be understood that Sri Mata possesses a highly attractive bodily radiance.*

*Continues...*
🌹 🌹 🌹 🌹 🌹

🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹  
🍀🌹🍀🌹🍀🌹🍀🌹🍀🌹
#నిత్యసందేశములు #DailyMessages 
Join and Share 
🌹. చైతన్య విజ్ఞానం Spiritual wisdom YouTube FB Telegram groups 🌹
https://www.youtube.com/channel/UC6UB7NB3KJ_CSrdwnokH_NQ
https://t.me/ChaitanyaVijnanam
https://t.me/Spiritual_Wisdom 
https://t.me/+9zDjTpPe_PQzMWVl
https://t.me/Sivasutras
https://t.me/Seeds_Of_Consciousness
https://t.me/bhagavadgeethaa/
https://t.me/AgniMahaPuranam
https://t.me/+LmH1GyjNXXlkNDRl
http://www.facebook.com/groups/srilalithachaitanyavijnanam/
https://dailybhakthimessages.blogspot.com
https://incarnation14.wordpress.com/
https://prasadbharadwaj.wixsite.com/dailybhaktimessages3
https://www.threads.net/@prasad.bharadwaj

No comments:

Post a Comment