🌹 విజ్ఞానము - వేదాంతము 🌹
(దేహో దేవాలయ ప్రోక్తః)
గ్రంధులు - చక్రాలు 2 :
✍ భట్టాచార్య
సవ్యమైన గ్రంధుల స్రావము మన శరీరంలో ఉంటే దానిని అమృతం ఉంటారు. అమృత స్రావము మన శరీరంలో 72,000 నాడుల్లో సరిగ్గా ప్రవహించినప్పుడు నీవు పరిపూర్ణమైనటువంటి వ్యక్తి గా మారతావు. అది భారతీయ యోగశాస్త్రం ప్రపంచానికి అందజేసినటువంటి ఆదర్శం ,లక్ష్యం.
జీవాత్మ ఉంది. ఆ జీవాత్మ శరీరాలను నిర్మించుకుంటుంది. శరీరాలు నిర్మించుకున్నటువంటి జీవాత్మ...తన పరిణామ క్రమంలో రకరకాల స్థాయిలు దాటి ఒక స్థాయికి వచ్చిన తర్వాత తానే భగవత్ స్వరూపం గా మారుతుంది అని అంటాము. కాని ఇది నిరూపించడానికి చాలా కాలం పడుతుందేమో!
పదార్థం, ఆత్మ లేదా చేతనత్వం వైపు వెళ్లాలి. ఆత్మ లేక చేతనత్వము పదార్థం లోపలకు వెళ్ళాలి. ఇవి రెండు వేరు వేరు గానే ఉంటాయి. పదార్థం పదార్థం గానే ఉంటుంది. చేతనత్వం, చేతనత్వం గానే ఉంటుంది. చేతనత్వం పదార్ధాన్ని ఉపయోగించుకుంటూ.... "నేను" పదార్థం కాను అని తెలుసు కోవాలి. పదార్థం పదార్థం గానే ఉంటుంది. అది సృష్టించబడదు. నశించబడదు. అలాగే శక్తిని కూడా సృజింపలేము.నాశము చేయలేము. (Law of conservation of mass and law of conservation of energy) ఈ నియమాలను ఆధునిక సైన్సు ప్రతిపాదించింది. అందుచేత పదార్ధం పదార్ధమే. చేతనత్వం మారదు. కానీ చేతనత్వపు స్థాయిలలో మార్పు ఉంటుంది.
చేతనత్వానికి శాస్త్రవేత్తలు వాడే పదం ఏమిటంటే... "శక్తి". శక్తి మారదు. మరియు నాశనం చేయబడదు. ఇప్పుడు శక్తి పదార్థాలను ఉపయోగించు కొంటుంది. ఉపయోగించుకొని "నేను" పదార్ధాన్ని అంటుంది. నేను పదార్థమును. నేను ఈ శరీరాన్ని అనుకుంటుంది. అది మాయ. అది పోగొట్టుకోవాలి. అంతేగానీ ప్రకృతిలో మాయ లేదు. అంతా వాస్తవమే.
గ్రంధులను రెండు రకాలుగా విభజించవచ్చు 1. lymphatic glands. మానవ శరీరంలో ఉన్న చెత్తాచెదారాన్ని బయటకు పంపడానికి ఉపయోగపడతాయి. అందుచేత వీటిని "డ్రైనేజీ గ్రంధులు" అంటారు. బ్రహ్మాండం లో ఉన్నది పిండంలో ఉంటుంది.
1. Lymphatic glands కదా! రెండవ రకం గ్రంధులు మరల రెండు రకాలు. అందులో ఒకటి (duct glands ) నాళ గ్రంధులు. రెండవది (duct less glands) వినాళ గ్రంధులు. నాళ గ్రంధులకు ఉదాహరణ... నోటిలో ఉన్న లాలాజల గ్రంధులు, చర్మంలో ఉన్న స్వేదగ్రంధులు, పాంక్రియాస్, లివర్ మొదలగునవి.
రెండో రకమైన వినాళ గ్రంధులు (duct less glands).... ఇవి వాహన నాళికలు లేకుండా, వాటి స్రావాలు రక్తంలోకి నేరుగా శోషించబడతాయి. ఈ వినాళగ్రంధులను "ఎండోక్రైన్ అవయవాలు" అంటారు. అవి ఉత్పత్తి చేసే పదార్థాలను అంతః స్రావాలు అంటారు. కానీ అవి పనిచేసే తీరు ఎండోక్రైన్ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది.
1. పీనియల్ గ్రంధి : సహస్రారము.... ఈ గ్రంథి మనలను కాంతి ఎలా ప్రభావితం చేస్తుందో తెలుపుతుంది. మానవజాతి ఎప్పుడైతే విద్యుత్తుని ఉపయోగించుకొని కాంతిని ఉపయోగించుకోవడం మొదలుపెట్టిందో, అప్పటి నుండి మన సహస్రార చక్రం జాగృతం అవుతోంది. ఈ గ్రంధి లింగ స్వభావం sex nature మీద కూడా ఖచ్చితమైన ప్రభావాన్ని చూపిస్తుంది. Brain growth మీద కూడా దీని ప్రభావం ఉంటుంది మన పూర్వీకులు పీనియల్ గ్లాండ్ అనే ఆత్మ యొక్క స్థానం గా గుర్తించారు. బాల్యావస్థలో, చాలా ప్రముఖ పాత్ర వహించే ఈ గ్రంధి తర్వాత కుంచించుకుపోవడం ఒక ఆధ్యాత్మిక రహస్యాన్ని తెలుపుతున్నట్లు ఉంది.
ఫ్రెండ్స్ దార్శనికుడు rene descarte ప్రకారము పీనియల్ గ్లాండ్, మనస్సు - మెదడు కలిసే స్థానము అనగా మెదడు, మనస్సు యొక్క కర్మేంద్రియము, మనస్సు మెదడు యొక్క జ్ఞానేంద్రియము. ఈ విషయాన్ని ఆదిశంకరుడు సౌందర్యలహరి లో ఇలా అన్నారు.
సుధా సారా సారై - శ్చరణ ,యుగాళాన్తరవి గళితైః ప్రపంచం సిన్చంతి - పునరపి రసామ్నాయ మహాసా
అవాప్యత్వాం భూమిం భుజగ నిభ మధ్యుష్ట వలయం -స్వమాత్మానాం కృత్వా స్వపిషి కుల కుండే ,విహరిణి
తాత్పర్యం : కుమారీ !నీ రెండు పాదాల మధ్య నుండి స్రవించే అమృత ధారా వర్షం చేత ,72000నాడులను తడు పుతూ ,దాన్ని అమృత కిరాణ కాంతి గల చంద్రుని వది లేసి ,మళ్ళీ మూలాధారానికి చేరి ,అందులో స్వ రూపం అయిన పాముల చుట్టలు గా చుట్టూ కోని ,పృధ్వీ తత్వం లోని సన్నని రంధ్రం ద్వారా ,కుండలినీ శక్తి వై, నువ్వు నిద్రిస్తావు .
ఈ వివరణ పీనియల్, పిట్యూటరీ గ్రంధుల జీవాత్మ లో ఉన్న గురువు యొక్క చరణయుగళం గా గుర్తించాలి.
అనేకమంది ప్రాచీన తత్వవేత్తలకు ఇది ఆత్మ నివసించే స్థానమే. Pine Cone ఆకృతి కలిగిన ఈ చిన్న నిర్మాణం ఇప్పటికీ రహస్యంగానే ఉండిపోయింది. నేటి వైజ్ఞానికులకు మాత్రం ఇది ఒక ఆంతరిక గడియారం వలే పని చేస్తుందని నిర్ణయానికి వచ్చారు. అత్యంత చీకట్లో దాగి ఉన్నప్పటికీ, ఇది కాంతి తీవ్రతకు పరోక్షంగా స్పందిస్తుంది. ఈ గ్రంథికి కావలసిన వివరాలు కన్నుల ద్వారా అందచేయబడతాయి. సంధ్యా సమయం ఆసన్నమైనప్పుడు మాత్రమే ఈ గ్రంధి సక్రియం అవుతుంది. melanine అనే హార్మోను స్రవించడం మొదలు పెడుతుంది. సూర్యోదయం కాగానే ఈ మెలనిన్ ఉత్పత్తి ఆగిపోతుంది.
2. పిట్యుటరీ గ్రంధి : నిజానికి ఇది రెండు గ్రంధుల కలయిక. యాంటీరియర్ అండ్ పొష్టీరియర్ ఇది లింగ స్వభావానికి కామోద్రేకానికి సంబంధించినది. periodic phenomenon (ఒక పద్ధతి ప్రకారం మరల మరల వచ్చే సంఘటనలు) ....ఉదా: నిద్ర, ఋతుస్రావాలు మొదలగునవి....దీని ద్వారా నియంత్రించ బడతాయి.
ఇది నిరంతర కృషి కి సంబంధించిన గ్రంధి. శక్తిని ఉపయోగించుకొనే గ్రంధి. ఇది జీవితంలో చాలా ప్రముఖపాత్ర వహిస్తుంది. పిట్యూటరీ గ్రంథి యొక్క insufficient development అతి స్పష్టమైన నైతిక మరియు బౌద్ధిక తగ్గుదలను చూపిస్తుంది. "సెల్ఫ్ కంట్రోల్" లేకపోవడాన్ని సూచిస్తుంది.
ముందున్న పిట్యూటరీ భాగము మాతృభావన దాంపత్య జీవితమును(maternal-sexual instincts) నియంత్రణ చేస్తుంది. దీని సక్రియమైన పనితీరు వ్యక్తిలోని సృజనాత్మక శక్తిని పెంపొందిస్తుంది. మరియు కోమల భావాలకు శక్తినిస్తుంది. దీనినే గురుదేవులు పండిత శ్రీరామ శర్మ ఆచార్య "సజల శ్రద్ధ "అంటే మాతృ శక్తి అన్నారు.
వెనుక పిట్యూటరీ గ్రంథి, ప్రజ్ఞను (intellect) పెంచుతుంది. సిద్ధాంతాల ద్వారా , abstract ideas ద్వారా, వాతావరణాన్ని మార్చగలిగే శక్తి నిస్తుంది. దీనినే గురుదేవులు "ప్రఖర ప్రజ్ఞ" అన్నారు.
"హం, క్షం" దళాలుగా గల ఆజ్ఞాచక్రం ఈ శివ శక్తుల కలయికను తెలుపుతుంది. దీనినే ఆదిశంకరులవారు "శివశక్త్యా యుక్తో...." అన్నారు.
(సశేషము)
🌹🌹🌹🌹🌹

No comments:
Post a Comment