మహిషాసురమర్థినీ Mahishasuramardini

శ్రీ దేవి శరన్నవరాత్రులు 9వ రోజు 11/10/2024 ఇంద్రకీలాద్రిపై ఉదయం : "శ్రీ మహిషాసురమర్థినీ దేవి" గా దర్శనం

🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁


శ్లో|| మహిషమస్తక నృత్తవినోదిని, స్ఫుటరణన్మణి నూపుర మేఖలా, జననరక్షణ మోక్షవిధాయినీ, జయతి శుంభనిశుంభ నిషూదినీ

నవ అవతారాల్లో మహిషాసురమర్దిని ని మహోగ్రరూపంగా భావిస్తారు. మహిషాసురుని సంహరించిన అశ్వయుజ శుద్ధ నవమిని ‘మహర్నవమి’ గా జరుపు కుంటారు. సింహవాహనాన్ని అధిష్టించి ఆయుధాలను ధరించిన చండీ సకల దేవతల అంశలతో మహాశక్తి స్వరూపంగా దర్శన మిస్తుంది. ఈ తల్లిని పూజిస్తే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. మహిషాసురమర్దిని ఆరాధన వల్ల భయాలన్నీ తొలగిపోతాయి. సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది.


నైవేద్యం:

ఈ రోజున నైవేద్యంగా రవ్వ చక్కర పొంగలి సమర్పిస్తారు.


శ్రీ మహిషాసురమర్ధనీదేవ్యై నమః

🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋🍋


No comments:

Post a Comment