🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 561 - 2 / Sri Lalitha Chaitanya Vijnanam - 561 - 2 🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతీ కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🍁. మూల మంత్రము : ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 114. తాంబూల పూరిత ముఖీ, దాడిమీ కుసుమప్రభా ।
మృగాక్షీ, మోహినీ, ముఖ్యా, మృడానీ, మిత్రరూపిణీ ॥ 114 ॥ 🍀
🌻 561. 'మృగాక్షీ' - 2 🌻
భూమి తిరుగుచున్నట్లు గోచరించు చున్నదా? కాని మహా వేగముతో తిరుగుచున్నది. మొక్క పెరుగుచున్నట్లు గోచరించు చున్నదా? కాని పెరుగుచునే యుండును. కాలము జరుగుచున్నట్లు గోచరించు చున్నదా? గాని కదలుచునే యుండును. ఆమె నాగిని. నిత్యమూ కదలుచూ, కదలనట్లుండును. ఇట్లు శ్రీమాత కన్నులు జింక కన్నులవలె సరిపోల్చుటలో గంభీరమగు భావము గోచరించును. మృగము అనగా కదలునది అని అర్థము కలదు. సమస్తమునూ కదలించుచు, దానిని వీక్షించుచు, పర్యవేక్షించుచు, రక్షించుచూ నుండుట శ్రీమాత కన్నుల విశేషము. కన్నులతోనే సమస్త సృష్టి గావించి పోషించు చుండును. కదలిక యందును, కదలికకు ఆవలను కూడ యుండునది శ్రీమాత.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 561 - 2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️ Prasad Bharadwaj
🌻 114. Tanbulapuritamukhi dadimi kusuma prabha
mrugashi mohini mudhya mrudani mitrarupini ॥114 ॥ 🌻
🌻 561. 'Mrugashi' - 2 🌻
Does the Earth seem to be moving? Though it does not seem so, it spins at a great speed. Do plants appear to be growing? Yet, they are constantly growing. Does time appear to be passing? Though it is invisible, time is always moving forward. She is like a serpent, continuously in motion, yet appearing still. This comparison of Shri Mata’s eyes to those of a deer holds profound meaning. The word "mṛuga" (deer) also means "that which moves." Her eyes signify that she is the one who moves everything, observes everything, oversees and protects everything. Through her eyes alone, she sustains and nurtures the entire creation. Shri Mata exists both in movement and beyond it.
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment